Health Tips : తక్కువగా నిద్రపోతున్నారా.. అయితే జాగ్రత్త..

ప్రతీకాత్మక చిత్రం

Health Tips | సరైన నిద్రలేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయని తెలిసిందే.. తాజాగా కోపం కూడా పెరుగుతుందని తేలింది.

  • Share this:
నిద్ర అనేది ప్రతి ప్రాణికి ఎంతో ముఖ్యం. గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో అలసిన శరీరానికి విశ్రాంతి కూడా అంతే అవసరం. ఎన్నో పనులతో అలసిన శరీరానికి నిద్ర తిరిగి నూతనోత్సాహం ఇస్తుంది. అయితే, నేడు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల కారణంగా మనిషి నిద్రకు దూరమవుతున్నాడు. ఈ కారణంగా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. అలసట, ఏకగ్రత లేకపోవడం, మతిమరుపు, ఊబకాయం ఎదురవుతున్నాయి. అంతేకాదు, ఎదుటివారిపై విపరీతమైన కోపం వస్తుందట.

సాధారణంగా నిద్రలేకపోతే ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి.. సాధ్యమైనంతవరకూ సరిపడా నిద్రపోవాలని.. అయితే అది కూడా సహజసిద్ధంగానే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సోషల్ మీడియాకు అడిక్ట్ అయి, ఏవేవో కారణాల చేతనో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్‌లో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకు ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిదని చెబుతున్నారు.

కాబట్టి.. ఏవేవో కారణాలు చెప్పి నిద్రని అలసత్వం చేయకండి..
First published: