హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

LinkedIn Survey: వర్క్ ప్లేస్‌లో ఎమోషన్స్ షేర్ చేసుకోవడం మంచిదే.. ప్రొడక్టివిటీ పెరుగుతుందంట.. మీ కంపెనీలో కూడా ట్రై చేయండీ..!

LinkedIn Survey: వర్క్ ప్లేస్‌లో ఎమోషన్స్ షేర్ చేసుకోవడం మంచిదే.. ప్రొడక్టివిటీ పెరుగుతుందంట.. మీ కంపెనీలో కూడా ట్రై చేయండీ..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆన్‌లైన్ ప్రొఫెషనల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫారమ్ ‘లింక్డ్‌ఇన్’ ఇటీవల ఓ కొత్త పరిశోధనను విడుదల చేసింది. పని ప్రాంతంలో నిపుణులు తమను తాము ఎలా ఎక్స్‌ప్రెస్ చేసుకుంటారనే విషయంపై లింక్డ్‌ఇన్ సర్వే చేపట్టింది. ఈ సర్వే రిపోర్టులో పేర్కొన్న కీలక వివరాలు..

ఇంకా చదవండి ...

ఆన్‌లైన్ ప్రొఫెషనల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫారమ్ ‘లింక్డ్‌ఇన్’ (LinkedIn) ఇటీవల ఓ కొత్త పరిశోధనను విడుదల చేసింది. పని ప్రాంతంలో నిపుణులు తమను తాము ఎలా ఎక్స్‌ప్రెస్ చేసుకుంటారనే విషయంపై లింక్డ్‌ఇన్ సర్వే (Survey) చేపట్టింది. దాదాపు 2,188 మంది ప్రొఫెషనల్స్ ఈ సర్వేలో పాల్గొన్నారు. భారత్‌లో 3/4వంతు మంది (76 శాతం) నిపుణులు వర్క్ ప్లేస్‌ (Work Place)లో ఎమోషన్స్ షేర్ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా కోవిడ్ (Covid) తర్వాత ఈ ధోరణి పెరిగినట్లు సర్వే తేల్చింది.

పనిలో ఎక్కువ భావోద్వేగాలను ప్రదర్శించడమనేది హైబ్రిడ్ వర్క్ మోడల్‌లో మెరుగైన సిబ్బంది నైతికతకు రహస్యం కావచ్చు. అలా చేయడం వల్ల మరింత ఉత్పాదకత పెరిగిందని దాదాపు 87 శాతం మంది (ప్రతి 10 మందిలో 9 మంది) నిపుణులు అంగీకరించినట్టు లింక్డ్‌ఇన్ నివేదిక వెల్లడించింది. భారతదేశంలోని నిపుణులు తమ ఎమోషన్స్ విషయంలో వెనుకడుగు వేయడం లేదు. దాదాపు మూడింట రెండు వంతుల (63%) మంది తమ యజమాని ముందు ఏడ్చినట్లు అంగీకరించారు. మూడోవంతు (32%) మంది ఒకటి కంటే ఎక్కువ సందర్భాలలో అలా చేసినట్లు లింక్డ్‌ఇన్ సర్వే తెలిపింది.


హాస్యం విషయంలో ఇలా..

దేశంలో మూడొంతుల మంది (76 శాతం) నిపుణులు పని ప్రదేశంలో జోక్‌లు వేయాలని కోరుకుంటున్నారు. అయితే సగానికి పైగా (56 శాతం) దాన్ని ‘అన్ ప్రొఫెషనల్’గా పరిగణిస్తున్నారు. ఈ మిశ్రమ భావాలు ఉన్నప్పటికీ, భారతదేశంలో 9/10 వంతు మంది (90 శాతం) నిపుణులు హాస్యం అనేది పరిమితంగా ఉపయోగించాలని భావిస్తున్నారు. అయితే వాస్తవానికి, 3/5 వంతుల కంటే ఎక్కువ మంది (61 శాతం) నిపుణులు ఆఫీసుల్లో సాధారణం కంటే ఎక్కువ హాస్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నారు.

మొత్తంమీద, దక్షిణ భారతదేశంలోని నిపుణులు దేశంలో అత్యధిక జోకులు పేల్చుతున్నారు. 2/5 శాతం మంది (43 శాతం) కనీసం రోజుకు ఒకసారి అలా చేస్తున్నారు. పశ్చిమ భారతంలో (38 శాతం), తూర్పు ప్రాంతాల నిపుణులు 37 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఉత్తర భారతదేశంలో 36 శాతం మంది నిపుణులు జోక్ లను ఇష్టపడుతున్నారు. ఈశాన్యంలో ఇది 33 శాతంగా ఉంది.

భారతీయ, ఇటాలియన్ కార్మికులు ప్రపంచవ్యాప్తంగా హాస్యాస్పదమైన కార్మికులుగా అగ్రస్థానంలో ఉన్నారు. ఈ దేశాల్లో మూడవ వంతు (38 శాతం) మంది నిపుణులు వర్క్ ప్లేస్‌లో కనీసం రోజుకు ఒక్కసారైనా జోక్ వేస్తారు. జర్మన్లు ​​(36 శాతం), బ్రిటీషర్లు (34 శాతం), డచ్ (33 శాతం), ఫ్రెంచ్ (32 శాతం)తో పోల్చినప్పుడు ఆస్ట్రేలియన్ కార్మికులు (29 శాతం)తో తక్కువ ఫన్నీగా ఉంటారు.

​​

Published by:Mahesh
First published:

Tags: Company, Employees, Lifestyle, Work

ఉత్తమ కథలు