Sex vs Money: శృంగారం.. డబ్బు.. వీటిలో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది ఏది..?

Sex vs Money: కొందరు డబ్బు కంటే శృంగారానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తే.. మరికొందరు జీవితంలో సుఖంగా ఉండాలంటే డబ్బును మించింది లేదని వాదిస్తుంటారు.

news18-telugu
Updated: November 25, 2020, 8:58 PM IST
Sex vs Money: శృంగారం.. డబ్బు.. వీటిలో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది ఏది..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మనిషి జీవితం డబ్బు, శృంగారం చుట్టూనే తిరుగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొందరు డబ్బు కంటే శృంగారానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తే.. మరికొందరు జీవితంలో సుఖంగా ఉండాలంటే డబ్బును మించింది లేదని వాదిస్తుంటారు. ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనది అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మాత్రం సమాధానం చెప్పడం చాలా కష్టం. అయితే, డబ్బు అత్యంత ఆనందాన్ని ఇస్తుందనేది సగటు మానవుని అభిప్రాయం. ఎందుకంటే డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్లే, మనకిష్టమైన వస్తువులను కొనడమే కాకుండా అనంతమైన ఆనందాన్ని పొందవచ్చు. డబ్బుతో సమాజంలో గౌరవం లభిస్తుంది. తద్వారా బంధువులు, స్నేహితుల నుంచి కీర్తింపబడుతాం.

అయితే, జీవితంలో ఆనందంగా బ్రతకడానికి డబ్బు ఎంత ముఖ్యమో శృంగారం కూడా అంతే ముఖ్యమని, శృంగారం వ్యక్తి మానసిక ఆనందాన్ని పెంచే సాధనంగా పనిచేస్తుందని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి, మీరు ఆర్థికంగా బలపడితే అది మీకు కొండంత శక్తిని, ఖ్యాతిని, ఆనందాన్ని ఇస్తుంది. కానీ, అది తాత్కాలికం మాత్రమే. డబ్బు సంపాదించడమే తమ జీవితంలో ఏకైక ముఖ్యమైన విషయంగా భావించే వ్యక్తుల కంటే బెడ్‌రూమ్‌లో తమ సమయాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించే వ్యక్తులే సంతోషంగా ఉంటారని అధ్యయనాలు తేల్చాయి. ఎందుకంటే, శృంగారంలో ఎక్కువగా పాల్గొనే వారు వారి భాగస్వామితో బలమైన బంధాన్ని కలిగి ఉంటారు. అంతేకాక వారు ఎల్లప్పుడూ ఉత్సాహంగా, చురుకుగా ఉంటూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

డబ్బు కంటే శృంగారంతోనే ఎక్కువ ఆనందం
ధనికులు, అత్యంత విద్యావంతులైన వ్యక్తులు తమ జీవితంతో ఎక్కువ సంతోషంగా లేరని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వారు తమ భాగస్వామితో లైంగిక సంబంధం కలిగి ఉన్నప్పుడు మితమైన ఆనందాన్నే పొందుతున్నారు. అదేవిధంగా, ఆర్థికంగా బలంగా లేని వారు, శృంగారాన్ని అమితంగా ఆస్వాదిస్తున్నారు అని అధ్యయనం తేల్చింది. ఆర్థికంగా బలంగా ఉంటే మీరు శృంగారంలో ఎక్కువ తృప్తి పొందుతారని ఏమీ లేదు. ఆదాయ స్థాయిలు మీ శృంగార ఫ్రీక్వెన్సీని ఏ రకంగానూ ప్రభావితం చేయవు. కాబట్టి, డబ్బు లేకపోవడం వల్ల శృంగారాన్ని ఆనందించలేమనే ఆందోళన చెందాల్సిన పని లేదు. ఒకరి లైంగిక జీవితాన్ని ఆదాయం ప్రభావితం చేస్తుందనే ఆలోచన నుండి మొదట మీరు బయటపడాలి. ప్రపంచంలో వెల కట్టలేని సంబంధాలు ఏవైనా ఉన్నాయంటే అవి ప్రేమ, శృంగారం మాత్రమే అని గుర్తించుకోవాలి.

దీనిపై డార్ట్మౌత్ కాలేజ్, వార్విక్ విశ్వవిద్యాలయం ఇటీవల ఒక పరిశోధన జరిపింది. ఈ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. దీని ప్రకారం ‘‘ఒక వ్యక్తికి శృంగారం అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. వారానికి ఒకసారి లేదా ఎక్కువసార్లు శృంగారం చేయడం అనేది వేలాది కరెన్సీ నోట్లకు సమానం. డబ్బున్న వారు ప్రపంచంలో వారు కోరుకున్నది కొనగలిగినప్పటికీ, చాలా సంతోషంగా లేరు.” అని తేలింది. భాగస్వామితో డేట్‌కు వెళ్లడం, వారి కోసం ఏదైనా చేయడం, శృంగారంలో పాల్గొనడం వంటివి డబ్బు కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయని అధ్యయనం పేర్కొంది. ఒంటరిగా ఉన్న విజయవంతమైన వ్యక్తుల కంటే వివాహం జరిగిన విజయవంతమైన వ్యక్తులే శృంగారాన్ని ఎక్కువగా ఆనందిస్తారు. డబ్బు కంటే శృంగారం మాత్రమే మనిషికి ఎక్కువ ఆనందాన్ని అందించగలవని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: November 25, 2020, 8:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading