సూట్, హైహీల్స్‌తోనే జాబ్‌కి రావాలని ఆర్డర్.. ‘కూటూ’ఉద్యమం మొదలుపెట్టిన మహిళలు..

ప్రతీకాత్మక చిత్రం

మనదగ్గర ‘మీటూ’ ఉద్యమంలానే.. జపాన్‌లో ఇప్పుడు ‘కూటూ’ ఉద్యమం కొనసాగుతోంది. మహిళా ఉద్యోగినులంతా ఏకమై తమ ఇబ్బందులను ఆన్‌లైన్‌లో షేర్ చేసుకుంటూ ఈ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

  • Share this:
‘మీటూ’ ఉద్యమం. భారత్‌లో లైంగిక వేధింపులకి గురైన మహిళలంతా ఏకమై తెరపైకి తీసుకొచ్చిన ఉద్యమం. దీని ద్వారా బడా వ్యక్తుల బాగోతాలన్ని బయటికొచ్చాయి. ఇప్పటికీ ఇక్కడ ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే జపాన్‌లోనూ ఇలాంటి ఉద్యమమే తెరపైకి వచ్చింది. ‘కూటూ’ అనే పేరుతో మొదలైన ఈ ఉద్యమం చాపకింద నీరులా పాకుతోంది. జపాన్ ప్రభుత్వం అక్కడి మహిళా ఉద్యోగినులకి సూట్, హైహీల్స్ తప్పనిసరి చేశారు. దీంతో.. మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైహీల్స్ వేసుకోవడం వల్ల కాళ్లల్లో రక్తసరఫరా సరిగ్గా కావడంలేదంటూ తమ బాధను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
జపాన్ మహిళా ఉద్యోగినులు లేవనెత్తిన ‘కూట్’ ఉద్యమానికి రోజురోజుకి మద్దతు పెరుగుతుంది. ఒక్కో మహిళను చూస్తూ మరో మహిళ బయటికొచ్చి తమ బాధలను పంచుకుంటున్నారు. పురుషులతో సమానంగా తాము పనిచేసినా..ఇలా వేర్వేరుగా చూడడం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ఉద్యమం అక్కడ ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. అసలు ‘కూటు’ అంటే అర్థమేంటంటే.. జపనీస్ భాషలో ‘కూట్స్’ అంటే బూట్లు అని అర్థం.. ఈ కారణంగానే తమ ఉద్యమానికి ‘కూటూ’అని పేరుపెట్టుకున్నారు మహిళలు.
First published: