Home /News /life-style /

KNOW THESE 6 IMPORTANT FACTS ABOUT MENSTRUATION NS GH

Menstruation: రుతుచక్రం క్రమం తప్పడానికి కారణాలేంటి? అపోహలు వీడి ఈ వాస్తవాలు తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంతకు ముందుతో పోలిస్తే, పీరియడ్స్ గురించి, పరిశుభ్రత గురించి అవగాహన పెరిగింది. కానీ రుతుచక్రానికి సంబంధించిన కొన్ని అంశాలపై మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. మెన్‌స్ట్రువల్ సైకిల్‌ గురించి, శరీరంలో చోటుచేసుకునే మార్పుల గురించి పూర్తి అవగాహన ఉండాలి.

ఇంకా చదవండి ...
వయసుతో పాటు మహిళల శరీరాల్లో చోటుచేసుకునే మార్పుల గురించి ఇప్పటికీ ఎన్నో అపోహలను నమ్మేవారు ఉన్నారు. ఇంతకు ముందుతో పోలిస్తే, పీరియడ్స్ గురించి, పరిశుభ్రత గురించి అవగాహన పెరిగింది. కానీ రుతుచక్రానికి సంబంధించిన కొన్ని అంశాలపై మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. మెన్‌స్ట్రువల్ సైకిల్‌ గురించి, శరీరంలో చోటుచేసుకునే మార్పుల గురించి పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే జీవితాంతం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మరికొన్ని శారీరక సమస్యలను నివారించుకోవచ్చు. రుతుచక్రం, రక్తస్రావం, పీరియడ్స్‌తో కలిగే శారీరక, మానసిక సమస్యలపై వాస్తవాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆరు రకాల పీరియడ్స్ పై అపోహలను ఎక్కువ మంది నమ్ముతున్నారని సర్వేల్లో తెలిసింది. వీటికి సంబంధించిన వాస్తవాలు తెలుసుకోండి.

మెన్‌స్ట్రువల్ సైకిల్ అందరిలోనూ 28 రోజులుగా ఉంటుందా?
సాధారణంగా మెన్‌స్ట్రువల్ సైకిల్ సగటు గడువు 28 రోజులుగా ఉంటుంది. కానీ అందరు మహిళల్లో పీరియడ్స్ కచ్చితంగా 28 రోజులకు వస్తాయని అనుకోకూడదు. రుతుచక్రం అనేది ఆడవాళ్ల వయస్సు, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. 21 రోజుల నుంచి 35 రోజుల వరకు ఎప్పుడైనా పీరియడ్స్ రావచ్చు. అందువల్ల సగటు మెన్‌స్ట్రువల్ సైకిల్ గడువును 28 రోజులుగా చెబుతారు. ఇంతకంటే తక్కువ లేదా గడువు ఉండే రుతుచక్రం అనారోగ్యాలకు కారణమని భావించాల్సిన అవసరం లేదు.

అండోత్సర్గం
సాధారణంగా అండోత్సర్గమైన 14 రోజుల తరువాత పీరియడ్స్ వస్తాయి. పీరియడ్స్ రావడం పూర్తిగా అండం అభివృద్ధి కావడం పైనే ఆధారపడి ఉంటుంది. కానీ మెన్‌స్ట్రువల్ సైకిల్ మొదటి భాగం ఏడు నుంచి 20రోజుల వరకు ఉంటుంది. ఒకవేళ 14వ రోజున అండోత్సర్గం అయితే, అంతకు 14 రోజుల తరువాత.. అంటే 28వ రోజున పీరియడ్స్ వస్తాయి. కానీ 10వ రోజునే అండోత్సర్గం అయితే, 24వ రోజునే పీరియడ్స్ వస్తాయి.

బరువులో హెచ్చుతగ్గులు
శరీరం ఈస్ట్రోజన్, ఇతర హార్మోన్లను విడుదల చేయడానికి, వీటిని నిల్వ చేసుకోవడానికి కొంత మొత్తంలో కొవ్వు అవసరం. ఈ హార్లోన్ల వల్లనే పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి. అందువల్ల ఉన్నట్టుండి బరువు తగ్గడం లేదా బరువు పెరగడం వల్ల పీరియడ్స్ క్రమం తప్పే అవకాశం ఉంది. శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండే మహిళల్లో రుతుచక్రం క్రమం తప్పే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. వీరిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి కావడమే ఇందుకు కారణం.

ఒత్తిడి, ఇతర అనారోగ్యాలు
ఒత్తిడి వల్ల రుతుచక్రం క్రమం తప్పే అవకాశం ఉంది. శారీరక, మానసిక ఒత్తిడి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వల్ల ఆలస్యంగా లేదా త్వరగా పీరియడ్స్ రావచ్చు. ఒత్తిడి, ఆందోళన వల్ల పీరియడ్స్ క్రమం తప్పడం, థైరాయిడ్ సమస్యలు, ఫ్లూ వంటి అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

గర్భనిరోధక మాత్రలు
గర్భనిరోధక మాత్రలు పీరియడ్స్‌ను క్రమబద్దీకరించడానికి సహాయపడతాయని కొన్ని సర్వేల్లో తేలింది. వీటివల్ల రుతుచక్రానికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. కానీ మహిళల ఆరోగ్యాన్ని బట్టి, ఇతర సమస్యలు లేవని నిర్ధారించుకున్న తరువాతే వీటిని వాడాల్సి ఉంటుంది. ఇందుకు గైనకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి. సొంతంగా హార్మోన్ సప్లిమెంట్లు, పిల్స్‌ను వాడకూడదు.

అధిక రక్తస్రావం అనారోగ్యానికి సంకేతం
మెన్‌స్ట్రువల్ సైకిల్‌లో అసాధారణ రక్తస్రావం క్యాన్సర్, పాలిప్స్, మెనోపాజ్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతంగా చెప్పవచ్చు. ఈ సమస్యను ఎదుర్కొనేవారు వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, అధిక రక్తస్రావానికి గల కారణాలను అన్వేషించాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Health care, Women health

తదుపరి వార్తలు