హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Kombucha Tea: మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే కొత్త రకం డ్రింక్ ‘కొంబుచా టీ’.. దీని ప్రయోజనాలు ఇవే..!

Kombucha Tea: మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే కొత్త రకం డ్రింక్ ‘కొంబుచా టీ’.. దీని ప్రయోజనాలు ఇవే..!

Kombucha Tea

Kombucha Tea

Kombucha Tea: ఈ డ్రింక్‌ను మొదటగా ఏ దేశస్థులు తయారు చేశారో తెలియదు గానీ ఇప్పుడు మాత్రం దీన్ని ప్రపంచవ్యాప్తంగా చాలామంది రోజూ తాగుతున్నారు. కొంబుచా డ్రింక్ అందించే అద్భుతమైన ప్రయోజనాలకు ఇండియన్ సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పొద్దున్నే టీ (Tea) తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ రోజుల్లో సాధారణ టీ కంటే ఎక్కువ రుచి, ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) అందించే టీలకు ప్రజలు అలవాటు పడుతున్నారు. ఇలాంటి స్పెషల్ టీలలో కొంబుచా టీ (Kombucha tea) లేదా కొంబుచా డ్రింక్ ఒకటి. ఈ డ్రింక్‌ను మొదటగా ఏ దేశస్థులు తయారు చేశారో తెలియదు గానీ ఇప్పుడు మాత్రం దీన్ని ప్రపంచవ్యాప్తంగా చాలామంది రోజూ తాగుతున్నారు. కొంబుచా డ్రింక్ అందించే అద్భుతమైన ప్రయోజనాలకు ఇండియన్ సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. అందుకే, ఈ పులియబెట్టిన పానీయాన్ని తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొంబుచా అనేది ఎసిటిక్ యాసిడ్ బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, బ్లాక్ టీ, ఈస్ట్‌లతో తయారవుతుంది. ఈ రుచికరమైన ప్రోబయోటిక్ డ్రింక్‌ని తయారుచేసే ప్రక్రియను పులియబెట్టడం అని కూడా అంటారు. దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏవో చూద్దాం.


- టేస్టీ, రీఫ్రెషింగ్ డ్రింక్
కొంబుచాను నెమ్మదిగా పులియబెట్టేటప్పుడు, ద్రవంలో ఉండే వివిధ ఎంజైమ్‌లు చక్కెర, టీని 7-10 రోజుల వ్యవధిలో కాస్త పుల్లగా, కార్బోనేటేడ్‌గా, రిఫ్రెష్ డ్రింక్‌గా మారుస్తాయి.


- పేగుల ఆరోగ్యానికి మంచిది

కొంబుచాలో అనేక యాసిడ్స్‌, విటమిన్లు, కొన్ని హైడ్రోలైటిక్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలానే పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములను చంపేస్తాయి.



- అవయవాలను రక్షించే డ్రింక్

కొంబుచా ప్యాంక్రియాస్, కాలేయం, మూత్రపిండాలతో సహా వివిధ అవయవాలను రక్షించడంలో సహాయపడుతుందని 'అండర్‌స్టాండింగ్ కొంబుచా టీ ఫర్మెన్‌టేషన్‌: ఎ రివ్యూ' అనే ఓ అధ్యయనంలో తేలింది.


- బరువు తగ్గించడంలో..

కొంబుచా ఒక రుచికరమైన డ్రింక్ మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన డ్రింక్ కూడా. చురుకైన జీవనశైలి సాగించేవారు.. ఈ డ్రింక్ రోజూ సేవిస్తే కొన్ని అదనపు కిలోల బరువు తగ్గే అవకాశం ఉంది.


- కొలెస్ట్రాల్‌కు చెక్

'అండర్‌స్టాండింగ్ కొంబుచా టీ ఫర్మెన్‌టేషన్‌: ఎ రివ్యూ' అధ్యయనం ప్రకారం, కొంబుచా జీర్ణక్రియను చురుకుగా ఉంచుతూ అరుగుదల శక్తిని పెంచడంలో దోహద పడుతుంది. తద్వారా గుండె జబ్బులు దరి చేరవు. ఈ డ్రింక్ రోజూ తీసుకుంటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.


ఇది కూడా చదవండి : ఈ గ్రూపు రక్తం ఉన్నవారికి గుండెపోటు కచ్చితంగా వస్తుందట? కారణం ఏంటి..?


- మలబద్ధకం నుంచి ఉపశమనం

ఈ పానీయంలోని వివిధ అమైనో ఆమ్లాలు కడుపు pH స్థాయిలను సమతుల్యం చేస్తాయి. తద్వారా, మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది.


- యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ బెనిఫిట్స్

లాక్టోబాసిల్లస్ వంటి డ్రింక్‌లో ఉండే వివిధ బ్యాక్టీరియా కడుపు ఇన్ఫెక్షన్లు, వాపులను నివారిస్తుంది. అంతేకాదు, క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పోరాడే లక్షణాలు కొంబుచా టీలో ఉంటాయని ఒక పరిశోధనలో తేలింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Health care, Health Tips, Healthy food, Tea

ఉత్తమ కథలు