Home /News /life-style /

LIFE STYLE NEWS ARE YOU SEARCHING FOR LIFE PARTNER DONT CONSIDER THESE ISSUE FOR BETTER LIFE SK GH

Life Partner: జీవిత భాగస్వామిని వెతుకుతున్నారా? ఈ విషయాలను పట్టించుకోవద్దు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొంతమంది తమ భాగస్వామిని ఎంచుకోవడం విషయంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. దీని వల్ల పెళ్లి తర్వాత కలిసి ఉండలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అందువల్ల, భాగస్వామిని ఎంచుకునే క్రమంలో కొన్ని విషయాలను బాగా గమనించాల్సి ఉంటుంది. అవేంటో చూడండి.

ఇంకా చదవండి ...
పెళ్లి అనేది ఇద్దరి జీవితాలను ఒకటి చేసేది. అయితే, ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు సరిగ్గా లేకపోయినా వారి వివాహ జీవితంలో ఇబ్బందులు తప్పవు. అందుకే, జీవిత భాగస్వామి ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. అయితే, కొంతమంది మాత్రం భాగస్వామిని ఎంచుకోవడం విషయంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల పెళ్లి తర్వాత కలిసి ఉండలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అందువల్ల, భాగస్వామిని ఎంచుకునే క్రమంలో కొన్ని విషయాలను బాగా గమనించాల్సి ఉంటుంది. అంతే కాదు.. మరి కొన్ని విషయాల గురించి అస్సలు పట్టించుకోకూడదు. అవేంటో తెలుసుకుందాం.

అందం కంటే వ్యక్తిత్వం ముఖ్యం:
సహజంగా ఎవరైనా ఎదుటివారి అందాన్ని చూసి ఇష్టపడతారు. వారి వ్యక్తిత్వం ఎలా ఉన్నప్పటికీ అందంగా ఉంటే చాలు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. ఇది సరైన పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అందం, ఎత్తు, రంగు వంటి వాటి కంటే అవతలి వ్యక్తి వ్యక్తిత్వం ఎంతో ముఖ్యమైనది. బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం గొప్పది. అందుకే అందం కంటే వారిలోని నిజాయితీ, వ్యవహార శైలితో పాటు వారి మనస్తత్వం మీ మనస్తత్వానికి దగ్గరగా ఉందా? లేదా? అన్న విషయాలను గమనించాలని స్పష్టం చేస్తున్నారు.

వయస్సుపై శ్రద్ధ పెట్టకండి:
మీ భాగస్వామి ఎంత గొప్పవారో వారి వయస్సును బట్టి చెప్పలేం. వారి జీవిత అనుభవాలు, వారి పెంపకం, జీవితంలో వారు ఎదుర్కొన్న కష్టనష్టాలు వంటి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. చాలా సంబంధాలు శరీరాకృతి, రంగు, వయస్సుతో పని లేకుండా దృఢంగా నిలుస్తాయని గుర్తించుకోండి. జీవితంలో కలిసి మెలిసి గడిపేందుకు వయస్సు, శరీరాకృతి వంటివి అడ్డు రావని అర్థం చేసుకోండి.

ఎలా కలిశారని పట్టించుకోవద్దు:
టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరగడం కొన్ని అనర్థాలకు కూడా దారితీస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో టెక్నాలజీ కూడా మంచే చేస్తుంది. డేటింగ్ యాప్స్ ద్వారా మొదలైన బంధాల్లో 30% జీవితాంతం నిలిచి ఉంటున్నాయట. చాలామంది తాము డేటింగ్ యాప్స్ లో కలిసిన వ్యక్తిని కలిసి, ముందు ప్రేమలో పడడం, ఆ తర్వాత వారినే వివాహం చేసుకోవడం చేస్తున్నారట. అందుకే సోషల్ మీడియా ద్వారా బంధాలను కొనసాగించడం కాస్త ఇబ్బందైన పద్ధతే అయినా.. ఒకవేళ అవతలి వ్యక్తి ని కలిసిన తర్వాత వారు మంచి వారు అన్న ఫీలింగ్ మీకు వస్తే అలాంటివారిని భాగస్వామిగా ఎంచుకోవడానికి వెనుకాడవద్దు.

వారి గతం మీకు అనవసరం:
మీరు మీ భాగస్వామిని చూసే వరకూ ఇంకెవరినీ ప్రేమించకపోయి ఉండొచ్చు. వారు మాత్రం మీకంటే ముందే ఓ నలుగురితో బ్రేకప్ చెప్పి ఉండవచ్చు. అయితే ఇవేవీ మీ బంధాన్ని బలహీనంగా మార్చలేవు. మీ ఇద్దరి మధ్య ప్రేమ, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విధానం వంటివి మీ ఇద్దరినీ కలకాలం కలిపి ఉంచుతాయి. అందుకే వారి గతం గురించి గతంలోనే వదిలేయండి. అలాంటి విషయాలు పట్టించుకోవద్దు. గతంలో వారికి ఉన్న ప్రేమికుల గురించి మాట్లాడి వారిని ఇబ్బంది పెట్టవద్దు.

ఆలోచనలను పంచుకోండి:
మీ జీవితంలో కొత్త వ్యక్తిని ఆహ్వానించే క్రమంలో వారితో మీ ఇష్టాఇష్టాలను పంచుకోండి. అదేవిధంగా వారి ఇష్టాలను కూడా తెలుసుకోండి. సాధారణంగా ఆలోచనలు ఒకేలా ఉంటే వివాహ జీవితం సాఫీగా సాగుతుందని భావిస్తుంటాం. కానీ ఇద్దరూ ఒకేలా ఆలోచించే వ్యక్తులైతే కొన్ని రోజుల తర్వాత జీవితం బోరింగ్ గా మారే అవకాశం ఉంటుంది. ఇద్దరి అభిరుచులు వేర్వేరుగా ఉండి.. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవిస్తూ.. ఒకరికి నచ్చిన విషయాలను మరొకరు ట్రై చేస్తూ ముందుకు వెళ్లడం వల్ల జీవితం కొత్త కొత్తగా ఆనందంగా మారుతుంది. ఉదాహరణకు మీకు ఇంట్లో ఉండడం అంటే ఇష్టం. మీ భాగస్వామికి ట్రెక్కింగ్ అంటే ఇష్టం. అలాంటప్పుడు ట్రెక్కింగ్ చేయడంలోని మజాను మీరు ఓసారి ట్రై చేస్తే వీకెండ్ కి ఇంట్లోనే ఉంటూ ఆనందంగా సమయం గడపడాన్ని వారూ ఆనందిస్తారు. ఇలా ఇద్దరి ఇష్టాలను గౌరవిస్తూ జీవించడం వల్ల కొత్త కొత్త అలవాట్లతో మీ జీవితం ఆనందంగా మారుతుంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Life Style, Love, Marriage

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు