Left Handers Day 2020: అమితాబ్, సావిత్రి, సచిన్... ఎడమచేతివాటం సెలబ్రిటీలు వీరే

International Left Handers Day 2020: గొప్పవ్యక్తుల్లో చాలామంది ఎడమచేతివాటం కలిగి ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలి. జాతిపిత మహాత్మాగాంధీ కూడా ఎడమచేతివాటమే.

news18-telugu
Updated: August 13, 2020, 8:46 AM IST
Left Handers Day 2020: అమితాబ్, సావిత్రి, సచిన్... ఎడమచేతివాటం సెలబ్రిటీలు వీరే
ఎడమ చేతివాటం కలిగిన సావిత్రి, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండుల్కర్
  • Share this:
International Left Handers Day 2020: ఎడమ చేతివాటం వారికోసమంటూ ఓ ప్రత్యేక రోజు ఉందంటే నమ్మగలరా?.. అవును.. వారికోసం ఒకరోజు ఉంది. అది నేడే..అగస్టు 13. అంతర్జాతీయంగా ఎడమ చేతివాటం వారు ఇవాళ తమ 'డే'ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.  అందులో ప్రత్యేకత ఏముందని కొట్టిపారేయకండి. గొప్పవ్యక్తుల్లో చాలామంది ఎడమచేతివాటం కలిగి ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలి. జాతిపిత మహాత్మాగాంధీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఎడమచేతివాటమే.

1976 నుంచి ఈ రోజు(13 ఆగస్టు)ను అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్ డే‌గా దేశ, విదేశాల్లోని ఎడమచేతివాటం కలిగిన వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.  భారత దేశ జనాభాలో దాదాపు 10-12 శాతం మందికి ఎడమ చేతివాటం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.  అంటే దేశంలో దాదాపు 10 కోట్ల మంది ఎడమ చేతివాటం జనాభా ఉన్నట్లు ఓ సర్వే వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎడమ చేతివాటం సెలబ్రిటీల్లోనూ ఎక్కువ మంది భారత్ నుంచే ఉన్నారు.

అసలు ఎడమచేతివాటం ఎందుకు వస్తుందంటే.. జన్యువుల, పరిసరాల ప్రభావం కారణంగా వస్తుంది. LRRTM1 జన్యువు తండ్రి నుంచి శిశువుకి సంక్రమిస్తే ఈ లక్షణం ఉంటుంది. శిశువు గర్భంలో ఉన్నప్పుడు తల్లి శరీరంలో ఉండే టెస్టోస్టీరాన్‌ అనే హార్మోన్‌ స్థాయిపై కూడా ఆధారపడి ఈ లక్షణం వస్తుంది.


అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా


నిజం చెప్పాలంటే ఎడమచేతివాటం ఉన్నవారు అంత తేలిగ్గా జీవితాన్ని గడపలేదు. వీరికి అనేక సామాజిక, సాంకేతిక సమస్యలుంటాయి. వీటిని పరిష్కరించేందుకే సందీప్ విషనోయ్ అనే వ్యక్తి 2009లో ‘లెఫ్ట్ హ్యాండర్స్’ క్లబ్‌ని స్థాపించారు. దీని ద్వారా ఎడమచేతివాటమున్న విద్యార్థులు, మహిళలకు ఐన్‌స్టీన్ పేరుతో స్కాలర్‌షిప్‌లు, మదర్‌థెరిసా పేరిట స్వయం ఉపాధికి ఆర్థిక సాయం చేస్తున్నారు. అంతేకాదండోయ్.. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ లెఫ్ట్ హ్యాండర్స్ విగ్రహాలు, జీవితవిశేషాలతో గోవాలో ఏకంగా మ్యూజియంనే ఏర్పాటుచేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ, ధివంగత మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయ్, లక్ష్మీమిట్టల్, దీరుబాయి అంబానీ, రాహుల్ బజాజ్, అమితాబ్‌బచ్చన్, సచిన్ టెండూల్కర్, ఒబామా వంటి ప్రముఖులంతా లెఫ్ట్‌హ్యాండర్స్ కాబట్టి వీరి విగ్రహాలు ఆ మ్యూజియంలో కొలువుదీరాయి.

ఎగమ చేతివాటం కలిగిన అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్


బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్, సోనాక్షి సిన్హా, సన్నీ లియోన్, కపిల్ శర్మ, ఆయేషా టాకియా తదితరులకు ఎడమ చేతివాటం ఉంది.

ప్రధాని నరేంద్రమోదీకి కూడా ఎడమచేతివాటమే..


ప్రధాని నరంద్ర మోదీ సహజంగా పుస్తకంలో రాసేందుకు కుడిచేతిని వాడినా...తినేందుకు, ఏదైనా వస్తువును తీసుకోవాల్సి వస్తే ఎడమ చేతినే వాడుతారని చెబుతారు.

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాది కూడా ఎడమ చేతివాటమే. దేశంలో ఎడమచేతివాటం కలిగిన వారి కోసం కృషిచేస్తున్న లెఫ్ట్ హ్యాండర్స్ ఇండయా సంస్థకు టాటా సంస్థ స్కాలర్‌షిప్ కూడా ఇచ్చింది.

ఎడమ చేతివాటం కలిగిన సహజనటి సావిత్రి(ఫైల్ ఫోటో)


తెలుగు సినీ ప్రేక్షకులు సుస్థిర స్థానం సాధించిన సావిత్రిది కూడా ఎడమ చేతివాటమే.

సచిన్ టెండుల్కర్‌ది కూడా ఎడమచేతివాటమే..


గతంలో సచిన్ టెండూల్కర్ ‘నేను లెఫ్ట్ హ్యాండర్ కావొచ్చు.. కానీ నేను ఎప్పుడూ రైట్’ అంటూ సరదాగా ట్వీట్ చేశారు.మరి ఇప్పటికైనా ఒప్పుకుంటారా.. ఎడమచేతివాటం ప్రత్యేకతని.
Published by: Janardhan V
First published: August 13, 2020, 8:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading