లవ్... సెక్స్... ధోఖా: భార్యతో శృంగారానికి భర్త ఎందుకు ఇష్టపడలేదు?

శ్రేయ, సంజీవ్ దంపతులకు చాలా ఘనంగా పెళ్లి జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా... సంజీవ్‌ని కలిసేందుకు అవకాశం లభించింది. ఒకర్నొకరు తెలుసుకోవడానికి అవకాశం దొరికిందని అనుకున్నారు. అలా పెళ్లికి ముందు కొన్నిసార్లు కలిశారు. ఇద్దరి మనసులు కలిశాయి. అంతా బాగుంది అనిపించింది శ్రేయకు. అందుకే పెళ్లికి ఒప్పుకుంది. కానీ తర్వాత పరిస్థితులు వేరు.

news18-telugu
Updated: January 18, 2019, 10:54 PM IST
లవ్... సెక్స్... ధోఖా: భార్యతో శృంగారానికి భర్త ఎందుకు ఇష్టపడలేదు?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి ముందు ఢిల్లీకి చెందిన యువతి తనకు కాబోయే భర్తను కలిసింది. ఒకర్నొకరు తెలుసుకునేందుకు ఇది మంచి అవకాశం అనుకుంది. కానీ... ఆ యువకుడు దాచిన ఓ రహస్యం చివరకు వారి పెళ్లిని పెటాకులు చేసింది. పెళ్లైన కొన్ని నెలల్లోనే విడాకులకు కారణమైంది. ఢిల్లీలో ఓ డిటెక్టీవ్ బయటపెట్టిన ఈ ప్రేమ... పెళ్లి... మోసం... అక్షరాలా నిజం. డిటెక్టీవ్ అంటే కేవలం నేరాలను మాత్రమే దర్యాప్తు చేయరు. మానవ సమాజంలోని కుతంత్రాలు, మోసాలను బయటపెడుతుంటారు. సమాజంలో మామూలుగా కనిపించే వ్యక్తులు, వారి సంబంధాల్లో కనిపించని చాలా నేరాలుంటాయి. మోసాలుంటాయి. మానవసంబంధాల చుట్టూ జరుగుతున్న అలాంటి ఛీటింగ్‌లను బయటపెట్టారు ఓ డిటెక్టీవ్.

పెళ్లి... రెండు మనస్సులు ఒక్కటయ్యే వేడుక. అంతే కాదు... పెళ్లి తర్వాత రెండు శరీరాలూ ఏకమౌతాయి. కానీ ఢిల్లీకి జరిగిన ఆ యువతికి పెళ్లి తర్వాత అలాంటి ముచ్చట తీరలేదు. శృంగార జీవితంలో ఎలాంటి సంతోషాలు లేవు. కారణం... ఆమె భర్త శారీరకంగా దగ్గర కాకపోవడమే. ఎందుకో అర్థం కాలేదు. తన భర్తకు వివాహేతర సంబంధాలున్నాయా? లేక సుఖవ్యాధులేమైనా వచ్చాయా? ఇంకేవైనా కారణాలున్నాయా? ఇలా ఆమెకు ఎన్నో అనుమానాలు. కానీ నిజం మాత్రం తెలియలేదు.

శ్రేయ, సంజీవ్ దంపతులకు చాలా ఘనంగా పెళ్లి జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా... సంజీవ్‌ని కలిసేందుకు అవకాశం లభించింది. ఒకర్నొకరు తెలుసుకోవడానికి అవకాశం దొరికిందని అనుకున్నారు. అలా పెళ్లికి ముందు కొన్నిసార్లు కలిశారు. ఇద్దరి మనసులు కలిశాయి. అంతా బాగుంది అనిపించింది శ్రేయకు. అందుకే పెళ్లికి ఒప్పుకుంది. కానీ తర్వాత పరిస్థితులు వేరు.


లవ్... సెక్స్... దోఖా: భార్యతో శృంగారానికి భర్త ఎందుకు ఇష్టపడలేదు?పెళ్లి వరకు అంతా బాగానే జరిగింది. కానీ సంజీవ్ వైఖరిలో మార్పు కనిపించింది. శ్రేయతో అతను బాగానే ఉండేవాడు. ఇద్దరూ బాధ్యతగా ఉండేవారు. కానీ సమస్యంతా చీకటి పడ్డాకే. కొత్త జంట... శృంగార జీవితాన్ని ఎంతో బాగా ఎంజాయ్ చేయాలి. కానీ శ్రేయకు ఆ ముచ్చట మాత్రం తీరలేదు. బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే సంజీవ్ నిద్రపోయేవాడు. శ్రేయ ఒత్తిడి చేసినా ఆమెతో శారీరకంగా కలిసేవాడు కాదు. అమ్మాయి కావడంతో శ్రేయ ఎక్కువ చొరవ తీసుకోలేకపోయింది. ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. ఈ విషయం గురించి భర్తతో మాట్లాడేందుకు శ్రేయ ఎన్నిసార్లు ప్రయత్నించినా అతను తప్పించుకునేవాడు. సంజీవ్ తనకు తెలియకుండా ఏదో దాస్తున్నాడని అనుకుంది. కానీ అదేంటో పసిగట్టలేకపోయింది. ఎవరితోనైనా ఎఫైర్ ఉందేమో అన్న అనుమానంతో సంజీవ్ ఫోన్ చెక్ చేసేది. తన బెస్ట్ ఫ్రెండ్‌తో ఇవన్నీ చెప్పుకొని బాధపడింది. సంజీవ్ తనకు దగ్గరయ్యేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు.

ఓసారి సంజీవ్ ఫోన్‌లో అశ్లీలమైన ఫోటోలు, సందేశాలు, ఫేక్ కాంటాక్ట్స్ కనిపించాయి. దీంతో శ్రేయకు అనుమానాలు పెరిగాయి. ఆ ఫోన్ నెంబర్లను నోట్ చేసుకుంది. ఆ తర్వాత ఆ నెంబర్ గురించి తన స్నేహితురాలితో మాట్లాడింది. ఆ ఫోన్‌కి కాల్ చేస్తే ఎవరో లిఫ్ట్ చేశారు. ఆ కాల్ మాట్లాడింది అబ్బయే అని తేలింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తన స్నేహితురాలు ఇచ్చిన సలహాతో ప్రైవేట్ డిటెక్టీవ్‌ని కాంటాక్ట్ చేసింది శ్రేయ. ఈ కథలో ఎలాంటి క్లూ లేదు. దీంతో మిస్టరీ ఛేదించడానికి కొంత సమయం పట్టేలా ఉందని డిటెక్టీవ్‌కు అర్థమైంది.

లవ్... సెక్స్... దోఖా: భార్యతో శృంగారానికి భర్త ఎందుకు ఇష్టపడలేదు?
ఆ డిటెక్టీవ్ సంజీవ్‌ను చాలా దగ్గరగా గమనించారు. కదలికలపై నిఘా పెట్టారు. మూడునాలుగు వారాల్లో సంజీవ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన సుషీల్, రాజా గురించి తెలుసుకున్నారు. ఈ ముగ్గురూ మరో ముగ్గురు, నలుగురితో కలిసి స్నేహితుల ఫ్లాట్స్‌లో కలిసేవారు. వారిలో ఒక అమ్మాయి కూడా లేదు. ఆ తర్వాత డిటెక్టీవ్ బృందంలోని కొందరు సంజీవ్ కుటుంబ సభ్యులతో స్నేహం చేశారు. సంజీవ్ గురించి ఆరా తీశారు. కానీ ఎలాంటి క్లూ దొరకలేదు. రెండు నెలలు గడిచినా సంజీవ్ ఏవైనా తప్పుడు చర్యలకు పాల్పడుతున్నట్టు సమాచారం మాత్రం లభించలేదు. శ్రేయ ఇచ్చిన ఫోన్‌ నెంబర్ రాజాది. స్నేహితులందరూ అశ్లీల ఫోటోలు, సందేశాలు షేర్ చేసుకోవడం మామూలే కాబట్టి ఆ విషయంపై డిటెక్టీవ్ పెద్దగా దృష్టిపెట్టలేదు.


నిజమేంటో తెలుసుకోవడానికి సంజీవ్‌పైనే దృష్టిపెట్టారు. ఏదైనా అసాధారణంగా అనిపిస్తే సమాచారం ఇవ్వాలని శ్రేయకు చెప్పారు. కొన్ని రోజుల తర్వాత శ్రేయ సంజీవ్ ఫోన్‌ మొత్తం చెక్ చేసింది. అందులో అబ్బాయిలు దుస్తులు లేకుండా ఉన్న అశ్లీల ఫోటోలు కనిపించాయి. ఆమె షాకైంది. అవి రాజాకు చెందిన ఫేక్ కాంటాక్ట్ నుంచి వచ్చిన ఫోటోలు. ఆ క్లూ ఆధారంగా రాజా, సుశీల్‌పై నిఘా పెంచారు. కొన్ని రోజుల తర్వాత వాళ్లు ఓ ప్రైవేట్ క్లబ్‌లో కనిపించారు. అక్కడ అమ్మాయిలకు ఎంట్రీ లేదు. అంటే అది కేవలం అబ్బాయిల కోసం ఏర్పాటు చేసిన క్లబ్. ఆ క్లబ్ గురించి ఆరా తీస్తే అది గే క్లబ్ అని తేలింది.

లవ్... సెక్స్... దోఖా: భార్యతో శృంగారానికి భర్త ఎందుకు ఇష్టపడలేదు?

రాజా, సుశీల్ గే అని గుర్తించారు. వారికి సంజీవ్‌తో ఎలాంటి సంబంధాలున్నాయని నిఘా పెట్టారు. అప్పుడప్పుడూ రాత్రి వేళల్లో సంజీవ్ వీరిద్దరి దగ్గరే ఉండేవాడు. దీంతో అనుమానం మరింత పెరిగింది. చివరికి ఓ రోజు సంజీవ్ కూడా గే క్లబ్‌కు వెళ్తుండగా డిటెక్టీవ్ బృందం ఫోటోలు తీసింది. అంతేకాదు... కొన్నిసార్లు చీకట్లో పార్క్ చేసిన కారులో స్నేహితులంతా గడిపేవారు. వాళ్లంతా లైంగిక కార్యకలాపాల్లో ఉన్న సమయంలో వీడియోలు తీశారు. ఆరు నెలల తర్వాత సంజీవ్ గే అన్న ఆధారాలు లభించాయి. ఇదే విషయాన్ని శ్రేయకు చెప్పారు. ఆధారాలన్నీ అందించారు. తన భర్త గే అన్న విషయం తెలుసుకొని శ్రేయ షాకైంది. బాధపడింది. ఎంతో ఆగ్రహంతో ఉంది. అన్ని ఆధారాలు తీసుకొని చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. విడాకుల పిటిషన్‌లో శ్రేయ చేసిన ఆరోపణల్ని సంజీవ్ ఖండించాడు. అయితే అప్పటికే ఆధారాలన్నీ ఉండటం, డిటెక్టీవ్ బృందం కూడా సాక్ష్యం చెప్పడంతో విడాకులు వచ్చాయి.

(ఢిల్లీకి చెందిన డిటెక్టీవ్ తర్లిక లాహిరి దర్యాప్తు చేసిన కేసు ఇది. ఇందులో పాత్రల పేర్లు మార్చాం.)
First published: January 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు