Dengue alert: కొవిడ్‌.. డెంగీ మధ్య తేడాను ఇలా గుర్తించవచ్చు!

దోమల ద్వారా వ్యాపించే D2 వేరియంట్‌ ప్రత్యేకమైంది. DENV variant  తేలికపాటి ఫ్లూ వచ్చి అనారోగ్యానికి దారితీస్తుండగా.. D2 వేరియంట్లు తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనికి సకాలంలో చికిత్స అందించకపోతే మరణానికి దారితీస్తుంది. దీనివల్ల డెంగీ షాక్‌ సిండ్రోమ్‌ లేదా డెంగీ హిమోరేజిక్‌ ఫీవర్‌ వస్తుంది.

ఇప్పటికే 11 రాష్ట్రాల్లో డెంగీ కొత్త వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. కేరళ, తెలంగాణ, మహరాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఒడిశా ఎక్కువ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత నెలన్నర నుంచి కేసులు పెరుగుతున్నాయి. దీనికి మారుతున్న వాతావరణం కారణం. వర్షాకాలంలో డెంగీ కేసులు నమోదు అవ్వడం సాధారణం.

 • Share this:
  ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడుప్పుడే కరోనా Covid 19 నమోదు తగ్గితుంది. కొవిడ్‌ టీకా vaccine కూడా ముమ్మరం చేశారు. కానీ, మరి కొన్ని వ్యాధులు విజృంభిస్తూనే ఉన్నాయి. గతంలో కూడా డెంగీ కేసులు నమోదు అయినా.. నియంత్రణలో ఉండేది. కానీ, ప్రస్తుతం డెంగీ కొత్త వేరియంట్లు Dengue variants పుట్టుకొస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొవిడ్‌ డెల్టా వేరియంట్‌ భయం కూడా తగ్గలేదు. డెంగీ కొత్త వేరియంట్లు భయాందోళనకు గురిచేస్తోంది. ఇది దాదాపు 11 రాష్ట్రాల్లో నమోదయినాయని, వాతావరణ మార్పులే దీనికి ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ఇక మరో విషయం ఏంటంటే వచ్చింది డెంగీ కొత్త వేరియంటా లేదా కొవిడ్‌ వైరసా అని గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతోంది.

  కొత్త వేరియంట్‌ లక్షణాలు..
  ఈ ఏడాది డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అధికారుల నివేదికల ప్రకారం డెంగీ వైరస్‌ నాలుగు సెరోటైప్‌లలో ఉంటుంది. అంటే DENV–2 , D2 అనే స్ట్రెయిన్‌ ప్రస్తుతం విజృంభిస్తోంది. ఈ కేసులు పెరగడంతోపాటు ప్రాణనష్టానికి దారితీస్తుంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ కూడా ఈ వేరియంట్‌తో కాస్త జాగ్రత్తగా ఉండాలని అన్నారు. పశ్చిమ యూపీలో కూడా కొన్ని మిస్టీరియస్‌ కేసులు నమోదయ్యాయని అన్నారు.

  DENV వేరియంట్‌ ఎందుకు విజృంభిస్తుండంటే ఇప్పటికే కేసుల తీవ్రత పెరగడం. యూపీ, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా పిల్లలు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పిటికే మరణాలు కూడా నమోదయ్యాయి.

  ఇది సోకిన తర్వాత నాలుగు దశల్లోకి మారుతుంది. D1, D2, D3, D4.
  దీని లక్షణాలు కొవిడ్‌ 19 లాగానే ఉంటుంది. ఇక డెంగీ గురించి ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటంటే.. డెంగీ వచ్చిన వారికి మళ్లీ సోకే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
  కరోనా వైరస్‌ మాదిరి ఇది కూడా వేగంగా వ్యాపిస్తుంది. వైరస్‌ సోకిన వారిని దోమ కుట్టడం ద్వారా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతాయి. శ్వాస వల్ల ఇది సోకదు.

   పిల్లలకి డెంగీ ఫివర్‌ను ఎలా గుర్తించాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు!


  ఇప్పుడు కరోనా సమయం కాబట్టి ఇది కాస్త ఆందోళన చెందాల్సిన విషయమే. డెంగీ లక్షణాలను తేలిగ్గా తీసుకోకూడదు. ఈ రెండింటికి ఒకే లక్షణాలు ఉంటాయి. వీటిని వేరుగా చెప్పడం కష్టమే. కొద్దిపాటి తేడా ఉండవచ్చు.. కాని శ్రద్ధ చూపడం ముఖ్యం.

  1. డెంగీ ఇన్ఫెక్షన్‌ వల్ల తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కీళ్లు, కండరాల నొప్పులు, వికారం, వాంతులు, విరేచనాలు వంటి జీర్ణాశయాంతర లక్షణాలు ఉంటాయి.

  2. కరోనా లక్షణాలు అయిన.. జ్వరం, చలి, దగ్గు, జలుబు, గొంతునొప్పి, మైయాల్జియా.. డెంగీ, మలేరియా కూడా అయి ఉండవచ్చు.


  కొన్ని బేధాలు ఇలా ఉన్నాయి...

  • వాసన, రుచి కోల్పోవడం, ఇతర శ్వాసకోశ వ్యాధి లక్షణాలు కొవిడ్‌లో మాత్రమే ఉంటాయి. డెంగీకి ఉండవు.

  • డెంగీ శ్వాస తగ్గడం, ఛాతి నొప్పి లేదా శ్వాస సంబంధిత సమస్యలు సాధారణంగా ఉండవు.

  • డెంగీ తరచూ తలనొప్పి లేదా బలహీనత ఉంటుంది. కొవిడ్‌ బారిన పడితే ఈ లక్షణాలు ఉండకపోవచ్చు.

  Published by:Renuka Godugu
  First published: