హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Noble prize: నోబుల్‌ రచయితలను వరించని నోబెల్‌! కారణం ఇదే..

Noble prize: నోబుల్‌ రచయితలను వరించని నోబెల్‌! కారణం ఇదే..

ఏడు దశాబ్దలకు పైగా సాహిత్య కార్యాకలాపాల్లో 14 నవలలు.. లేక్కలేనన్ని వ్యాసాలు, డజన్ల కొద్ది కథలను రాశారు ఆర్‌కే నారాయణ్‌.

ఏడు దశాబ్దలకు పైగా సాహిత్య కార్యాకలాపాల్లో 14 నవలలు.. లేక్కలేనన్ని వ్యాసాలు, డజన్ల కొద్ది కథలను రాశారు ఆర్‌కే నారాయణ్‌.

Nobel prize winner 2021: 1994 రచించిన ప్యారడైజ్‌తో గుర్నాకు గుర్తింపు లభించింది. దీంతో పొస్ట్‌ కొలొనియల్‌ రచయితగా మంచి పేరు పొందారు.

అక్టోబర్‌ 7న టంజానియా ప్రముఖ రచయిత అబ్దుల్‌ రాజాక్‌ గుర్నా Abdul razak gurna కు 2021 కు సాహిత్యం విభాగంలో నోబెల్‌ బహుమతి Nobel prize ని అందుకున్నారు. వలసవాదం ప్రభావాలు, సంస్కృతులు, ఖండాల మధ్య గల్ఫ్‌ శరణార్ధి విధిలేక చొచ్చుకుపోతున్నారని ఆయన చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది. గుర్నా ఇటీవలె కెంట్‌ యూనివర్శిటీ పొస్టకొలొనియల్‌ లిటరేచర్‌ ప్రొఫెసర్‌గా రిటైరయ్యారు. అతను 10 నవలలు అనేక షార్ట్‌ స్టోరీస్‌ పబ్లిష్‌ అయ్యాయి. 1994 రచించిన ప్యారడైజ్‌తో గుర్తింపు లభించింది.దీంతో గుర్నాకు పొస్ట్‌ కొలొనియల్‌ రచయితగా మంచి పేరు పొందారు. అయితే, దీనిపై అనేక మంది ఇతర రచయితలు కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష కృషి చేశారు. కానీ, వారికి నేటికి నొబెల్‌ వరించలేదు. వారేవరో తెలుసుకుందాం.

హెచ్‌జీ. వెల్స్‌..

ఈయన పాలిటిక్స్, సోషల్‌ కామెన్‌టరీస్‌కు చెందిన అనేక పుస్తకాలు, టెక్ట్స్‌బుక్స్‌ రాశారు.ది ఫాదర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఫిక్షన్‌గా పేరు పొందారు. వెల్స్‌ ఆదర్శప్రాయమైన రచనలను రాసాడు. విమానాలు, అంతరిక్ష ప్రయాణం, అణ్వయుధాలు, ఉపగ్రహ టెలివిజన్, వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ ఆగమనాన్ని ముందే ఊహించిన మేధావి. ఈ జాన్‌క్లూట్‌ వెల్స్‌ ఇప్పటి వరకు చూడని అత్యంత ముఖ్యమైన రచయిత అని వెల్స్‌ను అభివర్ణించాడు. ఎన్నో విజయాలు సాధించినప్పటికీ నొబెల్‌ను మాత్రం దక్కించుకోలేకపోయారు. 1921,1932,1935,1946 లలో నొబెల్‌కు నామినేట్‌ అయ్యారు.

  ఇది కూడా చదవండి: ఈజీగా ఇలా బిలియనీర్‌ అవ్వొచ్చు .. అది మీ చేతుల్లోనే ఉంది!


సల్మాన్‌ రష్దీ..

ఈ 21వ శతాబ్దపు ప్రపంచ డైనమిక్, తెలివైన రచయిత సల్మాన్‌ రష్దీ Salmon Rushdie . రాయల్‌ సొసైటీ ఆఫ్‌ లిటరేచర్‌కు చెందిన ఫెలో. అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ లెటర్స్‌కు ఎన్నికయ్యారు. టైమ్స్‌ 1945 నుంచి 50 మంది గొప్ప బ్రిటిష్‌ రచయితల జాబితాలో 13వ స్థానం పొందారు. యూరోపియన్‌ యూనియన్‌ సాహిత్యానికి అర్టిజియన్‌ ప్రైజ్, ప్రీమియో గ్రిన్సేన్‌ కావూర్‌ (ఇటలీ), జర్మన్‌లో రైటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు, అత్యున్నత గౌరవాలతో సహా అనేక ప్రశంసలు అందుకున్నారు. ఈయనకు నోబెల్‌ ప్రైజ్‌ మినహా దాదాపు అన్ని బహుమతులు అందకున్న గొప్ప రచయిత.

హరూకి మురాకమి..

Haruki murakai.. ఈయన బెస్ట్‌ నవల 1987లో పబ్లిష్‌ అయిన నార్వేజియన్‌ ఉడ్‌. 2007లో ఒక ప్రముఖ బెట్టింగ్‌ సైట్‌ ఆయన్ను అగ్ర రచయితల పోటీదారుల్లో ఒకరిగా నిలబెట్టింది. ఆయన నొబెల్‌ వరించలేదు. అప్పటి నుంచి ఈ యన పేరు కూడా నొబెల్‌ ఆశావాహుల జాబితాలో స్థిరపడింది.

చినువా అచేబే ..

