11 నుంచి 17 వరకు లడఖ్ పోలో ఫెస్టివల్ 2018

లడఖ్... జమ్మూ కాశ్మీర్‌లోని పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్. ప్రకృతి అందాలు, స్వచ్ఛమైన వాతావరణానికి కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు అక్కడ మూడో వార్షిక లడఖ్ పోలో ఫెస్టివల్ జరుగుతోంది.

news18-telugu
Updated: July 9, 2018, 4:56 PM IST
11 నుంచి 17 వరకు లడఖ్ పోలో ఫెస్టివల్ 2018
లడఖ్... జమ్మూ కాశ్మీర్‌లోని పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్. ప్రకృతి అందాలు, స్వచ్ఛమైన వాతావరణానికి కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు అక్కడ మూడో వార్షిక లడఖ్ పోలో ఫెస్టివల్ జరుగుతోంది.
  • Share this:
మీరు లడఖ్ వెళ్లాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ప్లాన్ చేసుకోండి. జూలై 11 నుంచి 17 వరకు అక్కడి చుషోట్ గ్రామంలో మూడో వార్షిక లడఖ్ పోలో ఫెస్టివల్‌ జరగబోతోంది. బల్తిస్తాన్ యువరాణి లడఖ్ ప్రాంతంలో పోలోను పరిచయం చేశారు. అలా లడఖ్‌వాసుల సంస్కృతిలో పోలో ఓ భాగమైపోయింది.
Better way to understand the culture of Ladakh #ladakh #festival #ladakhpolo #polo #game #india #uthestory


A post shared by UtheStory (@uthestory) on


ప్రత్యేక సందర్భాలు, పెద్దపెద్ద పండుగల సమయంలో ఇక్కడ పోలో పోటీలు నిర్వహిస్తారు. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మరీ ఈ పోటీల్లో పాల్గొంటారు. సంప్రదాయ సంగీత వాయిద్యాలతో ఆటగాళ్లను ఉత్సాహపరుస్తుంటారు.ఇండస్ చుషోట్ పోలో క్లబ్ స్థానికులు నిర్వహిస్తుంటారు. వారి ఆధ్వర్యంలోనే లడఖ్ పోలో ఫెస్టివల్ జరుగుతోంది. లేహ్‌కు 18 కిలోమీటర్ల దూరంలో షాగరన్, చుషోట్ గ్రామాల్లో జరిగే పోలో ఫెస్టివల్‌కు వెళ్లడమంటే అక్కడ పర్యటించడం మాత్రమే కాదు... గొప్ప సంస్కృతి, సంప్రదాయాల్ని చూసిరావొచ్చు.స్థానిక యువత పోలో స్పోర్ట్‌లో రాణించేలా ప్రోత్సహించడంతో పాటు, ఈ గ్రామాన్ని టూరిస్ట్ డెస్టినేషన్‌గా మార్చడమే ఈ ఫెస్టివల్ ప్రయత్నం. పోలోతో పాటు రోజూ ఆర్చరీ కూడా చూడొచ్చు. దాంతో పాటు లడఖీ వంటకాలను రుచిచూస్తూ ఇక్కడి సంగీతాన్ని ఆస్వాదిస్తూ నృత్యాలను ఎంజాయ్ చేయొచ్చు. ఇక షాపింగ్ చేసేవాళ్లకు ఇది స్వర్గమే అని చెప్పాలి. చేత్తో తయారు చేసిన కార్పెట్స్, అల్లిన వస్త్రాలు, హస్త కళలు, ఇంట్లో తయారు చేసిన జామ్స్, జెల్లీస్ ఇలా చాలా ఉంటాయి ఎగ్జిబిషన్‌లో. ఇక అపి-అపో(అవ్వ-తాత) పేరుతో నిర్వహించే నాటకం మరో హైలైట్.


First published: July 9, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు