ఆస్పిరిన్ గుండెపోటును అడ్డుకోదు!

గుండెపోటు వచ్చినవారికి మళ్లీ ఆ ముప్పు తగ్గించేందుకు ఆస్పిరిన్ ఉపయోగపడదని తాజా అధ్యయన ఫలితాలు తేలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వృద్ధులు సరైన కారణం లేకుండా ఆస్పిరిన్ తీసుకుంటున్నారని అంటున్నారు పరిశోధకులు.

news18-telugu
Updated: January 21, 2019, 10:53 PM IST
ఆస్పిరిన్ గుండెపోటును అడ్డుకోదు!
గుండెపోటు వచ్చినవారికి మళ్లీ ఆ ముప్పు తగ్గించేందుకు ఆస్పిరిన్ ఉపయోగపడదని తాజా అధ్యయన ఫలితాలు తేలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వృద్ధులు సరైన కారణం లేకుండా ఆస్పిరిన్ తీసుకుంటున్నారని అంటున్నారు పరిశోధకులు.
  • Share this:
గుండె జబ్బులు ఉన్నవారికి ఆస్పిరిన్ కాంబినేషన్‌తో మందులు సూచిస్తుంటారు. అయితే రోజూ ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల గుండెపోటు రిస్క్‌ను తగ్గించదని, ఆయుష్షును పెంచదని తాజా అధ్యయనంలో తేలింది. ఆస్పిరిన్ మందుల్ని క్రీస్తు పూర్వం 16వ శతాబ్దం నుంచి నొప్పి తగ్గించేందుకు ఉపయోగిస్తున్నారు. అప్పట్లో పాపిరస్, విల్లో చెట్ల బెరడును నమిలేవాళ్లు. 1898లో కృత్రిమ తయారీ మొదలైంది. 1960 నుంచి గుండెపోటు ముప్పును తగ్గించేందుకు ఆస్పిరిన్‌ వేసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. అయితే గుండెపోటు వచ్చినవారికి మళ్లీ ఆ ముప్పు తగ్గించేందుకు అది ఉపయోగపడకపోవచ్చన్నది తాజా అధ్యయన ఫలితాలు తేలుస్తున్నాయి.

న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో మూడు అధ్యయనాలను ప్రచురించారు. వాటి ప్రకారం లో డోస్ ఆస్పిరిన్(100ఎంజీ) ట్యాబ్లెట్‌ను 70 ఏళ్ల వయస్సున్న ఆరోగ్యవంతులకు రోజూ ఇవ్వడం వల్ల ఆయుష్షును పెంచదని తేలింది. ఆస్ట్రేలియా, అమెరికాలో ఏడేళ్ల పాటు ఆస్పిరిన్ వాడినవారి 19,000 మంది రిపోర్టులు అధ్యయనం చేసి ఈ ఫలితాలను వెల్లడించారు. ఇది కేవలం ప్లసిబో ఎఫెక్ట్ మాత్రమేనన్నది పరిశోధకుల వాదన. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వృద్ధులు సరైన కారణం లేకుండా ఆస్పిరిన్ తీసుకుంటున్నారని, దానివల్ల ఎలాంటి లాభం లేదని, రక్తప్రసకణ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

వీడియో గేమ్ ఆడితే విడాకులేనా?Video: 'బుద్ధ డైట్' గురించి మీకు తెలుసా?

Video: ఫోన్ ఎక్కువగా వాడితే ఆ జబ్బు గ్యారెంటీ!
First published: January 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు