హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Cancer: క్యాన్సర్‌కు అలా చెక్ పెట్టొచ్చు.. తాజా అధ్యయనంలో వెల్లడి

Cancer: క్యాన్సర్‌కు అలా చెక్ పెట్టొచ్చు.. తాజా అధ్యయనంలో వెల్లడి

క్యాన్సర్ కణం (ప్రతీకాత్మక చిత్రం )

క్యాన్సర్ కణం (ప్రతీకాత్మక చిత్రం )

Cancer Control Measures: క్యాన్సర్ కణాలను చంపడంలో ప్రత్యేకమైన తెల్లరక్త కణాలు రోగ నిరోధక వ్యవస్థకు చెందిన సైటోటాక్సిక్ టీ కణాలు వ్యాయామానికి ఎలా స్పందిస్తాయో పరిశీలించడం ద్వారా పరిశోధకులు ఈ పరికల్పనను విస్తరించారు.

Know how to control cancer growth in body through exercise ak gh

Cancer: క్యాన్సర్‌కు అలా చెక్ పెట్టొచ్చు.. తాజా అధ్యయనంలో వెల్లడి

క్యాన్సర్‌కు పూర్తిస్థాయిలో నివారించడం కష్టమే. చివరి దశకు చేరినప్పుడు క్యాన్సర్‌కు చికిత్స అందించలేం. అయితే రోజూ వ్యాయామం చేయడం వల్ల క్యాన్సర్‌ను అరికట్టే వీలుందని తాజా పరిశోధనల్లో తేలింది. వ్యాయామంచేయని వారితో పోలిస్తే శారీరక శ్రమించే వారిలో మెరుగుదల కనిపించదని శాస్త్రజ్ఞులు తెలిపారు. ఈ పరిశోధన ఈ-లైఫ్ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. స్వీడన్‌లోని కారోలిన్సాక్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు క్యాన్సర్ పెరుగుదలకు సంబంధించి ఎలుకల్లో ఈ పరిశోధన చేశారు. ఫలితంగా వాటిలో వ్యాయామం వల్ల క్యాన్సర్ పెరుగుదల మందగించిందని తేలింది.

శారీరక శ్రమ రోగ నిరోధక వ్యవస్థకు చెందిన సైటోటాక్సిక్ టీ కణాల జీవక్రియను మారుస్తుంది. అంతేకాకుండా తద్వారా క్యాన్సర్ కణాలపై దాడి చేసే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ విషయాన్ని కారోలిన్సాక్ వర్సిటీ సెల్, మాలిక్యూలర్ బయాలజీ విభాగం అధ్యాపకులు రాండల్ జాన్సన్ తెలియజేశారు. వ్యాయమం వల్ల కలిగే సానుకూల ప్రభావాల నూతన అంతరాలను అందిస్తుందని, అలాగే క్యాన్సర్ కు వ్యతిరేకంగా చికిత్సలను రూపొందించడం, మెరుగుపరడచంలో సహాయపడుతుందని ఆయన అన్నారు.

శారీరక శ్రమ ఆరోగ్య పరిస్థితి నివారించడంతో పాటు వివిధ రకాల క్యాన్సర్లతో సహా అనేక వ్యాధుల రోగ నిరూపణను మెరుగుపరుస్తుందని పరిశోధనలో తేలింది. వ్యాయామం క్యాన్సర్ కు వ్యతిరేకంగా ఎలాంటి రక్షణ ప్రభావాలను చూపుతుందో కచ్చితంగా తెలియనప్పటికీ జీవసంబంధ విధానాల విషయానికొస్తే శారీరక శ్రమ రోగనిరోధక శక్తిని సక్రియం చేస్తుంది. తద్వారా క్యాన్సర్ పెరుగుదలను నిరోధించే శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది.

ఎలుకలపై ప్రయోగం..

ఈ అధ్యయనంలో క్యాన్సర్ కణాలను చంపడంలో ప్రత్యేకమైన తెల్లరక్త కణాలు రోగ నిరోధక వ్యవస్థకు చెందిన సైటోటాక్సిక్ టీ కణాలు వ్యాయామానికి ఎలా స్పందిస్తాయో పరిశీలించడం ద్వారా పరిశోధకులు ఈ పరికల్పనను విస్తరించారు. పరిశోధన కోసం వారు ఎలుకలను రెండు గ్రూపులుగా విభజించారు. ఓ ఎలుక గ్రూపును క్రమం తప్పకుండా స్పిన్నింగ్ వీల్ పై వ్యాయామం చేయనివ్వగా.. మరో గ్రూపును క్రియా రహితంగా ఉంచారు. అయితే ఈ రెండింటిలో శిక్షణ లేని వాటితో పోలిస్తే శిక్షణ ఉన్న పొందిన వాటిలో క్యాన్సర్ పెరుగుదల మందగించినట్లు కనుగొన్నారు. అంతేకాకుండా మరణాలు కూడా తగ్గాయని తేలింది.

అనంతరం పరిశోధకులు శిక్షణ పొందిన, లేని ఎలుకల్లో టీ కణాలను తొలిగించే ప్రతినిరోధకాలను ఇంజెక్ట్ చేసి సైటోటాక్సిక్ టీ కణాల ప్రాముఖ్యతను పరిశీలించారు. క్యాన్సర్ పెరుగుదల, మనుగడను వ్యాయామం వల్ల కలిగే సానుకూల ప్రభావాన్ని ప్రతినిరోధకాలు అడ్డుకున్నాయి పరిశోధకుల ప్రకారం వ్యాయామం.. ప్రేరిత క్యాన్సర్ ను అణచివేయడానికి ఈ టీ కణాల ప్రాముఖ్యతను చూపిచినట్లు తెలిపారు.

జీవక్రియలో మార్పు..

వ్యాయామం క్యాన్సర్ పెరుగుదలను ఎలా ప్రభావితం చేసిందో పరిశీలించడానికి పరిశోధకులు శిక్షణా సెషన్ల తర్వాత టీ కణాలు, రక్తం, కణజాల నమూనాలను వేరుచేశారు.అనంతరం వ్యాయామం సమయంలో కండరాలలో ఉత్పత్తి చేయబడిన మరియు అధిక స్థాయిలో ప్లాస్మాలో విసర్జించే సాధారణ జీవక్రియల స్థాయిలను కొలుస్తారు. లాక్టేట్ వంటి ఈ జీవక్రియల్లో కొన్ని టీ కణాల జీవక్రియను మార్చి వాటి కార్యకలాపాలను పెంచాయి. వ్యాయామం చేసిన ఎలుకల నుంచి వేరుచేసిన టీ కణాలు విశ్రాంతి స్థితిలోఉన్న వాటి నుంచి తీసిన టి కణాలతో పోలిస్తే జీవక్రియలో మార్పు చూపించాయని పరిశోధకులు కనుగొన్నారు.

మానవులపై ప్రయోగం..

అదనంగా మానవులలో వ్యాయామానికి ప్రతిస్పందనగా ఈ జీవక్రియలు ఎలా మారుతాయో పరిశోధకులు పరిశీలించారు. వారు 30 నిమిషాల పాటు తీవ్రమైన సైక్లింగ్ చేసిన ఎనిమిది మంది ఆరోగ్యకరమైన పురుషుల నుండి రక్త నమూనాలను తీసుకున్నారు. అదే శిక్షణ-ప్రేరిత జీవక్రియలు మానవులలోనూ విడుదలవుతున్నాయని గమనించారు.

“వ్యాయామం క్యాన్సర్‌తో పోరాటంలో రోగనిరోధక కణాలను సక్రియం చేసే అనేక అణువులు, జీవక్రియల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని తద్వారా క్యాన్సర్ పెరుగుదలను నిరోధిస్తుందని తమ పరిశోధన చూపిస్తుంది" ఔషధ విభాగంలో సీనియర్ పరిశోధకుడు హెలెన్ రుండ్క్విస్ట్ చెప్పారు. ఈ ఫలితాలు మన జీవనశైలి మన రోగనిరోధక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై లోతైన అవగాహనకు దోహదం చేస్తుందని, క్యాన్సర్‌కు వ్యతిరేకంగా కొత్త రోగనిరోధక చికిత్సల అభివృద్ధికి తెలియజేయవచ్చని మేము ఆశిస్తున్నామని హెలెన్ అన్నారు.

First published:

Tags: Cancer

ఉత్తమ కథలు