హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Kids Sleeping: మీ పిల్లలు రాత్రిళ్లు త్వరగా నిద్రపోవడం లేదా..? ఇలా చేసి చూడండి..

Kids Sleeping: మీ పిల్లలు రాత్రిళ్లు త్వరగా నిద్రపోవడం లేదా..? ఇలా చేసి చూడండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చిన్నపిల్లల ఎదుగుదలకు తోడ్పడే ముఖ్యమైన అంశాల్లో నిద్ర కూడా ఒకటి. 3 నుంచి 5 సంవత్సరాల వయసున్న పిల్లలు రోజుకు 10 నుంచి 13 గంటల పాటు నిద్రపోవాలి. అదే 6-12 ఏళ్ల పిల్లలు.. 9 నుంచి 11 గంటలు పడుకోవాలి.

చిన్నపిల్లలను నిద్రపుచ్చడం తల్లిదండ్రులకు ఒక్కోసారి చాలా కష్టంగా మారుతుంది. వారు త్వరగా నిద్రపోరు.. ఒకవేళ పడుకున్నా మధ్యరాత్రుళ్లు లేస్తుంటారు. ఏడుస్తుంటారు. నిద్రను తప్పించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే పెద్దలు మాత్రం నిద్రను ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఎక్కువ సమయం నిద్రపోయే అవకాశం పెద్దవాళ్లకు దక్కదు. పిల్లలు నిద్రను నిరాకరించడానికి.. పెద్దలకు నిద్ర తక్కువ అవ్వడానికి విభిన్న కారణాలు ఉంటాయి.

ఎంత నిద్ర సరిపోతుంది

చిన్నపిల్లల ఎదుగుదలకు తోడ్పడే ముఖ్యమైన అంశాల్లో నిద్ర కూడా ఒకటి. 3 నుంచి 5 సంవత్సరాల వయసున్న పిల్లలు రోజుకు 10 నుంచి 13 గంటల పాటు నిద్రపోవాలి. అదే 6-12 ఏళ్ల పిల్లలు.. 9 నుంచి 11 గంటలు పడుకోవాలి.  18 సంవత్సరాలు, అంత కంటే ఎక్కువ వయసు వారికి కనీసం 7 నుంచి 9 గంటలు నిద్ర అవసరం. పిల్లలకు నిద్ర తక్కువైందని గుర్తించడం చాలా కష్టం. వారు చెప్పలేరు కాబట్టి కొన్నిసార్లు అసలు తెలుసుకోలేం.

అయితే పిల్లలకు నిద్ర తక్కువైనప్పుడు కొన్ని సంకేతాలను గుర్తించవచ్చు. పిల్లలు సరిగా ప్రవర్తించనప్పుడు, ఓవర్ ​యాక్టివ్​గా ఉన్నప్పుడు, చదువులో వెనుకబడి ఉన్నప్పుడు, శారీరకంగా ఎక్కువగా ఎదగనప్పుడు వారికి సరైన నిద్ర ఉందా లేదా అనేది పెద్దలు తప్పకుండా గుర్తించాలి. పెద్దవాళ్లు అయితే.. తమకు నిద్ర తక్కువ అయిందని గుర్తించగలుగుతారు. కానీ పిల్లలు దాన్ని కనుక్కోలేరు. అందుకే చిన్నారుల నిద్ర విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

పిల్లలకు నిద్రపట్టకపోవడానికి కారణాలు

పిల్లలు త్వరగా నిద్రలోకి జారుకునేందుకు ఇష్టపడరు. మధ్యమధ్యలో లేస్తుంటారు. తెల్లవారుజాముల్లోనే మేల్కొంటారు. వీటికి కొన్ని విషయాలు కూడా కారణాలు కావొచ్చు. తరచూ ఇళ్లు మారడం, ఇంట్లో గొడవలు జరుగుతుండడం, స్కూళ్లకు వెళ్లే తొలినాళ్లలో ఇబ్బందులు.. వంటి కారణాల వల్ల పిల్లలు సరిగా నిద్రపోలేరు. అలాగే పెద్దలు ఎక్కువ సమయం మేలుకొని ఉంటే.. ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది.

ఇక పెద్దలు త్వరగా నిద్రపోకపోవడానికి ఎక్కువ శాతం ప్రస్తుతం మొబైల్స్, ల్యాప్​టాప్స్ లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కారణమవుతున్నాయి. మొబైల్​ ఇంటర్నెట్ బ్రౌజింగ్​, షోలు, సోషల్ మీడియాను అతిగా వాడుతూ.. నిద్రవస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ ఎక్కువ మంది మేల్కొంటున్నారు.

ఇలా చేస్తే మేలు

పిల్లలు, పెద్దలు ఇంట్లో ఒకేసారి నిద్రపోతే చాలా మంచిది. దీనివల్ల నిద్ర సమయం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే అందరూ ప్రతీరోజు ఒకే సమయంలో మేల్కోవడం కూడా ఉత్తమం. అలాగే ప్రతీరోజు 30 నుంచి 60 నిమిషాలు నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తే మంచిది. పిల్లలకు గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం, వారితో పుస్తకాలు చదివించడం అలవాటు చేయాలి.

నిద్రపోయే ముందు టీవీ చూడడం, సోషల్ మీడియా వాడడం, వీడియోగేమ్స్​ లాంటివి అసలు చేయకూడదు. పిల్లలకు అసలే ఇలాంటివి అలవాటు చేయకూడదు. నిద్రపోయే ముందు ప్రశాంతమైన, నిశ్శబ్ద వాతావరణం ఉంటే నిద్ర నాణ్యతగా ఉంటుంది. అలాగే పిల్లలు నిద్రపోయేటప్పుడు పూర్తి చీకటిగా ఉండకుండా నైట్​లైట్లు వినియోగించాలి.

ఇక కొందరు పిల్లలు, పెద్దల్లో స్లీపింగ్ డిజార్డర్లు కూడా ఉంటాయి. ఉదాహరణకు పారాసోమనియాస్ ఉంటే నిద్రలో నడవడం, నిద్రలో మాట్లాడడం, పీడకలలు, తరచూ ఉలిక్కిపడి లేవడం లాంటివి చేస్తారు. పెద్దల కంటే పిల్లల్లోనే ఇలాంటివి ఉంటాయి. అయితే చాలా మంది పిల్లల్లో వయసు పెరిగే కొద్ది ఈ డిజార్డర్​ తగ్గుతుంది. ఒకవేళ ఈ డిజార్డర్ వల్ల ఎక్కువ ఇబ్బందులు వస్తే డాక్టర్​ను సంప్రదించాలి.

First published:

Tags: Life Style, Lifestyle, Sleep, Sleep tips

ఉత్తమ కథలు