మ్యూజిక్, పాటలు వింటున్నారా... మీ బ్రెయిన్‌కి తిరుగుండదు

ప్రతీకాత్మక చిత్రం

రకరకాల సమస్యలు, టెన్షన్లు, నిద్ర చాలకపోవడం వల్ల మన బ్రెయిన్ మొద్దుబారిపోతుంది. ఐతే... సంగీతం, పాటలూ, మ్యూజిక్ వినేవారికి మాత్రం బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుందని తెలిసింది. ఆ విశేషాలపై ఓ లుక్ వేద్దాం.

  • Share this:
ఎవరైనా మనల్ని ఇంటెలిజెంట్ అనో, తెలివైన వారు అనో అంటే మనకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే... తెలివితేటలనేవి అంత ఈజీగా రావు. మన బ్రెయిన్ ఎంత చురుగ్గా ఉంటే అంతగా తెలివితేటలు పెరుగుతాయి. అంటే మన ఆలోచనల్లో వేగం పెరుగుతుంది. రకరకాలుగా, వేగంగా ఆలోచించగలం. ఇదంతా జరగాలంటే... ముందు మన మెదడును మనం ప్రశాంతంగా టెన్షన్లకు దూరంగా ఉంచాలి. అప్పుడే అందులో కణాలు విచ్చుకొని... బాగా ఆలోచించగలుగుతాయి. అదెలా? ఈ ఉరుకుల పరుగుల జీవితంలో బ్రెయిన్‌ని షార్ప్‌గా చేసుకోవడానికి మనకు టైమెక్కడ అని అనుకోవాల్సిన పనిలేదు. ఇందుకు సింపుల్ చిట్కాలున్నాయి. అవి పాటించారంటే... బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచెయ్యడం ఖాయం.

health tips, brain sharpness, brain tip, good sleep, sleeping benefits, healthy brain, music benefits, music for brain, tips, brain problems, మెదడు, చురుకైన మెదడు, బ్రెయిన్ షార్ప్, ఇంటెలిజెంట్
ప్రతీకాత్మక చిత్రం


బాగా నిద్రపోండి : జనరల్‌గా మనకు 6 నుంచీ 8 గంటల నిద్ర అవసరం. ఐతే... అది పూర్తిగా ఒకేసారి నిద్రపోవాలన్న రూలేమీ లేదు. ఏ బస్సులో వెళ్తున్నప్పుడో, ఎక్కడైనా కాసేపు కూర్చున్నప్పుడో వీలైతే ఓ కునుకు తీసేయండి. దాని వల్ల కలిగే ప్రయోజనాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు జరిపిన ఎన్నో పరిశోధనల్లో తేలింది.

health tips, brain sharpness, brain tip, good sleep, sleeping benefits, healthy brain, music benefits, music for brain, tips, brain problems, మెదడు, చురుకైన మెదడు, బ్రెయిన్ షార్ప్, ఇంటెలిజెంట్
ప్రతీకాత్మక చిత్రం


మ్యూజిక్ వినండి : సంగీతానికీ మన బ్రెయిన్‌కీ లింక్ ఉంది. మనం చక్కటి మ్యూజిక్ వింటున్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం. అదే గంభీరమైన రెచ్చగొట్టే మ్యూజిక్ వింటే రెచ్చిపోతాం. అదే ఏడుపు సాంగ్ వింటే... మనకూ కన్నీళ్లొస్తాయి. కారణం మన బ్రెయిన్ ఆలోచనలు ఆ సాంగ్‌తో మిక్స్ అవుతాయి. అందువల్ల మనం మంచి సాంగ్స్, చక్కటి మ్యూజిక్ వినాలి. ఎన్ని పనులున్నా... జస్ట్ ఓ ఐదు నిమిషాలు మ్యూజిక్ వినేయాలి. ఆ తర్వాత మనల్ని చురుగ్గా ఉంచే పనిని బ్రెయిన్ చూసుకుంటుంది. మ్యూజిక్ మన టెన్షన్లను తగ్గిస్తుందనీ, బ్రెయిన్‌లో కణాలను ఉత్తేజ పరుస్తుందని జపాన్ డాక్టర్ల పరిశోధనల్లో తేలింది.

health tips, brain sharpness, brain tip, good sleep, sleeping benefits, healthy brain, music benefits, music for brain, tips, brain problems, మెదడు, చురుకైన మెదడు, బ్రెయిన్ షార్ప్, ఇంటెలిజెంట్
ప్రతీకాత్మక చిత్రం


పజిల్స్ చేసేయండి : వయసులో ఉన్నప్పుడు మనం బ్రెయిన్‌ని ఇబ్బంది పెడితే... ముసలివాళ్లం అయినప్పుడు... మతిమరపు, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధి వంటివి మనల్ని ఇబ్బంది పెడతాయి. అందుకే మనం బ్రెయిన్‌ కోసం కొంత టైం కేటాయించాలి. అంటే... ఈ పజిల్స్, సుడోకూ లాంటి గేమ్స్ ఆడాలి. మ్యాగజైన్లు, పేపర్లు, బుక్స్ వంటివి అప్పుడప్పుడూ చదువుతూ ఉండాలి. చేతిలో మొబైల్ ఉంటుందిగా... ఒక్కసారి ప్లే స్టోర్‌లోకి వెళ్లి... బ్రెయిన్ గేమ్స్ ఎంచుకోండి. పనైపోతుంది. మెదడు ఖుషీ అయిపోతుంది. మనకూ హ్యాపీ.ఇవి కూడా చదవండి :

మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ తయారీ... సింపుల్‌గా ఎలా... ఇలా చెయ్యండి


మొబైల్ నెట్‌వర్క్ మారాలా? జస్ట్ గంటలో పనైపోతుంది... ఇలా చెయ్యండి


మీ మొబైల్ లో యాప్స్‌ డైరెక్టుగా ఎవరికైనా పంపాలా... సింపుల్... ఇలా చెయ్యండి


వాట్సాప్ సీక్రెట్ ట్రిక్... అవతలి వాళ్లకు తెలియకుండా వాళ్ల స్టేటస్ చూడటం ఎలా?

Published by:Krishna Kumar N
First published: