ఈ జ్యూసులు తాగితే.. శృంగారంలో మీకు తిరుగుండదు

ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని పరిశోధనలు తేల్చాయి. వీటితో పాటూ కొన్ని జ్యూస్లను తరచుగా తీసుకోవడం వల్ల లైంగిక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

news18-telugu
Updated: November 12, 2020, 3:17 PM IST
ఈ జ్యూసులు తాగితే.. శృంగారంలో మీకు తిరుగుండదు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వయసుతో పాటు శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. సాధారణంగా వయసు పెరుగుతున్నా కొద్దీ లైంగిక సామర్థ్యం కూడా తగ్గుతుంది. కొంతమందిలో అంగస్తంభన సమస్యలు ఎదురుకావచ్చు. మహిళలు కూడా కొన్ని రకాల సమస్యల బారిన పడే అవకాశం ఉంది. వాటిలో యోని మార్గం పొడిబారడం ప్రధాన సమస్య. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనంత మాత్రాన లైంగిక శక్తి ముగింపు దశకు చేరుకుందని భావించాల్సిన అవసరం లేదు.

ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని పరిశోధనలు తేల్చాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, అన్ని రకాల పోషకాలుండే సమతులాహారం తీసుకోవడం వంటివి లైంగిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. వీటితో పాటూ కొన్ని జ్యూస్లను తరచుగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. లైంగిక శక్తిని పెంచే పానీయాలు...

1. కలబంద రసం
కలబంద రసానికి టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచే శక్తి ఉందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. ఇది పురుషుల్లో ఉండే సెక్స్ హార్మోన్(primary male sex hormone). కలబంద రసం తాగడం వల్ల లైంగిక శక్తి పెరుగుతుంది. ఇది అంగ స్తంభన సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది.

2. దానిమ్మ రసం
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దానిమ్మ రసానికి అంగస్తంభన సామర్థ్యాన్ని మెరుగుపరిచే శక్తి ఉందని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దానిమ్మ రసం గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఒక అధ్యయనం వెల్లడించింది.

3. పాలు

ఆరోగ్యకరమైన లైంగిక జీవితానికి పాలు సహాయపడుతాయి. అందుకే పెళ్లయిన తరువాత మొదటి రాత్రి పడక గదిలో పాలు తప్పనిసరిగా పెడతారు. పాలలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. అందువల్ల రోజూ రాత్రి ఒక గ్లాసు పాలు తీసుకుంటే లైంగిక పటుత్వం పెరుగుతుంది.

4. బనానా షేక్
అరటి పండులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది లైంగిక శక్తిని ప్రభావితం చేస్తుంది. అరటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజూ బనానా షేక్ తాగడం అలవాటు చేసుకుంటే లైంగిక ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులో విటమిన్లు, పోషకాలు తక్షణ శక్తిని అందిస్తాయి. అవసరమైతే అరటి మిల్క్షేక్ కూడా తాగవచ్చు.

5. పుచ్చకాయ రసం
పుచ్చకాయ గుజ్జులో ఎల్-సిట్రులైన్ అనే అమైనో యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. దీనికి పురుషుల్లో అంగస్తంభనను బలోపేతం చేసే శక్తి ఉంటుంది. పుచ్చకాయ రసం తీసుకున్న తరువాత ఎల్-సిట్రులైన్ శరీరంలో ఎల్-అర్జినిన్గా మారుతుంది. ఈ సమ్మేళనం నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో అంగస్తంభన రేటు ఎక్కువగా ఉంటుంది.
Published by: Kishore Akkaladevi
First published: November 12, 2020, 3:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading