ప్రకృతి ఒడిలో 24 గంటలు... లక్నవరం పర్యాటకులకు వరం!

లక్నవరం ఫెస్టివల్‌ ప్యాకేజీ బుక్ చేసుకున్నవాళ్లు సాయంత్రం 4 గంటలకు లక్నవరం చేరుకోవాలి. 24 గంటల పాటు ఏమేం చేయాల్సి ఉంటుందో అక్కడ గైడ్ వివరిస్తారు. సైక్లింగ్‌తో మొదలై సఫారీతో టూర్ ముగుస్తుంది.

news18-telugu
Updated: January 7, 2019, 8:30 PM IST
ప్రకృతి ఒడిలో 24 గంటలు... లక్నవరం పర్యాటకులకు వరం!
లక్నవరం
  • Share this:
సెలవుల్ని ఎలా ఎంజాయ్ చేయాలో అర్థం కావట్లేదా? సుదూర ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్లే మూడ్ లేదా? అన్ని టూరిస్ట్ స్పాట్స్ చూసేసి బోర్ కొట్టిందా? అయితే వెంటనే లగేజీ సర్దుకొని లక్నవరం వెళ్లండి. ప్రకృతి ఒడిలో ఓ 24 గంటలు గడపండి. ఈ జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి అంటూ జ్ఞాపకాలు మోసుకుంటూ తిరిగివెళ్లడం ఖాయం.

లక్నవరం... తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న టూరిస్ట్ స్పాట్. కొత్తకొత్త హంగులతో లక్నవరాన్ని మరింత అభివృద్ధి చేస్తోంది పర్యాటక శాఖ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ శాఖ వినూత్నంగా అడ్వెంచరస్ యాక్టివిటీస్ ప్రవేశపెట్టడం అదనపు ఆకర్షణ. రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్, నైట్ క్యాంపింగ్, జంగిల్ సఫారీ, ఎడ్లబండి యాత్ర... ఇలా జయశంకర్ జిల్లా అడవుల్లో ప్రతీ క్షణం ప్రకృతితో మమేకమై ఎంజాయ్ చేయొచ్చు.

ప్రకృతి ఒడిలో 24 గంటలు... లక్నవరం పర్యాటకులకు వరం!, laknavaram festival offers adventurous tourism experience to tourists

లక్నవరం ప్రత్యేకత


జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోవిందరావుపేట మండలం లక్నవరం గ్రామంలో ఉంది లక్నవరం చెరువు. పదివేల ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువులోనే 13 దీవులున్నాయి. ఈ చెరువు మీదుగా దీవుల్ని కలుపుతూ 160 మీటర్ల సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది. ఈ వేలాడే వంతెనపై విహరించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడే కేరళ తరహాలో హౌసింగ్ బోటు కూడా ఉంది. సరస్సు మధ్యలో కాకరకాయల బోడుపై నిర్మించిన రెస్టారెంట్‌లో అన్ని రకాల వంటకాలు రుచిచూడొచ్చు. ఇలా రోజురోజుకీ వేలాదిమంది పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న లక్నవరంలో ఇకపై ఏడాదంతా ఫెస్టివల్ నిర్వహిస్తోంది పర్యాటక శాఖ.

ప్రకృతి ఒడిలో 24 గంటలు... లక్నవరం పర్యాటకులకు వరం!, laknavaram festival offers adventurous tourism experience to tourists

లక్నవరం ఫెస్టివల్ లక్నవరం ఫెస్టివల్ ప్రతీ రోజు సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 4 గంటల వరకు 24 గంటలపాటు జరుగుతుంది. ఇటీవల ప్రారంభమైన 24 గంటల ఫెస్టివల్‌కు టూరిస్టుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఈ ఫెస్టివల్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్కరికి ప్యాకేజీ ధర రూ.2,000. రాత్రివేళలో గూడారాల్లో బస, భోజన సౌకర్యం ఉంటుంది. ముందుగా ఆన్‌లైన్‌లో www.ecotourism.bhupalpally.com బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా లక్నవరం ఎకో టూరిజం ప్రమోటర్ వంశీ(9502853154)ని సంప్రదించాలి. సలహాలు, సూచనల కోసం సమస్యలు ఎదురైనా ఎకో టూరిజం కో-ఆర్డినేటర్ సుమన్‌(7382619363)ని కాంటాక్ట్ చేయొచ్చు.

ప్రకృతి ఒడిలో 24 గంటలు... లక్నవరం పర్యాటకులకు వరం!, laknavaram festival offers adventurous tourism experience to tourists

ప్రకృతి ఒడిలో 24 గంటలు
లక్నవరం ఫెస్టివల్‌ ప్యాకేజీ బుక్ చేసుకున్నవాళ్లు సాయంత్రం 4 గంటలకు లక్నవరం చేరుకోవాలి. 24 గంటల పాటు ఏమేం చేయాల్సి ఉంటుందో అక్కడ గైడ్ వివరిస్తారు. ఎడమవైపు గుట్టలు, కుడివైపు లక్నవరం సరస్సు, మధ్యలో చిన్నదారిలో సైక్లింగ్‌తో ప్రయాణం మొదలవుతుంది. 2.6 కిలోమీటర్ల సైక్లింగ్ 2 గంటల్లో పూర్తవుతుంది. సైక్లింగ్ పూర్తైన తర్వాత లక్నవరంలోని నాలా పక్కన అడవిలో గుడారాల్లో నైట్ క్యాంపింగ్‌లో బస చేయాల్సి ఉంటుంది. అక్కడ పర్యాటకులు ఆటపాటలతో ఎంజాయ్ చేయొచ్చు.

ప్రకృతి ఒడిలో 24 గంటలు... లక్నవరం పర్యాటకులకు వరం!, laknavaram festival offers adventurous tourism experience to tourists

రాత్రి గుడారాల్లో నిద్రపోయే పర్యాటకులు తెల్లవారుజామున పక్షుల రాగాలతో నిద్రలేస్తారు. బర్డ్ వాచింగ్, సరస్సులో స్నానం, అడవిలో విహారం తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత సస్పెన్షన్ బ్రిడ్జిపై విహరించొచ్చు. బోటింగ్ చేయాలనుకునేవారూ ఆ ముచ్చట తీర్చుకోవచ్చు. ఒడ్డుకు చేరుకున్న తర్వాత తూముల నుంచి 5 కిలోమీటర్లు అడవిలో జంతువుల్ని చూస్తూ ట్రెక్కింగ్ చేయాలి. అక్కడే అటవీశాఖ ఆధ్వర్యంలో వన భోజనం ఉంటుంది. ఆ తర్వాత లేక్‌ వ్యూ సఫారీతో లక్నవరం ఫెస్టివల్ ముగుస్తుంది.

సో... సెలవుల్లో ఎక్కడికి వెళ్లాలన్న సందేహం ఉంటే... లగేజీ సర్దుకొని ఛలో లక్నవరం.

ఇవి కూడా చదవండి:

లీకైన గూగుల్ ప్లస్ డేటా... ఇప్పుడు మీరేం చేయాలి?

వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?

Video: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్  ఆఫర్లివే...

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌కు మీరు రెడీనా?

రూ.99కే ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఇన్సూరెన్స్!

సేవింగ్స్ బ్యాంక్, పేమెంట్స్ బ్యాంక్... అకౌంట్లలో తేడాలేంటీ?

రూ.12,999 ధరకే రెడ్‌మీ నోట్ 5 ప్రో!

ఫేస్‌బుక్ క్లోన్ అయినట్టు మెసేజ్ వచ్చిందా?

ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్‌ప్రో ఎం1పై భారీ డిస్కౌంట్లు!

అక్టోబర్ 30న వన్‌ప్లస్ 6టీ లాంఛింగ్ ఈవెంట్: టికెట్ ధర రూ.999
First published: January 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు