Iron Deficiency: ఐరన్ లోపం ఉంటే ఏం జరుగుతోంది ? నివారించే మార్గాలేంటి..?

Iron Deficiency Symptoms: అలసట, తలనొప్పి, మైకం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె దడ, జుట్టు రాలడం లాంటి లక్షణాలు ఉంటాయి.

news18-telugu
Updated: September 19, 2020, 7:57 PM IST
Iron Deficiency: ఐరన్ లోపం ఉంటే ఏం జరుగుతోంది ? నివారించే మార్గాలేంటి..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మానవ శరీరంలో ఎన్నో ఎంజైమ్లు, రసాయానాలు సమాహారం. ప్రతి అవయవానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలు లభిస్తేనే సక్రమంగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్ మానవస శరీరానికి ఉపయోగపడే ఖనిజాల్లో అతి ముఖ్యమైంది. ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉన్నప్పుడు ఇనుము ఎంతో ఉపయోగపడతుంది. హీమోగ్లోబిన్ తయారీ, ఎర్రరక్తకణాలకు ప్రోటీన్ ను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హీమోగ్లోబిన్ స్థాయి తగ్గినట్లయితే మానవ కండరాలకు, అవయవాలకు తగిన ఆక్సిజన్ అందక అంత ప్రభావవంతగా పనిచేయవు. ఐరన్ డిఫెషియన్సీ రక్తహీనత కలిగే తీవ్ర అనారోగ్యం కలిగే ప్రమాదముంది.

ఈ నేపథ్యంలో ఇటీవలే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారటీ(ఎఫ్ఎస్ఎస్ఏఐ).. ఐరన్ లోపాన్ని(ఐరన్ డిఫెషియన్సీ) నిరోధించేందుకు కొన్ని కీలక సూచనలు చేసింది. పోషన్ మా 2020లో భాగంగా ఐరన్ డిఫెషియన్సీపై పోరుకు ముందడుగు వేసింది. ఐరన్ లోపం వల్ల రుతుస్రావం, గర్భం, తక్కువ బాల్యం లాంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది.

ఐరన్ లోపం నిరోధించేందుకు చిట్కాలు..
1.ఇనుము సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినాలి.
2.భోజనం చేసిన తర్వాత టీ, కాఫీలను సేవించడం మానుకోవాలి.
3.ఐరన్ అధికంగా దొరికే పండ్లు, కూరగాయలను పుష్కలంగా తినాలి.
4.ఐరన్ ఎక్కువ గ్రహించేందుకు విటమిన్-సీ సమృద్ధిగా దొరికే ఆహారాన్ని తీసుకోవాలి.ఐరన్ లోపం లక్షణాలు
ఐరన్ లోపం లక్షణాలను ముందుగానే అందుకోవడానికి గతంలో కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ కొన్ని సూచనలు చేసారు. అలసట, తలనొప్పి, మైకం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, గుండే దడ, జుట్టు రాలడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి బియ్యం, గోధుమలు, డబుల్ పోర్టీఫైడ్ సాల్ట్, బలవర్ధకమైన ఆహారాన్ని తినడం ద్వారా ఐరన్ డిఫెషియన్సీని అరికట్టవచ్చు అని ఆయన సలహా ఇచ్చారు.

ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు
రెడ్ క్రాస్ బ్లడ్ ఆహారాన్ని రెండు రకాలుగా విభజించింది. హీమ్ ఐరన్, నాన్ హీమ్ ఐరన్ రెండు రకాలు విభజించింది. హీమ్ ఐరన్ అంటే మాంసం, చేపలు, గుడ్లల్లో లభిస్తుంది. ఇది శరీరానికి చాలా సులభంగా అందుతుంది. నాన్ హీమ్ ఐరన్ అంటే పండ్లు, కూరగాయలు, మొక్క ఆధారిత ఆహారాల్లో ఇది లభిస్తుంది. అయితే ఇవి తీసుకుంటే ఐరన్ 2 నుంచి 10 శాతం మాత్రమే లభ్యమవుతుంది. విటమిన్ సీ అధికంగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకుంటే నాన్ హీమ్ ఐరన్ ను ఎక్కువగా గ్రహిస్తాయి.
Published by: Kishore Akkaladevi
First published: September 19, 2020, 7:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading