హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Love vs Lust: మీ ప్రియుడు మీ పట్ల ప్రేమతో ఉన్నాడా? లేక కోరికతో ఉన్నాడా? ఈ 5 మార్గాలతో కనిపెట్టండి

Love vs Lust: మీ ప్రియుడు మీ పట్ల ప్రేమతో ఉన్నాడా? లేక కోరికతో ఉన్నాడా? ఈ 5 మార్గాలతో కనిపెట్టండి

మళ్లీ కొద్దిగంటల తర్వాత ఫోన్ చేసి ఆ కానిస్టేబుల్ రావడం లేదనీ, అతడికి వేరే డ్యూటీ పడిందని చెప్పి మరొకరిని పంపిస్తున్నానన్నాడు. దీంతో అనుమానం వచ్చిన మురళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో మాకే మురళి, అతడికి సహకరించిన మాకే శంకర్ లను అరెస్ట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)

మళ్లీ కొద్దిగంటల తర్వాత ఫోన్ చేసి ఆ కానిస్టేబుల్ రావడం లేదనీ, అతడికి వేరే డ్యూటీ పడిందని చెప్పి మరొకరిని పంపిస్తున్నానన్నాడు. దీంతో అనుమానం వచ్చిన మురళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో మాకే మురళి, అతడికి సహకరించిన మాకే శంకర్ లను అరెస్ట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)

మీరు ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారా? మీతో శారీరక , కోరికలు తీర్చుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారా? అనే విషయం కనిపెట్డం చాలా ముఖ్యం. ఈ కింది మార్గాలతో ప్రియమైన వారు మీ పట్ల ఏ భావంతో ఉన్నారో ఇట్టే పట్టేయవచ్చు. అవేంటో ఓసారి పరిశీలించండి.

ఇంకా చదవండి ...

చాలా మంది మనసులో ఒకటి పెట్టుకొని బయట మరోలా నటిస్తుంటారు. వారు మీ పట్ల ప్రేమ కంటే మీ నుంచి అవసరాలు, కామ కోరికలు తీర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ముఖ్యంగా ప్రేమలో ఉన్న యువతి సహజంగానే తమ ప్రియుడు ఎప్పుడూ వారిపై ప్రేమ చూపించాలని కోరుకుంటారు. కానీ, కొంత మంది పురుషులు మాత్రం తమ ప్రియురాలిని కేవలం శారీరక కోణంలోనే చూస్తారు. అయితే, మీరు ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారా? మీతో శారీరక , కోరికలు తీర్చుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారా? అనే విషయం కనిపెట్డం చాలా ముఖ్యం. ఈ కింది మార్గాలతో ప్రియమైన వారు మీ పట్ల ఏ భావంతో ఉన్నారో ఇట్టే పట్టేయవచ్చు. అవేంటో ఓసారి పరిశీలించండి.

బెడ్ పై మీతో ఎక్కువ సమయం గడపాలనుకునేవారు..

మీ ప్రేమికుడు మీతో మంచం మీద ఎక్కువ సేపు గడపాలని ప్రయత్నిస్తుంటే, వారు ఎప్పుడూ మీతో లైంగికపరమైన ప్రస్తావన తెస్తుంటే, మిమ్మిల్ని శారీరక కోణంలోనే చూస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. అటువంటి వారు మీతో కేవలం లైంగిక పరమైన సంబంధాన్ని కోరుకుంటున్నట్లు అంచనా వేయవచ్చు. అయితే, ఇలా చేయడం తప్పేమీ కానప్పటికీ, వారు మిమ్మల్ని కేవలం లైంగిక కోణంలోనే చూడటం అనేది స్వాగతించాల్సిన అంశం కాదు. మీ పట్ల ప్రేమతో ఉన్న వ్యక్తి మీతో సమయాన్ని అన్ని విధాలుగా గడపాలని కోరుకుంటాడని గుర్తించుకోండి.

ఎప్పుడూ లైంగిక ప్రస్తావన తెచ్చేవారు..

ఒకరు నిజంగా మీతో ప్రేమలో ఉన్నప్పుడు, మీ అవసరాలు, లక్షణాలు, వ్యక్తిత్వం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మీ పట్ల ఎప్పుడూ ప్రేమ చూపిస్తూ, మిమ్మల్ని సంతోషపర్చాలని చూస్తారు. అంతేకాక, వారు మీ పట్ల శ్రద్ధ వహిస్తూ మీ గొప్ప లక్షణాల(personality)ను ఎప్పుడూ మెచ్చుకుంటారు. కానీ, మీ ప్రియమైన వారు దీనికి భిన్నంగా ఎప్పుడూ శృంగారం గురించి మాత్రమే ప్రస్తావిస్తుంటే వారి పట్ల జాగ్రత్త వహించడం మంచింది.

భౌతిక రూపానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం..

‘అందం చూసేవారి దృష్టిలో ఉంటుంది’ అనే సామెతను గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే, ఒక వ్యక్తి మీ వ్యక్తిత్వానికి బదులు భౌతిక రూపానికే(physical appearance) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే వారు మిమ్నల్ని లైంగికపరమైన కోరికతోనే చూస్తున్నారని అర్థం. వారు మీ వ్యక్తిత్వం పట్ల కాకుండా మీ ముఖం, శరీరం ఆకృతిని చూసి ఇష్టపడుతున్నారని తెలుసుకోండి. అలాంటి వ్యక్తుల్లో మీ పట్ల ప్రేమ లేని సంబంధంలో మాత్రమే ఉంటుంది.

కట్టుబాట్లు లేనివారు..

శృంగారం కోసం మాత్రమే సంబంధంలో ఉన్న వ్యక్తి కట్టుబాట్లను పట్టించుకోడు. అటువంటి వారు సమాజంలోని సామాజిక కట్టుబాట్లు, సాంప్రదాయాలకు విలువనివ్వకుండా కేవలం మీతో లైంగిక సంబంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడతారు. ఒక వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే, వారు ఖచ్చితంగా మీకు ఎల్లప్పుడూ తోడుంటూ, భవిష్యత్తును పంచుకోవడం గురించి, కట్టుబాట్ల గురించి ఎక్కువ ఆలోచించిస్తాడు.

మీ కుటుంబం నుంచి మిమ్మల్ని దూరం చేసేవారు..

మీ ప్రేమికుడు మీ పట్ల ప్రేమతో ఉన్నారా? లేదా కోరికతో ఉన్నారా? అనేది నిర్ణయించడానికి ఈ అంశం బాగా పనిచేస్తుంది. మిమ్మల్ని మీ కుటుంబం, స్నేహితుల నుంచి దూరం చేయడానికి వారు ప్రయత్నిస్తే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఇష్టపడుతూ మీతో జీవితం పంచుకోవాలి అనుకునే వారు, మీ కుటుంబం నుంచి ఎప్పుడూ మిమ్మల్ని విడదీయరని గుర్తించుకోండి.

First published:

Tags: Love, Relationship

ఉత్తమ కథలు