Relationship : బ్రేకప్ తర్వాత కొత్త బంధంలోకి అడుగుపెట్టలేకపోతున్నాను..నేను ఏం చేయాలి..?

ప్రతీకాత్మక చిత్రం

Relationship : బంధం విచిత్రమైన ఆకర్షణ కలది. బంధాలు కూడా వివిధ రకాలుగా ఉంటాయి. ఆ బంధం లో ఉన్న ఇరువురి లక్షణాలు, వ్యక్తిత్వాలను బట్టి ఇవి ఉంటాయి. యవ్వనంలో ప్రేమ తెలియకుండానే పుడుతుంది. ఆ పరవశం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. తొలినాళ్లలో ఉండే భావోద్వేగాలు ప్రేమలోని మజాలో ఒలలాడిస్తాయి. ప్రేమలో ఉన్నప్పుడు రోజులన్నీ నిమిషాల్లా గడిచిపోతాయి.. ఇలాంటి ఫీలింగ్స్‌తో హ్యాపీగా గడిచిపోతుంది. మరి ఏదైనా కారణంతో విడిపోతే లోకమంతా శూన్యం..

  • Share this:
ప్రశ్న : బ్రేకప్ తర్వాత కొత్త బంధంలోకి అడుగుపెట్టలేకపోతున్నాను..నేను ఏం చేయాలి..?

సమాధానం :

బంధం విచిత్రమైన ఆకర్షణ కలది. బంధాలు కూడా వివిధ రకాలుగా ఉంటాయి. ఆ బంధం లో ఉన్న ఇరువురి లక్షణాలు, వ్యక్తిత్వాలను బట్టి ఇవి ఉంటాయి. యవ్వనంలో ప్రేమ తెలియకుండానే పుడుతుంది. ఆ పరవశం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. తొలినాళ్లలో ఉండే భావోద్వేగాలు ప్రేమలోని మజాలో ఒలలాడిస్తాయి. ప్రేమలో ఉన్నప్పుడు రోజులన్నీ నిమిషాల్లా గడిచిపోతాయి.. ఇలాంటి ఫీలింగ్స్‌తో హ్యాపీగా గడిచిపోతుంది. మరి ఏదైనా కారణంతో విడిపోతే లోకమంతా శూన్యం.. ఎంతటి ఆనందక్షణాలైనా మృత్యు ఘంటికల్లా అనిపిస్తాయి.. చుట్టూ ఉన్నవారంతా ఆనందంలో మునిగితేలుతున్నా మనం మాత్రం శోక సంద్రంలో కూరుకుపోతాం.. ఆ బాధ నుంచి ఎలా అయినా బయటపడాలని ఎంతగా ప్రయత్నించినా కుదరదు. ఆ తర్వాత ఏంటి అన్న ప్రశ్న మీలో మొదలవుతోంది. ఒక రిలేషన్ షిప్ లో నుండి అప్పుడే బయటకు వచ్చి ఉంటారు. ఆ బాధ పోవాలంటే, దాన్ని మర్చిపోవాలంటే ఇంకొక రిలేషన్ షిప్ అవసరం. ఈ బంధం ఎంతకాలం నిలుస్తుందనే దాని మీద అనుమానాలున్నాయి. ఎందుకంటే, ఈ బంధానికి పునాది రాయి వాస్తవాన్ని అంగీకరించలేకపోవటం. ఇందులో అవతలి వ్యక్తి మీద కంటే ఎవరి మీద వారికే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అయితే, నెమ్మదిగా ఒకరికి ఒకరు నచ్చి ఈ బంధాన్ని ముందుకు తీసుకునివెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు.

మీరు బాధలో ఉన్నప్పుడు, గతం తాలూకు జ్ఞాపకాల నుంచి బయటపడొచ్చనే ఆలోచనతో కొత్త బంధంలోకి అడుగుపెట్టకూడదు. మీ అభద్రతా భావం వల్ల మీ భాగస్వామి నొచ్చుకొనే వీలుంది. కాబట్టి మీరు సంతోషంగా ఉన్నప్పుడే కొత్త ప్రయాణం మొదలెట్టాలి. మీరు పాత బాధల్ని నుంచి కోలుకోవడానికి వీలైన టైం తీసుకోవాలి. మనస్సుకు మెల్లగా సర్ది చెప్పాలి. నచ్చిన పనులతో సమయాన్ని గడపాలి. ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. దీంతో మిమ్మల్ని మీరు కొత్తగా అన్వేషించుకుంటారు.

మీ గురించి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోగలుతారు. మీ కంటూ కొన్ని ఇష్టాలను ఏర్పర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. మీరు ఏం చేస్తే సంతోషంగా ఉంటారో మీకు తప్ప ఎవరికి తెలుస్తోంది చెప్పండి. గతం తాలూకు జ్ఞాపకాల నుంచి బయటపడాలని వేగంగా అడుగులు వేయకూడదు. మీరు ఏం చేస్తే సంతోషంగా ఉంటారో గమనించి ఆ పనులు చేసి చూసి చూడండి. తద్వారా మీ భవిష్యత్తు గురించి ఆలోచించి అడుగులు వేసే అవకాశం ఉంటుంది.
Published by:Sridhar Reddy
First published: