శీతాకాలంలో చక్కెర వాడకాన్ని తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. దీని స్థానంలో బెల్లాన్ని ఆహార పదార్థాల తయారీలో వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉండటంతో పాటు, ఈ కాలంలో ఎదురయ్యే వ్యాధులు, అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు. శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి బెల్లం టీ దోహదం చేస్తుంది. కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బెల్లం టీని తరచుగా తసుకోవడం మంచిది.
బెల్లం టీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
మూడు నుంచి నాలుగు టేబుల్ స్ఫూన్ల తురిమిన బెల్లం, ఒక టీస్పూన్ తేయాకు, కాస్త ఏలకుల పొడి, టీస్పూన్ సోంపు (ఆసక్తి ఉంటేనే), రెండు కప్పుల పాలు, ఒక కప్పు మంచి నీరు, అర టీస్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత అల్లం సిద్ధం చేసుకోవాలి.
తయారు చేసే విధానం
టీ పాన్‌లో ఒక కప్పు నీరు తీసుకొని వేడి చేయాలి. ఏలకుల పొడి, సోంపు, నల్ల మిరియాల పొడి, అల్లం, తేయాకులను వేడి నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. కాసేపటి తరువాత దాంట్లో పాలు పోసి బాగా మరిగించాలి. అనంతరం దాంట్లో బెల్లం వేసి కరిగే వరకు కలపాలి. ఆ తరువాత పొయ్యి ఆపేసి, బెల్లం టీని వడకట్టుకొని తాగవచ్చు. బెల్లం వేసిన తరువాత టీని ఎక్కువ సమయం మరగనివ్వకూడదు. పాలు కలపడం వల్ల టీ విరిగిపోయే అవకాశం ఉంది.
బెల్లం టీ ఉపయోగాలు
* చక్కెరలకు దూరంగా ఉండవచ్చు
ఆహార పదార్థాల్లో చక్కెరకు బదులుగా బెల్లం తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. బెల్లం తినడం ఇష్టం లేనివారు దాంతో టీ చేసుకొని తాగవచ్చు. శీతాకాలంలో చక్కెర తక్కువగా తీసుకుంటే అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు.
* జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది
బెల్లం టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఛాతీలో మంట వంటివి రావు. బెల్లంలో చాలా తక్కువ మొత్తంలో కృత్రిమ చక్కెరలు ఉంటాయి. చక్కెరతో పోలిస్తే, బెల్లంలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి అనారోగ్యాలను దూరం చేస్తాయి.
* మైగ్రేన్ కు దూరంగా
మైగ్రేన్, దీర్ఘకాలిక తలనొప్పితో బాధపడేవారు ఆవు పాలలో బెల్లం కలిపి తాగితే ఉపశమనం ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా బెల్లం టీ తీసుకోవాలి.
* ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది
శరీరంలో రక్తం, ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నవారు బెల్లం తినడం లేదా బెల్లం టీ తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. దీంట్లో ఎక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది. శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ను అందించడానికి ఐరన్ తోడ్పడుతుంది.
త్వరలోనే తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యే జోస్యం
టీఆర్ఎస్‌కు మాత్రమే కాదు.. ఆ నేతకు కూడా ‘హుజూరాబాద్’ పెద్ద దెబ్బ.. ఇమేజ్‌కు డ్యామేజ్ ?
* పరిమితంగా తీసుకోవాలి
బెల్లాన్ని పరిమితంగా తీసుకోవడమే మంచిది. అవసరానికి మించి దీన్ని తీసుకుంటే లేనిపోని అనారోగ్యాలు ఎదురవుతాయి. బెల్లం అధిక వినియోగం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి ముక్కు నుంచి రక్తస్రావం కావచ్చు. కొన్నిసార్లు జీర్ణవ్యవస్థలో సమస్యలు ఏర్పడవచ్చు. అందువల్ల పరిమితంగానే బెల్లం టీ తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.