హోమ్ /వార్తలు /life-style /

Long weekends in 2022: ఈ ఏడాది లాంగ్ వీకెండ్స్ ఇవే.. ఎలా గ‌డ‌పాలో ప్లాన్‌ చేసుకోండి!

Long weekends in 2022: ఈ ఏడాది లాంగ్ వీకెండ్స్ ఇవే.. ఎలా గ‌డ‌పాలో ప్లాన్‌ చేసుకోండి!

Long weekends in 2022 | నిత్యం బిజీ లైఫ్ స్టైల్‌లో లాంగ్ వీకెండ్స్ ఒక వరం. ఉద్యోగాలు చేసేవారు.. కాస్త రిలాక్స్ అవ్వ‌డానికి వీకెండ్ గ‌డుపుతారు. ఈ వీకెండ్ ఇలా వ‌చ్చి.. అలా వెళ్లిపోతుంటాయి. రెండేళ్లుగా లాంగ్ వీకెండ్‌లు వ‌చ్చినా.. ఎంజాయ్ చేయ‌లేని ప‌రిస్థితి. అంద‌రికీ ఓటీటీలు, టీవీల‌తోనే లాంగ్ వీకెండ్‌లు గ‌డిచిపోయాయి.  ఈ ఏడాది ఎప్పుడు లాంగ్ వీకెండ్స్ వ‌స్తాయో చూసుకొని ఏం చేయాలి. ఎలా గ‌డ‌పాలో ప్లాన్ చేసుకోండి.

ఇంకా చదవండి ...

    నిత్యం బిజీ లైఫ్ స్టైల్‌ (Life Style) లో లాంగ్ వీకెండ్స్ ఒక వరం. ఉద్యోగాలు చేసేవారు.. కాస్త రిలాక్స్ అవ్వ‌డానికి వీకెండ్ గ‌డుపుతారు. ఈ వీకెండ్ ఇలా వ‌చ్చి.. అలా వెళ్లిపోతుంటాయి. రెండేళ్లుగా లాంగ్ వీకెండ్‌లు వ‌చ్చినా.. ఎంజాయ్ (Enjoy) చేయ‌లేని ప‌రిస్థితి. అంద‌రికీ ఓటీటీలు, టీవీల‌తోనే లాంగ్ వీకెండ్‌లు గ‌డిచిపోయాయి.  ఈ ఏడాది ప్ర‌స్తుతం కోవిడ్ వేవ్ (Covid Wave) ఉన్నా.. త్వ‌ర‌లో త‌గ్గిపోతుంద‌ని వైద్యులు, ప్ర‌భుత్వాలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ ఏడాది లాంగ్ వీకెండ్‌లు ఎప్పుడొస్తున్నాయో తెలిస్తే.. మీ కుటుంబ స‌భ్యుల‌తో ఎలా గ‌డ‌పాలో ముందుగానే ప్లాన్ చేసుకోవ‌చ్చు. ఎన్నో మంచి మెమోరీలు మీ డైరీలో రాసుకోవ‌చ్చు. లాంగ్ వీకెండ్ (Long Weekend) టైమ్‌లో ఎక్కువ మంది ఇటీవ‌ల కుటుంబంతో గ‌డుపుతున్నా.. కొద‌రు టూర్‌ల‌కు వెళ్తుంటారు. ముందే ఓ ప్లాన్ ఉంటే టికెట్ బుకింగ్‌, ట్రావెల్ ఖ‌ర్చుల  (Travel Cost) అంశంపై ప్లాన్ చేసుకోవ‌చ్చ‌ని లైఫ్ స్టైల్, సైకాల‌జిక‌ల్ నిపుణులు చెబుతున్నారు.

    ఫిబ్ర‌వ‌రి..

    చ‌లికాలం త‌ర్వాత సరైన విరామం ఫిబ్రవరి చివరిలో వ‌స్తుంది. ఈ లాంగ్ వీకెండ్ కోసం మీరు ఒక రోజు ఆఫీస్‌కు సెల‌వు తీసుకోవాల్సి ఉంటుంది.

    ఫిబ్రవరి 26 - శనివారం

    ఫిబ్రవరి 27 - ఆదివారం

    ఫిబ్రవరి 28 - సోమవారం (రోజు సెలవు తీసుకోండి)

    మార్చి 1 - మంగళవారం (మహాశివరాత్రి)

    ఈ స‌మ‌యంలో వాతావ‌ర‌ణం బాగుంటుంది ఈ నాలుగు రోజులు ఎలా గ‌డ‌పాలో చ‌క్క‌గా ప్లాన్ చేసుకుంటే బాగా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

    మార్చి

    మార్చ్‌లో హోలీని జాలీగా ప్లాన్ చేసుకొనే చాన్స్ ఈ ఏడాది వ‌చ్చింది. ఎలానో ఓ సారి చెక్ చేసుకోండి. ఈ పండుగ కోసం ఎలాంటి సెల‌వు పెట్టాల్సిన అవ‌స‌రం లేదు.

    మార్చి 18 - శుక్రవారం (హోలీ)

    మార్చి 19 - శనివారం

    మార్చి 20 - ఆదివారం

    Assembly Election 2022: ప్ర‌చారంలో న‌యా ట్రెండ్.. ఐదు రాష్ట్రాల్లో పార్టీలు ఏం చేస్తున్నాయంటే..

    ఏప్రిల్..

    ఏప్రిల్‌లో బంప‌ర్‌గా నాలుగు రోజులు ఎటువంటి హాలిడే పెట్ట‌కుండా వ‌స్తున్నాయి. మీరు టూర్ ప్లాన్ చేసుకొంటే సూప‌ర్‌గా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

    ఏప్రిల్ 14 - గురువారం (మహావీర్ జయంతి/వైశాఖి/డాక్టర్ అంబేకర్ జయంతి)

    ఏప్రిల్ 15 - శుక్రవారం (గుడ్ ఫ్రైడే)

    ఏప్రిల్ 16 - శనివారం

    ఏప్రిల్ 17 - ఆదివారం

    మే

    స‌మ్మ‌ర్‌లో పిల్ల‌ల‌కు హాలిడేస్ ఉంటాయి. ఉద్యోగుల‌కు ఉండ‌వు. ఈ స‌మ‌యంలో ఒక్క రోజు సెల‌వుతో నాలుగు రోజులు హాలిడేల్ ఓ సారి, మ‌రో త్రీడేస్ హాలిడేస్‌ (Holidays)తో మ‌రో లాంగ్ వీకెండ్ మేలో వ‌స్తున్నాయి.

    ఏప్రిల్ 30 - శనివారం

    మే 1 - ఆదివారం

    మే 2 - సోమవారం (రోజు సెలవు తీసుకోండి)

    మే 3 - మంగళవారం (ఈద్-ఉల్-ఫితర్)

    Assembly Election 2022: బీజేపీ ల‌క్ష్యం నెర‌వేరుతుందా.. ఐదు రాష్ట్రాల్లో మోదీ చ‌రిష్మా.. గెలుపు అవ‌కాశాలు!

    మే 14 - శనివారం

    మే 15 ఆదివారం

    మే 16 - సోమవారం (బుద్ధ పూర్ణిమ)

    ఆగస్టు

    ఈ ఏడాది ఆగ‌స్టు.. సెల‌వులు మీ కోసం ఎదురు చూస్తున్నాయి. మూడు సార్లు లాంగ్ వీకెండ్‌ల‌తో సూప‌ర్ ప్లాన్ చేసుకొనే చాన్స్ ఆగ‌స్టు ఇచ్చింది.

    ఆగష్టు 6 - శనివారం

    ఆగష్టు 7 - ఆదివారం

    ఆగస్ట్ 8 - మొహర్రం

    ఆగస్టు 11 - గురువారం (రక్షాబంధన్)

    ఆగస్టు 12 - శుక్రవారం (రోజు సెలవు తీసుకోండి)

    ఆగష్టు 13 - శనివారం

    ఆగస్టు 14 - ఆదివారం

    ఆగస్టు 15 - సోమవారం (స్వాతంత్య్ర‌ దినోత్సవం)

    PM Narendra Modi: టీనేజ్ వ్యాక్సినేష‌న్‌పై మోదీ ట్వీట్‌.. ఎంత‌మందికి ఇచ్చారంటే!

    ఆగస్టు 19 - శుక్రవారం (శ్రీ కృష్ణ జన్మాష్టమి)

    ఆగష్టు 20 - శనివారం

    ఆగష్టు 21 - ఆదివారం

    అక్టోబర్

    సెప్టెంబ‌ర్‌లో ఎటువంటి లాంగ్ వీకెండ్ ప్లాన్‌ల‌కు చాన్స్ లేదు. అయితే అక్టోబ‌ర్‌లో ఓ సారి లాంగ్ వీకెండ్ చాన్స్ ఉంది.

    అక్టోబర్ 22 - శనివారం

    అక్టోబర్ 23 - ఆదివారం

    అక్టోబర్ 24 - దీపావళి

    నవంబర్

    ఈ ఏడాది లాస్ట్ లాంగ్ వీకెండ్ న‌వంబ‌ర్‌లోనే వ‌స్తుంది. ఈ వీకెండ్ ఎంజాయ్ చేయాలంటే ఒక్క రోజు హాలిడే తీసుకోవాల్సిందే.

    Assembly Elections : అప్పుడు లెక్క‌లేని పార్టీ.. ఇప్పుడు లెక్క‌లు మారుస్తోంది.. ర‌స‌వ‌త్త‌రంగా పంజాబ్ రాజ‌కీయం!

    నవంబర్ 5 - శనివారం

    నవంబర్ 6 - ఆదివారం

    నవంబర్ 7 - సోమవారం (రోజు సెలవు తీసుకోండి)

    నవంబర్ 8 - మంగళవారం (గురునానక్ జయంతి)

    జూన్, జూలై, సెప్టెంబరు, డిసెంబరు నాలుగు నెలలు లాంగ్ వీకెండ్ చాన్స్ లేదు. ఈ నెల‌లో అత్య‌వ‌స‌ర ప‌నులు మాత్ర‌మే చేసుకొని.. ఈ లాంగ్ వీకెండ్‌లో టూర్ లేదా ఫ్యామిలీతో గ‌డిపే చాన్స్‌ను మిస్ చేసుకోకండి.

    First published:

    ఉత్తమ కథలు