హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Long Weekends in 2023: వచ్చే ఏడాది 17 లాంగ్ వీకెండ్స్... సెలవుల్ని ఇలా ప్లాన్ చేసుకోండి

Long Weekends in 2023: వచ్చే ఏడాది 17 లాంగ్ వీకెండ్స్... సెలవుల్ని ఇలా ప్లాన్ చేసుకోండి

Long Weekends in 2023: వచ్చే ఏడాది 17 లాంగ్ వీకెండ్స్... సెలవుల్ని ఇలా ప్లాన్ చేసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Long Weekends in 2023: వచ్చే ఏడాది 17 లాంగ్ వీకెండ్స్... సెలవుల్ని ఇలా ప్లాన్ చేసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Long Weekends In 2023 | వచ్చే ఏడాది లాంగ్ టూర్స్, హాలిడేస్ ప్లాన్ చేసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. 2023 లో మొత్తం 17 లాంగ్ వీకెండ్స్ వచ్చాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త సంవత్సరంలో లాంగ్ వీకెండ్స్ (Long Weekends) చాలా ఉన్నాయి. అసలు ఈసారి కొత్త సంవత్సరం సెలవుతో ప్రారంభం కావడం విశేషం. 2023 లో 17 లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి. వెకేషన్స్, ఫ్యామిలీ టూర్స్ (Family Tours), తీర్థయాత్రలు ప్లాన్ చేసుకునేవారికి లాంగ్ వీకెండ్స్ చాలా ముఖ్యం. ఉద్యోగాలు చేసేవాళ్లు ఎక్కువగా సెలవుల్ని పెట్టాల్సిన అవసరం లేకుండా లాంగ్ వీకెండ్స్‌లో టూర్స్ ప్లాన్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా 2023 లో టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారా? మరి ఏ నెలలో ఎన్ని లాంగ్ వీకెండ్స్ వచ్చాయి? మీ టూర్లను ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇక్కడ తెలుసుకోండి.

2023లో లాంగ్ వీకెండ్స్ ఇవే

January: జనవరి 1 ఆదివారం. కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు. ముందు రోజు శనివారం కాబట్టి, శనివారం సెలవు ఉన్నవారు, అంతకు ముందు రోజు డిసెంబర్ 30 శుక్రవారం, జనవరి 2 సోమవారం సెలవు పెట్టుకుంటే చాలు. లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక జనవరి 14 శనివారం మకర సంక్రాంతి. జనవరి 15 ఆదివారం సెలవు. జనవరి 13 శుక్రవారం, జనవరి 16 సోమవారం సెలవు తీసుకుంటే నాలుగు రోజులు లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక జనవరి 26 గురువారం రిపబ్లిక్ డే సెలవు. జనవరి 28 శనివారం, జనవరి 29 ఆదివారం సెలవులు ఉన్నవారు జనవరి 27 లీవ్ తీసుకుంటే నాలుగు రోజుల సెలవు ఎంజాయ్ చేయొచ్చు.

Fake Hallmark: ఫేక్ హాల్‌మార్క్‌తో బంగారు నగల అమ్మకం... ఇలా జాగ్రత్తపడండి

February: ఫిబ్రవరి 18 శనివారం మహాశివరాత్రి. ఫిబ్రవరి 19 ఆదివారం సెలవు. ఫిబ్రవరి 17న శుక్రవారం సెలవు తీసుకుంటే మూడు రోజుల సెలవు ప్లాన్ చేసుకోవచ్చు.

March: మార్చ్ 8 బుధవారం హోళీ పండుగ. మార్చ్ 11 శనివారం, మార్చ్ 12 ఆదివారం సెలవు. మార్చ్ 9, 10 సెలవులు తీసుకుంటే 5 రోజుల లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు.

April: ఏప్రిల్ 4 మంగళవారం మహావీర్ జయంతి. ఏప్రిల్ 7 శుక్రవారం గుడ్ ఫ్రైడే. ఏప్రిల్ 8 శనివారం, ఏప్రిల్ 9 ఆదివారం. ఏప్రిల్ 5, 6 తేదీల్లో సెలవు తీసుకోగలిగితే 6 రోజుల లాంగ్ వీకెండ్‌లో లాంగ్ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.

May: మే 5 శుక్రవారం బుద్ధపూర్ణిమ. మే 6 శనివారం, మే 7 ఆదివారం. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.

June: జూన్ 29 గురువారం బక్రీద్ సందర్భంగా సెలవు. జూలై 1 శనివారం, జూలై 2 ఆదివారం సెలవులు. జూన్ 30 శుక్రవారం సెలవు తీసుకుంటే లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు.

SBI Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... జనవరి 1 నుంచి కొత్త రూల్స్

August: ఆగస్ట్ 12 శనివారం. ఆగస్ట్ 13 ఆదివారం. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా సెలవు. ఆగస్ట్ 14 సెలవు తీసుకుంటే వరుసగా నాలుగు రోజుల సెలవు లభిస్తుంది. ఇక ఆగస్ట్ 26 శనివారం, ఆగస్ట్ 27 ఆదివారం. ఆగస్ట్ 30న రాఖీ పౌర్ణమి ఉంది. ఆగస్ట్ 28, 29 సెలవు తీసుకుంటే రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కాచెల్లెళ్లతో సెలవుల్ని ఎంజాయ్ చేయొచ్చు.

September: సెప్టెంబర్ 7 గురువారం కృష్ణాష్టమి సందర్భంగా సెలవు. సెప్టెంబర్ 9 శనివారం, సెప్టెంబర్ 10 ఆదివారం సెలవు. సెప్టెంబర్ 8 సోమవారం సెలవు తీసుకుంటే లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక సెప్టెంబర్ 16 శనివారం, సెప్టెంబర్ 17 ఆదివారం. సెప్టెంబర్ 19న వినాయక చవితి సందర్భంగా సెలవు. సెప్టెంబర్ 18 సోమవారం సెలవు తీసుకుంటే వరుసగా నాలుగు రోజులు హాలిడే ఎంజాయ్ చేయొచ్చు.

October: సెప్టెంబర్ 30 శనివారం, అక్టోబర్ 1 ఆదివారం, అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఇక అక్టోబర్ 21 శనివారం, అక్టోబర్ 22 ఆదివారం. అక్టోబర్ 24 దసరా సందర్భంగా సెలవు. అక్టోబర్ 23 సెలవు తీసుకుంటే నవరాత్రి వేడుకలు ఎంజాయ్ చేయొచ్చు.

SBI: త్వరపడండి... ఎస్‌బీఐ నుంచి 2023 జనవరి 31 వరకే ఈ ఆఫర్

November: నవంబర్ 11 శనివారం, నవంబర్ 12 ఆదివారం. నవంబర్ 12న దీపావళి కూడా వచ్చింది. నవంబర్ 10 లేదా నవంబర్ 13 సెలవు తీసుకుంటే కనీసం మూడు రోజులు దివాళీ సెలబ్రేట్ చేయొచ్చు. నవంబర్ 25 శనివారం, నవంబర్ 26 ఆదివారం, నవంబర్ 27 గురునానక్ జయంతి సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.

December: డిసెంబర్ 23 శనివారం, 24 ఆదివారం, డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా సెలవు. డిసెంబర్ 26న బాక్సింగ్ డే హాలిడే కూడా ఉంటుంది. డిసెంబర్ 22 సెలవు తీసుకుంటే వరుసగా ఐదు రోజులు లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు.

First published:

Tags: Bank Holidays, Holidays, School holidays, Summer holidays, Tourism