Chinua achebe చినువా 2013లో మరణించారు. ఆఫ్రికన్‌ సాహిత్యంలో అత్యంత ఆధిపత్యం కలిగిన వ్యక్తి. మొదటి నవల థింగ్స్‌ ఫాల్‌ ఎపార్ట్‌. ఇది ఆఫ్రికాను విస్తృతంగా అద్యయనం చేసి రచించారు.ఆఫ్రికన్‌ సాహిత్యానికి మార్గదర్శకుడు. అయినా అచేబే ఎన్నడూ నోబెల్‌ బహుమతికి నామినేట్‌ కాలేకపోయారు. 2013లో అచేబేను నొబెల్‌ ఎందుకు తిరస్కరించింది అని న్యూ ఆఫ్రికన్‌ రీడ్‌లో దీనికి సంబంధించిన కారణాలను కామెంట్‌ చేశారు.

  ఇది కూడా చదవండి:  బిర్యానీ ఎక్కువగా వండుకుంటే.. మిగిలింది ఇలా చేయండి!


డీహెచ్‌ లారెన్స్‌...

ఆంగ్ల రచయిత, కవి డీహెచ్‌ లారెన్స్‌ రచనలు ఆధునిక, పారిశ్రామికీకరణ అమానవీయ ప్రభావలపై విస్తరించిన ప్రతిబింబాలు. దురదృష్టవశాత్తు మరణించే సమయంలో అశ్లీల రచయితగా అతడికి ప్రజల్లో ఖ్యాతి ఉంది. ఏదేమైనా మా తరానికి చెందిన గొప్ప ఊహాత్మక నవలా రచయితగా ఈఎం ఫోర్స్‌స్టర్‌ అభివర్ణించింది.దీన్ని సవాలు చేశారు లారెన్స్‌. ఈయన సాహిత్య ఖ్యాతిని అత్యంత ప్రభావవంతమైన న్యాయవాది కేంబ్రిడ్జ్‌ విమర్శకుడు ఎఫ్‌ఆర్‌ లివిస్‌ లారెన్స్‌ను ఇంగ్లిష్‌ ఫిక్షన్‌ సంప్రదాయానికి తనవంతు సహకారం అందించారని పేర్కొన్నారు.

ఆర్‌కే నారాయణ్‌..

ఏడు దశాబ్దలకు పైగా సాహిత్య కార్యాకలాపాల్లో 14 నవలలు.. లేక్కలేనన్ని వ్యాసాలు, డజన్ల కొద్ది కథలను రాశారు ఆర్‌కే నారాయణ్‌. అతడే ఆధునిక భారత రచనను ప్రపంచపటంలో ఉంచాడు. ఈయన సల్మాన్‌ రష్దీకి రెండు తరాల ముందే భారత్‌లోని అనేక స్థానిక భాషల్లో ప్రపంచ ప్రఖ్యాత రచనలను రాయడం ప్రారంభించారు. ఆయన స్నేహితుడైన గ్రా హం గ్రీన్‌ ఆర్‌కే నారాయణ్‌ ఒక భారతీయుడు ఎలా ఉంటాడో నాకు తెలుసుక అతనికి ధన్యవాదాలు అని ఒసారి రాశారు. ఈయనే కాదు ప్రముఖ బ్రిటీష్‌ రచయిత అయితే జెఫ్రీ అర్చర్‌ కూడా నారాయణ్‌ నోబెల్‌ ప్రైజ్‌కు అర్హమైన రచనలు అన్ని భావించారు. నారాయణ్‌ నవలలు అద్భుతం ఒక చిన్న గ్రామంలో జీవించే వ్యక్తి కథను అద్భుతంగా తీర్చిదిద్దారని అర్చర్‌ 2019లో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

గ్రాహం గ్రీన్స్‌..

2018లోని కొన్ని నివేదికల ప్రకారం గ్రాహం గ్రీన్‌ 1967లో అతడి నవలలు నోబెల్‌ రేస్‌లో గట్టిపోటీనిచ్చేవని ఆసక్తికర విషయాలు తెలిసాయి. ఒకసారి నోబెల్‌ బహుమతి ప్రదానం చేస్తే తిరిగి 50 ఏళ్ల తర్వాత మాత్రమే నోబెల్‌ బహుమతి నామినేషన్లు బహిరంగంగా ప్రకటిస్తారు. గ్రీన్‌కు కమిటీ చైర్మన్‌ ఆండర్స్‌ ఓస్టర్లింగ్‌ మద్దతు ఉంది. నిష్ణాతుడైన పరిశీలకుడు..బాహ్య వాతావరణాలపై ప్రపంచ వైవిధ్యాన్ని కలిగి ఉన్న వ్యక్తి అని అభివర్ణించాడు.

రాబర్ట్‌ ఫ్రాస్ట్‌..

రాబర్ట్‌ ఫ్రాస్ట్‌ 20వ శతాబ్దపు కవిగా విస్తృతంగా పరిగణించారు. ఈయన నాలుగు సార్లు పులిట్జర్‌ బహుమతి గెలుచుకున్నారు. 1936లో నోబెల్‌ బహుమతి గెలుచుకున్న ఓనీల్‌తో రచయిత వయస్సు జ్యూరీ నిర్ణయించడం ఒక పెద్ద అడ్డంకిగా మరిందని నోబెల్‌ కమిటీ విచారం వ్యక్తం చే సిన ఘటనను గుర్తు చేసుకున్నారు.

First published:

Tags: Nobel Prize

ఉత్తమ కథలు