హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

LIC Housing Finance: బెంచ్‌మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటు పెంపు.. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లోన్లపై ప్రభావం

LIC Housing Finance: బెంచ్‌మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటు పెంపు.. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లోన్లపై ప్రభావం

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లోన్లపై ప్రభావం

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లోన్లపై ప్రభావం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేటు పెంపు నిర్ణయం తర్వాత వడ్డీ రేట్లు పెంచే కంపెనీల జాబితాలో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ చేసింది. ఈ సంస్థ బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును (LHPLR) 60 బేసిస్ పాయింట్లు పెంచింది. దీన్ని గృహ రుణాల వడ్డీ రేట్లను నిర్ణయించడంలో ఉపయోగి

ఇంకా చదవండి ...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేటు పెంపు నిర్ణయం తర్వాత వడ్డీ రేట్లు పెంచే కంపెనీల జాబితాలో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ చేసింది. ఈ సంస్థ బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును (LHPLR) 60 బేసిస్ పాయింట్లు పెంచింది. దీన్ని గృహ రుణాల వడ్డీ రేట్లను నిర్ణయించడంలో ఉపయోగిస్తారు. దీని ప్రభావంతో గృహ రుణాల వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పులు జూన్ 20 నుంచి అమల్లోకి వస్తాయి. గృహ రుణాలపై సవరించిన వడ్డీ రేట్లు ఇప్పుడు 7.50 శాతం నుంచి ప్రారంభమవుతాయని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్‌ఐసీ హౌసింగ్ ప్రైమ్ లెండింగ్ రేటు ఇప్పుడు 15.30 శాతంగా ఉన్నట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

సిబిల్‌ స్కోర్‌ ఎక్కువగా ఉంటే వడ్డీ తక్కువ

రుణగ్రహీత (జీతం తీసుకొనే వారు, వృత్తి నిపుణులు) సిబిల్‌ స్కోర్ 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, రూ.10 లక్షల కంటే ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న గృహ రుణాలపై వడ్డీ రేటు 7.50 శాతంగా ఉంటుంది. సిబిల్‌ 700 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉన్న వేతనాలు పొందేవారు, వృత్తి నిపుణులకు రూ.50 లక్షల వరకు గృహ రుణాలపై 7.55 శాతం వడ్డీ రేటు ఉంటుంది. రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న వాటిపై 7.75 శాతం వడ్డీ రేటును చెల్లించాల్సి ఉంటుంది. రూ.2 కోట్ల నుంచి రూ.15 కోట్ల కంటే ఎక్కువ గృహ రుణాలపై 7.90 శాతం వడ్డీని విధిస్తారు.

600 నుంచి 699 మధ్య సిబిల్‌ స్కోర్‌ ఉంటే.. రూ.50 లక్షల వరకు గృహ రుణాలపై వడ్డీ రేటు 7.80 శాతంగా ఉంటుంది. రూ.50 లక్షల కంటే ఎక్కువ నుంచి రూ.2 కోట్ల వరకు ఉండే రుణాలపై 8 శాతం, రూ.2 కోట్లకు పైబడిన రూ.15 కోట్ల కంటే తక్కువ రుణాలపై 8.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సిబిల్‌ స్కోర్ 600 కంటే తక్కువ ఉన్న వారికి రూ.50 లక్షల వరకు గృహ రుణాలపై 8.25 శాతం, రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు 8.45 శాతం, రూ.2 కంటే ఎక్కువ రూ.15 కోట్ల కంటే తక్కువ ఉన్న రుణాలకు 8.65 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తారు.

101- 200 మధ్య క్రెడిట్ స్కోర్‌లు లేదా NTC విషయానికొస్తే, జీతం పొందే ఉద్యోగులు, వృత్తి నిపుణుల కోసం రూ.50 లక్షల వరకు గృహ రుణాలపై వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంటుంది. అదే విధంగా రూ.50 లక్షల కంటే ఎక్కువ రూ.1 కోటి వరకు రుణాలపై 8.40 శాతం వడ్డీని వసూలు చేస్తారు.


రెపో రేట్లు పెరగడంతో వడ్డీ రేట్లు పెంచుతున్న బ్యాంకులు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కీలకమైన రెపో రేట్లను పెంచుతున్నందున, వాణిజ్య రుణదాతలు కూడా దీనిని అనుసరించి తమ వడ్డీ రేట్లను పెంచుతున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ల సహా పలు బ్యాంకులు ఇటీవలే వడ్డీ రేట్లను పెంచాయి. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ గత వారం ఏకగ్రీవంగా రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90 శాతానికి చేర్చింది. ఇది రుణాలపై వడ్డీ రేట్లను పెంచడానికి రుణదాతలను ప్రేరేపించింది.

వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో 7.04 శాతానికి స్వల్పంగా తగ్గిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. భారతదేశ ప్రధాన ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో దాదాపు ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి చేరుకుంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత ఇంధన ధరలు గణనీయంగా తగ్గడం.. గత నెలలో ఆహార ధరలను తగ్గించడానికి గణనీయంగా దోహదపడిందని నిపుణులు భావిస్తున్నారు. మేలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా ఐదో నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అప్పర్‌ టోలరెంట్‌ లెవల్‌ కంటే ఎక్కువగా ఉంది.

First published:

Tags: BUSINESS NEWS, Interest rates, LIC, Life Insurance

ఉత్తమ కథలు