Omega 3 Rich Food: శరీరంలో చెడు కొవ్వును తగ్గించే ఆహార పదార్థాలివి.. ఆరోగ్యంగా ఉండాలంటే అస్సలు మిస్సవ్వొద్దు..!

ప్రతీకాత్మక చిత్రం

బాల్యం నుంచే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉన్న డైట్ ను ఎంజాయ్ చేయటం అలవర్చుకోవాలి. ఈ ఫ్యాటీ యాసిడ్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఇంత ఆరోగ్యకరమైన ఈ ఫ్యాటీ యాసిడ్ లభించే ఆహార పదార్థాలు ఏవనేగా మీ అనుమానం. వాటిని ఓ లుక్కేయండి.

  • Share this:
గుడ్ ఫ్యాట్ నిల్వలను మన ఒంట్లో పెంచుకునే ప్రయత్నం నిరంతరం చేస్తుండాలి, ఇందుకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం చాలా అవసరం. మంచి కొవ్వుతో మనం ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చు. శాచురేటెడ్ ఫ్యాట్ కాకుండా గుడ్ ఫ్యాట్ ఉన్న ఆహారం తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ (LDL) బాగా తగ్గించి ప్రాణాంతకమైన హృద్రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మన రక్త పోటును కూడా నియంత్రించే శక్తి ఈ గుడ్ ఫ్యాట్ కు ఉంది. గుండె వంటి శరీర అవయవాలను సక్రమంగా పనిచేసేలా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ప్రభావం చూపుతాయి. కేవలం గుండెకే కాదు శ్వాస కోస వ్యాధులకు దూరంగా ఉంచేలా చేసే శక్తి ఈ యాసిడ్ కు ఉంది. సాధారణంగా మనకు శ్వాసకోస వ్యాధులు వచ్చేందుకు ప్రధాన కారణం జీన్స్, వాతావరణ కాలుష్యాలే. ఇంటా, బయటా పెరుగుతున్న దుమ్ము, పొగ, కాలుష్యం కారణంగా మన ఒంట్లోని లంగ్స్ డామేజ్ అవుతున్నాయి.

అన్ని వయసులవారిపై కాలుష్య ప్రభావం విపరీతంగా ఉంటోంది. ఇంట్లో, కార్లో ఎయిర్ ప్యూరిఫయర్లు కొంతవరకు మనల్ని వాతావరణ కాలుష్యం నుంచి తప్పించేలా ఉపయోగపడుతున్నప్పటికీ వీటికి పూర్తి విరుగుడు మాత్రం కాదు. అందుకే మనం తినే ఆహారంలో కొన్ని పోషకాలు ఉండేలా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోయినా, పోషకాహార లేమి ఉన్నా ఆస్తమా వస్తుందని పలు పరిశోధనలు ఇప్పటికే రుజువు చేశాయి కూడా. అందుకే బాల్యం నుంచే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉన్న డైట్ ను ఎంజాయ్ చేయటం అలవర్చుకోవాలి. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ (COPD) ఉన్నవారికి ఈ ఫ్యాటీ యాసిడ్ ఉన్న ఆహారం ఇవ్వటం వల్ల యాంటీ-ఇన్ల్ఫమేటరీ ప్రభావం కనిపిస్తుంది. మరి ఇంత ఆరోగ్యకరమైన ఈ ఫ్యాటీ యాసిడ్ లభించే ఆహార పదార్థాలు ఏవనేగా మీ అనుమానం. అవేంటో ఓ లుక్కేయండి.

Omega 3 Rich Food, LDL, COPD, super-foods, Rajma, diet, ఒమేగా 3 ప్యాట్ యాసిడ్, సాల్మన్ చేపలు, వాల్నట్స్, చియా సీడ్స్, అవిశెలు.
చేపల కూర (ప్రతీకాత్మక చిత్రం)


చేపలు
సాల్మన్, మాకెరల్, ష్రింప్ వంటి చేపల జాతుల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి. మీరు చేపలు ఇష్టపడేవారైతే ఇక మీకు ఒమేగా 3 లోపం ఉండనే ఉండదు. అందుకే ఆస్తమా లేదా గుండె జబ్బులున్న వారికి చేపలు తినమని వైద్యులు చెబుతారు. అలాగని అతిగా చేపలు తినకండి వీటిలో అధికంగా ఉన్న ఉప్పు, సోడియం వంటివి అనారోగ్యానికి కారణమవుతాయి కూడా. మితంగా చేపలు ఆస్వాదించండి. సీ ఫుడ్ ప్రియులకు ఇది గుడ్ న్యూస్.

Omega 3 Rich Food, LDL, COPD, super-foods, Rajma, diet, ఒమేగా 3 ప్యాట్ యాసిడ్, సాల్మన్ చేపలు, వాల్నట్స్, చియా సీడ్స్, అవిశెలు.
వాల్ నట్స్


వాల్ నట్ ..
యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు అధికంగా ఉన్న వాల్ నట్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికి కారణం ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండటమే. అందుకే వాల్ నట్స్ ను సూపర్ ఫుడ్ అంటారు. మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఇందులో ఉన్నాయి కనుక రోజూ గుప్పెడు వాల్నట్స్ హ్యాపీగా లాగించండి. ఇక మీకు తిరుగుండదు. ఖరీదెక్కువైనా ఆరోగ్యానికి మంచిదేగా. మీరు శాకాహారులైతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం వాల్నట్స్ పై ఆధారపడాల్సిందే.

రాజ్మా..
చాలామందికి రాజ్మా చావల్ ఓ ఫేవరెట్ కాంబినేషన్ గా ఉంటుంది. మీరు రాజ్మాను చపాతి, పూరి, రొట్టె, అన్నంలోకి బిందాస్ గా తినండి ఆరోగ్యంగా ఉండండి. ప్రొటీన్లు చాలా ఎక్కువ ఉన్న రాజ్మాను కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. ఆరోగ్యకరమైన కొవ్వుతో నిండిన ఈ ధాన్యం రుచిగా ఉంటుంది కూడా. నిజానికి శాకాహారులకు ఇది అతిపెద్ద సూపర్ ఫుడ్ గా నార్త్ ఇండియాలో వ్యవహరిస్తారు. దక్షిణాదిలో కూడా ఇటీవలి కాలంలో రాజ్మాను విస్తృతంగా వండుతున్నారు. ఇంట్లో చేసుకున్నా, రెస్టారెంట్లో తిన్నా రాజ్మా లొట్టలేసుకుని తినేంత కమ్మగా ఉంటుంది.

చియా, ఫ్లాక్స్ సీడ్స్..
ఇటీవల కాలంలో మనదేశంలో చియా సీడ్స్ వాడకం బాగా పెరిగింది. అవిశెలు, చియా గింజలు రెండూ ఒకేరకమైన ప్రయోజనాలు కల్పించినప్పటికీ, ఫ్లాక్స్ సీడ్స్ తో పోల్చితే చియా సీడ్స్ ధర కాస్త ఎక్కువ. రుచికరమైన పుడ్డింగులను చేసుకునేందుకు చియా సీడ్స్ ఉపయోగపడతాయి. అవిశెలను ఇండియన్ సూపర్ ఫుడ్ గా మన పెద్దలు ఏనాడో అభివర్ణించారు. ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం వంటి పోషకాలు మెండుగా ఉన్న అవిశెలను మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు. ఈ విత్తనాలను మీ మెనూలో చేర్చుకోవటం వల్ల లంగ్ హెల్త్ బాగా మెరుగుపడుతుంది.
Published by:Hasaan Kandula
First published: