Sign language 2021: నేడు అంతర్జాతీయ సంజ్ఞ దినోత్సవం!

మనం మాట్లాడుకునే భాష బధిరులకు అర్థం కాదు. అయితే, వారికోసం ప్రత్యేకంగా గుర్తించి, అభివృద్ధి చేసిన భాషే సంజ్ఞ భాష. దీన్నే సైన్‌ లాంగ్వేజ్‌ అంటారు.

మనం మాట్లాడుకునే భాష బధిరులకు అర్థం కాదు. అయితే, వారికోసం ప్రత్యేకంగా గుర్తించి, అభివృద్ధి చేసిన భాషే సంజ్ఞ భాష. దీన్నే సైన్‌ లాంగ్వేజ్‌ అంటారు.

  • Share this:
మనం సాధారణంగా మాట్లాడుకోవడానికి ఒక లాంగ్వేజ్‌ ఉంటుంది. అయితే, బధిరులు (మూగ, చెవిటి వారికి) కూడా ఓ భాష ఉంది. అదే సైన్‌ లాంగ్వేజ్‌ sign language. దీని ప్రాముఖ్యతను మరింతగా పెంచడానికి ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 23న అంతర్జాతీయ సంజ్ఞ దినోత్సవంగా  International sign day నిర్వహిస్తున్నారు. చెవిటి వారి రోజువారీ సమస్యల పరిష్కారణే ధ్యేయంగా ఈ భాషను ఐక్యరాజ్యసమితి గుర్తించింది.

మొదటిసారి ఈ సంజ్ఙ భాషను 2018లో వారోత్సవాలతో ప్రారంభించారు. ప్రతి ఏడాది ప్రపంచ డెఫ్‌ సమాఖ్య ద్వారా ఒక థీమ్‌ ప్రతిపాదిస్తారు.దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెవిటివారి సమైఖ్యతతో ప్రారంభించారు. 2018 సెప్టెంబర్‌ 23న ‘ప్రతిఒక్కరూ సైన్‌ లాంగ్వేజ్‌లో భాగమయ్యారు’ With Sign Language, Everyone is Included! అనే నేపథ్యంతో ప్రారంభమైంది.

ఈ వారత్సవాల్లో భాగంగా సెప్టెంబర్‌ 24–30 మధ్య వేడుకలు నిర్వహించనున్నారు. ఇంటర్నేషనల్‌ డెఫ్‌ డే International deaf day ను మొదటిసారి 1958 సెప్టెంబర్‌లో ప్రారంభించారు.ఈ సంజ్ఞలతో మాట్లాడే భాష సహజ భాష కంటే భిన్నంగా ఉంటుంది. అంతర్జాతీయ సంకేత భాష దినోత్సవం సంజ్ఞ భాషల ఉపయోగానికి మద్ధతు ఇచ్చే సమావేశానికి ప్రోత్సహకంగా నిలుస్తోంది. చెవిటి వ్యక్తుల మానవహక్కుల కోసం సంకేత భాష ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి ఈ రోజును యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ United nation general assembly ప్రకటించింది.

బధిరుల ఎదుగుదలకు, అభివృద్ధికి సంకేత భాషలో నాణ్యమైన విద్యతోపాటు ఈ భాషకు సేవల కోసం ఈ రోజు ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు. భాషా, సాంస్కృతిక వైవిధ్యంలో భాగంగా సంజ్ఞ భాషలను సంరక్షించే ప్రాముఖ్యతను పెంచుతుంది.

ప్రపంచ బధిరుల సమాఖ్య 2021 థీమ్‌ theme ను ‘మేము మానవ హక్కుల కోసం సైన్‌ చేస్తున్నాం’“We Sign For Human Rights,”ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బధిరుల గుర్తింపును ప్రోత్సహించడానికి, మనమందరం ఎలా కలిసి పనిచేయాలో హైలైట్‌ చేయడానికి, జీవితంలో అన్ని రంగాల్లో సంజ్ఞ భాషలను ఉపయోగించడమే «మా హక్కు అని ప్రతిపాదించారు.
Published by:Renuka Godugu
First published: