సరిగా నిద్ర పోవడం లేదా.. మీ సెక్స్ లైఫ్‌ డేంజర్‌లో పడ్డట్లే..

Sex Education | నిద్రలేమితో సెక్స్ లైఫ్ కూడా ప్రమాదంలో పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిద్ర సరిగా పట్టకపోయినా, నిద్రకు సమయపాలన లేకపోయినా సెక్స్ కోరికలు తగ్గిపోవడమే కాదు.. సెక్స్ మీద ఆసక్తి తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు.

news18-telugu
Updated: September 6, 2019, 1:28 PM IST
సరిగా నిద్ర పోవడం లేదా.. మీ సెక్స్ లైఫ్‌ డేంజర్‌లో పడ్డట్లే..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 6, 2019, 1:28 PM IST
పొద్దున్నుంచి రాత్రి వరకు.. బిజీ బిజీ. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో తీరిగ్గా ఊపిరి పీల్చుకుందామన్నా కష్టమే. ఇక నిద్ర విషయానికి వస్తే.. ఎప్పుడో అర్ధరాత్రి నిద్రపోయి, ఉదయం 5 గంటల కంటే ముందే లేచి సమాజంలో నిలదొక్కుకునేందుకు పరుగులు తీస్తున్నాం. అయితే, నిద్రలేమితో రక్తపోటు, అధిక బరువు, ఒత్తిడి, డిప్రెషన్ మాత్రమే కాకుండా మధుమేహం, గుండెపోటు, ఇతర హృద్రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. ఆ రోగాలు మాత్రమే కాదు.. నిద్రలేమితో సెక్స్ లైఫ్ కూడా ప్రమాదంలో పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిద్ర సరిగా పట్టకపోయినా, నిద్రకు సమయపాలన లేకపోయినా సెక్స్ కోరికలు తగ్గిపోవడమే కాదు.. సెక్స్ మీద ఆసక్తి తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. నిద్ర లేమి వల్ల పురుషుల్లో అంగస్తంభన సమస్యలు, ఎరౌజల్ సమస్యలు, మహిళల్లో స్కలన సమస్యలు తలెత్తుతాయని వివరించారు.

ప్రస్తుతం యువ జంటల్లో ఎక్కువగా ఈ సమస్య ఉంటోందని, సరైన సమయంలో నిద్రకు ఉపక్రమించకపోతే విపత్కర సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా పురుషుల్లో్ టెస్టోస్టిరాన్ స్థాయులు తగ్గిపోతాయని వెల్లడించారు. పురుషుల్లో మాదిరే మహిళలకు కూడా సహజ టెస్టోస్టిరాన్ అవసరమని.. ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు, అభిజ్ఞాశక్తికి, కండరాలు బలంగా మారేందుకు, కొత్త ఎర్ర రక్త కణాలు పుట్టడానికి ఆ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.

హాయిగా నిద్రపోవాలంటే..

కచ్చితంగా 7 నుంచి 9 గంటల నిద్ర ఉండాలని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ పేర్కొంది. వీకెండ్‌లోనూ నిద్రకు ఒకే సమయం కేటాయించాలని వైద్యులు సూచిస్తున్నారు.  • ఆల్కాహాల్‌కు దూరంగా ఉండాలి.

  • మధ్యాహ్నం 3 గంటలు దాటిన తర్వాత కెఫిన్ పదార్థాలు తీసుకోకూడదు.
  • Loading...
  • నిద్రకు రెండు గంటల ముందు వేడి నీళ్లతో స్నానం చేయాలి.

  • రోజూ నిద్ర పోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి.

  • నిద్రకు ముందు గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకొని తాగినా ఫలితం ఉంటుంది.

First published: September 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...