Bank Holidays in December 2020: బ్యాంకులో పని ఉందా? డిసెంబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..

మీరు తరచూ బ్యాంకులకు వెళ్తుంటారా? ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరుపుతుంటారా? అయితే బ్యాంకులు ఎప్పుడు తెరిచి ఉంటాయో, ఏ రోజు సెలవులో ఖచ్చితంగా తెలుసుకొని ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం మంచిది.

news18-telugu
Updated: November 27, 2020, 1:44 PM IST
Bank Holidays in December 2020: బ్యాంకులో పని ఉందా? డిసెంబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీరు తరచూ బ్యాంకులకు వెళ్తుంటారా? ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరుపుతుంటారా? అయితే బ్యాంకులు ఎప్పుడు తెరిచి ఉంటాయో, ఏ రోజు సెలవులో ఖచ్చితంగా తెలుసుకొని ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం మంచిది. మరి వచ్చే నెల డిసెంబర్‌లో బ్యాంకులకు ఏఏ రోజున హాలిడే ఉందో తెలుసుకోండి. మాములుగా మనదేశంలోని బ్యాంకులకు ప్రతి ఆదివారం, రెండో, నాలుగో శనివారాలు సెలవులనే సంగతి తెలిసిందే. అయితే అవి మాత్రమే కాకుండా బ్యాంకు ఉద్యోగులకు మరి కొన్ని సెలవులు కూడా ఉంటాయి. బ్యాంకు సెలవుల గురించి ముందుగానే తెలుసుకోవడం ద్వారా మందస్తు ప్రణాళికలతో మీ బ్యాంకింగ్ కార్యాకలాపాలు నిర్వహించుకోవచ్చు.

ALSO READ: India vs Australia:చెత్త ఫీల్డింగ్.. చెత్త బౌలింగ్.. దంచికొట్టిన ఆసీస్

అయితే డిసెంబర్ నెలలో క్రిస్‌మస్(డిసెంబర్ 25న) మాత్రమే బ్యాంక్‌లకు సెలవు ఉంటుంది. అయితే బ్యాంక్ సెలవులు రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. రాష్ట్రాల్లో ప్రాంతీయంగా జరుపుకునే పండగల ఆధారంగా కూడా సెలవులు వస్తూ ఉంటాయి. ఇక, డిసెంబర్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంక్ సెలవులను ఒక్కసారి పరిశీలిస్తే.. ఈ నెలలో క్రిస్‌మస్‌తో కలిపి మొత్తం ఏడు సెలవులు ఉండనున్నాయి. అయితే క్రిస్‌మస్ శుక్రవారం రోజున రావడం, ఆ తర్వాత నాలుగో శనివారం, ఆదివారం జత కలవడంతో బ్యాంకు ఉద్యోగులకు మూడు రోజులు వరుస సెలవులు ఉండనున్నాయి.

డిసెంబర్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సెలవులు..
డిసెంబర్ 6 ఆదివారం
డిసెంబర్ 12 రెండో శనివారం
డిసెంబర్ 13 ఆదివారం

డిసెంబర్ 20 ఆదివారం
డిసెంబర్ 25 శుక్రవారం(క్రిస్‌మస్)
డిసెంబర్ 26 నాలుగో శనివారం
డిసెంబర్ 27 ఆదివారం
Published by: Sumanth Kanukula
First published: November 27, 2020, 12:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading