Home /News /life-style /

LOVE YOURSELF TOO MUCH COULD BE BECAUSE OF CHILDHOOD ABUSE OR EXCESSIVE PARENTAL PAMPERING UMG GH

Personality Disorder: మిమ్మల్ని మీరు అతిగా ప్రేమించుకుంటున్నారా..? అయితే ఇది అదే.. ఓసారి చదవండీ..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొంత మంది చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. తమను తాము అతిగా ప్రేమించుకుంటున్నట్లు చెబుతుంటారు. ఎవ్వరికీ దగ్గర కాలేరు. కొన్నిసార్లు జీవితంపై అసంతృప్తిగా మాట్లాడతారు. ఇలాంటి వ్యక్తులు నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతూ ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...
కొంత మంది చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. తమను తాము అతిగా ప్రేమించుకుంటున్నట్లు చెబుతుంటారు. ఎవ్వరికీ దగ్గర కాలేరు. కొన్నిసార్లు జీవితంపై అసంతృప్తిగా మాట్లాడతారు. ఇలాంటి వ్యక్తులు నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతూ ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. చిన్నతనంలో మానసికంగా, శారీరకంగా ఎదుర్కొన్న వేధింపులు లేదా తల్లిదండ్రుల నిర్లక్ష్యం, అతి గారాభంతో ఈ డిజార్డర్‌ తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. ఈ వ్యక్తులు లవ్‌ యువర్‌ సెల్ఫ్‌(మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి) అనే సలహాను చాలా సీరియస్‌గా తీసుకుంటారని నిపుణులు పేర్కొన్నారు. రోజంతా ప్రశంసలు, అటెన్షన్‌ కోరుకుంటారని తెలిపారు. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్‌(Narcissistic Personality Disorder)తో బాధపడుతూ ఉండే వారిని మేనేజ్‌ చేయడం చాలా కష్టమని చెప్పారు.

నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్‌(NPD)ని ఎలా గుర్తించాలి?
ఈ పరిస్థితి సాధారణంగా యుక్తవయస్సులో కనిపిస్తుంది. చిన్ననాటి గాయాలు కారణంగా ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. సాధారణంగా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్న వ్యక్తులు దానిని గుర్తించలేరు. వీరిని మేనేజ్‌ చేయడం చాలా కష్టమవుతుంది. ఈ డిజార్డర్‌ను నయం చేయడానికి వివిధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్‌ ఉన్న వ్యక్తుల్లో కనిపించేవి..

* వీరి వ్యవహారశైలి కారణంగా అందరూ వీరికి దూరంగా ఉంటారు

* సంతోషకరమైన రిలేషన్‌లు ఉండవు

* జీవితంపై అసంతృప్తిగా ఉంటారు

* రెస్ట్‌లెస్‌గా కనిపిస్తారు

* మద్యం ఎక్కువగా అలవాటు అవుతుంది

* నిరంతరం మెచ్చుకుంటూ ఉండాలి

* విమర్శలను సానుకూలంగా తీసుకోరు

* అన్ని వేళలా అహంకారంతో ఉంటారు

NPD ఎలా కలుగుతుంది?
అనేక అధ్యయనాలు ఈ రుగ్మత మూల కారణాన్ని అర్థం చేసుకోలేకపోయినప్పటికీ, అనేక జన్యుపరమైన లోపాలు కారణమని చెప్పారు. అలాగే లైంగిక, మానసిక వేధింపులు, తల్లిదండ్రుల నిర్లక్ష్యం, చిన్నతనంలో అతిగా గారాబం చేయడం, కుటుంబం పట్ల ద్వేషం, లైంగిక వ్యభిచారం మొదలైన అనేక చిన్ననాటి అనుభవాలు, బాధలను కారణంగా పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలతో వ్యక్తులు నార్సిసిస్ట్‌గా మారుతారు.

చికిత్స
నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్‌కి చికిత్స లేనప్పటికీ, తీవ్రమైన సందర్భాల్లో మానసిక చికిత్స, మందుల ద్వారా లక్షణాలను అదుపు చేయవచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అలాగే చికిత్స ప్రయోజనాలు వ్యక్తి రుగ్మతతో బాధపడుతున్నారనే వాస్తవాన్ని అంగీకరించడంపై ఆధారపడి ఉంటాయి.
మానసిక చికిత్స అనేది వ్యక్తులతో ఆనందంగా, సన్నిహితంగా కమ్యూనికేట్ చేయడం నేర్చుకోవడంలో సహాయపడుతుంది. ఇది సహచరులు, సహోద్యోగులతో సానుకూల సంబంధాలను పెంపొందించడంలో కూడా ఉపయోగపడుతుంది. బలాలు, సానుకూలతలను గుర్తించే సామర్థ్యాన్ని ఇస్తుంది. విమర్శలను , వైఫల్యాలను బాగా తట్టుకునే శక్తిని అందిస్తుంది. వ్యక్తిత్వాన్ని మార్చడం సాధ్యం కాదు కాబట్టి మెరుగుదల చూసేందుకు చాలా సంవత్సరాల చికిత్స అవసరం అవుతుంది. అప్పటి వరకు, మద్యం, మాదకద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. మనస్సును రిలాక్స్ చేయడానికి వ్యాయామం చేయాలి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి కొంత ధ్యానం చేయాలి. ఎల్లప్పుడూ ప్రేరణను కోల్పోకూడదు.
Published by:Mahesh
First published:

Tags: Health, Health care, Love, Mental Health

తదుపరి వార్తలు