పానిపూరి తింటున్నారా... పురుగులు వస్తున్నాయ్ జాగ్రత్త

రోడ్డు సైడ్ నిలబెట్టిన పానీపూరి బండిపై నోరూరించే పానీపురిని చూసి చకచక ఓ రెండుమూడు ప్లేట్లు లాగించేస్తున్నారా అయితే జాగ్రత్త.

news18-telugu
Updated: August 18, 2019, 3:46 PM IST
పానిపూరి తింటున్నారా... పురుగులు వస్తున్నాయ్ జాగ్రత్త
నమూనాచిత్రం
  • Share this:
సాయంత్రం అలా నడుచుకుంటూ ఫ్రెండ్స్‌తో వెళ్లినా... బైక్‌పై ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నా... పానీపురి బండి కనిపించగానే చాలామంది టక్కుమని ఆగిపోతారు. రోడ్డుసైడ్ నిలబెట్టిన నోరూరించే పానీపురి బండిని చూసి చకచక  ఓ రెండుమూడు ప్లేట్లు లాగించేస్తారు. అయితే అలాంటి వాళ్లు తప్పకుండా ఈ వార్త చదవాల్సిందే. పానీపూరిలోని వాడే పానీలో కొందరు యువకులు పురుగులు గుర్తించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌లో జరిగింది. కరణ్ నగర్‌లోని నెప్టి నాకా చౌక్లో కొందరు యువకులు పానీ పురి తిందామని అక్కడ నిర్వహిస్తున్న ఓ బండి వద్దకు చేరుకున్నారు. జనం రాగానే... పానీ పూరి అమ్మే వ్యక్తి అందరికీ ప్లేట్లు ఇచ్చి పానీ పురి ఇవ్వడం ప్రారంభించారు.

ఇంతలో పానీలో కొన్నిరకాల పురుగుల్ని గుర్తించారు. వెంటనే అమ్మే వ్యక్తిని నిలదీశారు. దీంతో నీళ్లు మింగిన పానీ పూరీ వాలా... ఆ నీళ్లు... రెండుమూడురోజుల కిందటవని చెప్పాడు. అక్కడ్నుంచి పరారయ్యాడు. దీంతో ఆందోళనకు దిగిన జనం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం పరిశుభ్రత పాటించుకుండా.. కొందరు ఇలాంటి పానీపూరి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>