Health Tips : లెమన్ సెంట్ వాడుతున్నారా... ఇవీ ప్రయోజనాలు

లెమన్ సెంట్ వాడుతున్నారా... ఇవీ ప్రయోజనాలు

Benefits of Lemon Scent : నిమ్మకాయతో ఎన్నో ప్రయోజనాలున్నాయని మనకు తెలుసు. అదే నిమ్మకాయ సెంటుతో కలిగే ప్రయోజనాలపై పరిశోధనలు చేశారు. అద్భుతమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం.

  • Share this:
కొంత మందికి బస్సు ప్రయాణం పడదు. వామ్టింగ్స్ చేసుకుంటారు. అలాంటి వాళ్లు... చేతిలో ఓ నిమ్మకాయ ఉంచుకొని... అప్పుడప్పుడూ దాని వాసన పీల్చుతూ ఉంటే... వికారం అన్నదే ఉండదు. ఫలితంగా వామ్టింగ్స్ అవ్వవు. ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో పరిశోధించగా... కొత్త విషయాలు చాలా తెలిసాయి. నిమ్మకాయ సెంటును వాసన పీల్చితే... మనసుకు చాలా తేలిగ్గా, ఆహ్లాదంగా అనిపిస్తుందని తెలిసింది. అధికబరువుతో ఉండేవారు సైతం... లెమన్ సెంట్‌ని పీల్చితే... తేలిగ్గా ఉన్న భావన కలుగుతోందట. 17వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్-కంప్యూటర్ ఇంటరాక్షన్‌ ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాల్ని బయటపెట్టింది. నిమ్మకాయ ఇలా ఉంటే... వెనీలా వాసన చూసేవాళ్లకు చాలా బరువుగా ఉన్న ఫీల్ కలుగుతోందట.

మనం లావుగా ఉంటే... చుట్టుపక్కల వాళ్లు ఏదో ఒక సందర్భంలో... లావు తగ్గాలని సూచిస్తారు. అలా అందరూ అంటుంటే... మనకు ఒకింత ఇబ్బంది అనిపిస్తుంది. అదే లెమన్ సెంట్ పీల్చితే... లావుగా ఉన్న వారికి కూడా... మనసులో లావుగా ఉన్న ఫీల్ కలగదట. వివిధ వాసనలు చూసేటప్పుడు... మన నాడీ కణాలు ఎలా స్పందిస్తాయో శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఆశ్చర్యంగా... నిమ్మకాయ సెంట్ వాసన చూస్తున్నప్పుడు... మన మెదడు... మన మనసులో... వివిధ దృశ్యాల్ని చాలా సన్నగా, తేలిగ్గా చూపిస్తోంది. ఇదెలా సాధ్యం అని శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు.

ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిని ఓ కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చోపెట్టారు. లెమన్ సెంట్ వాసన పీల్చుతున్నప్పుడు... వారి మెదడులో విజువల్ ఆనలాగ్ స్కేల్‌ను పోల్చి చూశారు. రకరకాల షేపులూ, హాట్, కోల్డ్, హై పిచ్, లో పిచ్, సన్న, లావు వ్యక్తుల దృశ్యాలు ఊహించుకోమని చెప్పి... వాళ్ల మెదడులో దృశ్యాలు ఎలా కనిపిస్తున్నాయో తెలుసుకున్నారు.

మరో అధ్యయనంలో పాల్గొన్నవారిని చెక్క బోర్డుపై నిలబెట్టారు. వారికి హెడ్‌ఫోన్స్ తగిలించారు. రెండు మోషన్ కాప్చర్ సెన్సార్లు, ఓ షూ బేస్డ్ పరికరం (ఇది వారి పాదాల నడకల్ని పెంచుతుంది) వంటివి అమర్చారు. తర్వాత వాళ్లను లెమన్ సెంట్ పీల్చుతూ... స్లోగా నడవమన్నారు. వాళ్ల బాడీ విజువలైజేషన్‌ని బట్టీ త్రీడీ అవతార్‌ సెట్టైంది. ఎలా నడుస్తున్నారు, బాడీ తేలిగ్గా ఉందా లేదా, ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయి వంటి వివరాలు తెలుసుకున్నారు. లెమన్ సెంట్ పీల్చినప్పుడు తేలిగ్గా, వెనీలా సెంట్ పీల్చినప్పుడు బరువుగా అనిపించినట్లు వాళ్లు తెలిపారు.

ఈ కొత్త అధ్యయనం ద్వారా... భవిష్యత్తులో ప్రజలు అధిక బరువు తగ్గేందుకు ఎలాంటి సెంట్లు వాడాలో కూడా నిర్ణయించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

 

ఇవి కూడా చదవండి :


Healthy Food : పాలకూర దోఖ్లా... తింటే ఎంతో ఆరోగ్యం

Health : పొడవైన జుట్టు సీక్రెట్ తెలిసిపోయింది... మీరూ పాటించండి


Aloe Vera : ప్రకృతి నుంచీ లభించే అద్భుతం... అలోవెరాతో ఆరోగ్య ప్రయోజనాలు


#HealthTips: పల్లీలు తింటే హార్ట్ ఎటాక్ రాదట..

సెక్స్ సామర్థ్యాన్ని పెంచే హిమాలయన్ వయాగ్రా...‘యర్సాగుంబా’ పడక సుఖానికి ప్రకృతి వైద్యం...

#HealthTips: బ్లడ్ క్యాన్సర్‌ని తగ్గించే విటమిన్ సి ఇంజెక్షన్
Published by:Krishna Kumar N
First published: