కొలెస్ట్రాల్ అనేది శరీరంలోని కాలేయం తయారు చేసే కొవ్వు పదార్థం. ఇది కొన్ని ఆహారాల నుంచి కూడా లభిస్తుంది. మన శరీరం సరిగ్గా పని చేయడానికి కొంత కొలెస్ట్రాల్ అవసరం. వైద్యపరంగా దీన్ని కొన్ని వర్గాలుగా విభజించవచ్చు. ప్రధానంగా మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్‌గా వర్గీకరిస్తారు. వీటిలో తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) లేదా చెడు కొలెస్ట్రాల్ అనేది గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నివేదిక ప్రకారం, అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
* పెద్దలలో కొలెస్ట్రాల్
ఒక వ్యక్తి శరీరంలోని మొత్తం కొలెస్ట్రాల్ స్థాయి (Total cholesterol level) అంటే.. వారి రక్తంలో ఉండే మొత్తం కొలెస్ట్రాల్. అంటే ఇది తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లు (LDL), అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లు (HDL), ట్రైగ్లిజరైడ్స్ (Triglyceride) వంటి మూడు రకాల కొవ్వుల సమ్మేళనంగా చెప్పుకోవచ్చు.
LDLను చెడు కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది రక్త నాళాల్లో పేరుకుపోయి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. HDLను మంచి కొలెస్ట్రాల్ అంటారు. ఎందుకంటే ఇది గుండె జబ్బుల నుంచి వ్యక్తులను రక్షిస్తుంది. మన శరీరంలో HDL ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అయితే మొత్తం కొలెస్ట్రాల్‌లో ట్రైగ్లిజరైడ్ కౌంట్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయే మరో రకమైన కొవ్వు. దీన్ని కొలెస్ట్రాల్ "బిల్డింగ్ బ్లాక్స్" అంటారు. మన శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయి ఎక్కువగా, HDL లెవల్ తక్కువగా ఉంటే.. ఈ పరిస్థితి గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.
20 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి.. ప్రతి వ్యక్తి కనీసం 4- 6 సంవత్సరాలకు ఒకసారి కొలెస్ట్రాల్ లెవల్‌ను చెక్ చేయించుకోవాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది. ఎందుకంటే ఈ వయసు నుంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం ప్రారంభించవచ్చు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. మహిళల కంటే పురుషులకు అధిక కొలెస్ట్రాల్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే మెనోపాజ్‌లోకి ప్రవేశించిన తర్వాత మహిళలకు ఈ ప్రమాదం పెరుగుతుంది. మధుమేహం, కార్డియాక్ ప్రమాద కారకాలు ఉన్నవారికి మరింత తరచుగా కొలెస్ట్రాల్ టెస్టులు అవసరమవుతాయని వైద్యులు చెబుతున్నారు.
* పెద్దలకు కొలెస్ట్రాల్ చార్ట్
బ్లడ్ కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్పై అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ (JACC) జర్నల్‌లో ప్రచురితమైన 2018 నాటి మార్గదర్శకాలు.. పెద్దలకు నిర్ధిష్ట పరిమితిలో కొలెస్ట్రాల్‌ను సిఫార్సు చేశాయి. మొత్తం కొలెస్ట్రాల్ లెవల్‌ను ఆమోదయోగ్యమైనవి (Acceptable), బోర్డర్ లైన్ (Borderline), అధిక కొలతలుగా (High measurements) వర్గీకరించారు. ఈ విలువలు mg/dL (డెసిలీటర్కు మిల్లీగ్రాములు)లో ఉంటాయి. ఇవి ఫాస్టింగ్ మెజర్మెంట్స్పై ఆధారపడి ఉంటాయి. పెద్దల కొలెస్ట్రాల్ లెవల్‌ను సూచించే చార్టును పరిశీలిద్దాం.
మొత్తం కొలెస్ట్రాల్
HDL కొలెస్ట్రాల్
LDL కొలెస్ట్రాల్
ట్రైగ్లిజరైడ్స్
మంచి స్థాయి
200 కంటే తక్కువ
60 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. (పురుషులకు 40 లేదా అంతకంటే ఎక్కువ, స్త్రీలకు 50 లేదా అంతకంటే ఎక్కువ ఆమోదయోగ్యం)
100 కంటే తక్కువ ఉండాలి. కరోనరీ ఆర్టరీ వ్యాధి ఉంటే 70 కంటే తక్కువ ఉండాలి.
149 కంటే తక్కువ ఉండాలి. (ఐడియల్ లిమిట్ 100 కంటే తక్కువ)
బోర్డర్ లైన్ లిమిట్
200–239
n/a
130–159
150–199
అధిక స్థాయి
240 లేదా అంతకంటే ఎక్కువ
60 లేదా అంతకంటే ఎక్కువ
160 లేదా అంతకంటే ఎక్కువ; 190 దాటితే చాలా ఎక్కువగా పరిగణిస్తారు
200 లేదా అంతకంటే ఎక్కువ. 500 దాటితే చాలా ఎక్కువగా పరిగణిస్తారు
తక్కువ స్థాయి
n/a
పురుషులకు 40 కంటే తక్కువ, స్త్రీలకు 50 కంటే తక్కువ
n/a
n/a
* పురుషులు vs స్త్రీలలో కొలెస్ట్రాల్ స్థాయిలు
సాధారణంగా 20 ఏళ్లు పైబడిన పురుషులు, స్త్రీలకు మార్గదర్శకాలు ఒకే విధంగా ఉంటాయి. అయితే HDL కొలెస్ట్రాల్ విషయానికి వస్తే అవి భిన్నంగా ఉంటాయి. మహిళల్లో హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉండటం మంచిది.
* పిల్లల్లో కొలెస్ట్రాల్
శారీరకంగా చురుగ్గా ఉండే పిల్లలు, పోషకాహారం ఎక్కువగా తీసుకునేవారు, అధిక బరువు లేనివారు, కుటుంబంలో అధిక కొలెస్ట్రాల్ చరిత్ర లేనివారికి అధిక కొలెస్ట్రాల్ ఉండే ప్రమాదం తక్కువ. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం.. పిల్లలందరికీ 9 నుంచి 11 సంవత్సరాల మధ్య కొలెస్ట్రాల్ స్థాయిని తనిఖీ చేయాలి. ఆ తర్వాత మళ్లీ 17 నుంచి 21 సంవత్సరాల మధ్య ఒకసారి చెక్ చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. కుటుంబంలో ఎవరికైనా మధుమేహం, ఊబకాయం లేదా అధిక కొలెస్ట్రాల్ వంటి ప్రమాద కారకాలు ఉన్న పిల్లలకు.. 2 నుంచి 8 సంవత్సరాల మధ్య మొదటిసారి, మళ్లీ 12 నుంచి 16 సంవత్సరాల మధ్య ఒకసారి కొలెస్ట్రాల్ లెవల్స్ చెక్ చేయాలి.
Heart Diseases: గుండె విషయంలో అజాగ్రత్త వద్దు.. ఆ జబ్బులకు చెక్ పెట్టే మార్గాలు ఇవే..
* పిల్లలకు కొలెస్ట్రాల్ చార్ట్
అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ (JACC) ప్రకారం, పిల్లలకు సిఫార్సు చేసిన కొలెస్ట్రాల్ స్థాయిలు ఈ కింది చార్ట్‌లో పరిశీలిద్దాం. అన్ని విలువలు mg/dLలో ఉన్నాయి.
మొత్తం కొలెస్ట్రాల్
HDL కొలెస్ట్రాల్
LDL కొలెస్ట్రాల్
ట్రైగ్లిజరైడ్స్
మంచి స్థాయి
170 లేదా అంతకంటే తక్కువ
45 కంటే ఎక్కువ
110 కంటే తక్కువ
0–9 ఏళ్ల పిల్లల్లో 75 కంటే తక్కువ; 10-19 ఏళ్ల పిల్లల్లో 90 కంటే తక్కువ
బోర్డర్ లైన్ లిమిట్
170–199
40-45
110–129
0-9 ఏళ్ల పిల్లల్లో 75-99; 10-19 ఏళ్ల పిల్లల్లో 90-129
అధిక స్థాయి
200 లేదా అంతకంటే ఎక్కువ
n/a
130 లేదా అంతకంటే ఎక్కువ
0–9 ఏళ్ల పిల్లల్లో 100 లేదా అంతకంటే ఎక్కువ; 10-19 ఏళ్ల పిల్లల్లో 130 లేదా అంతకంటే ఎక్కువ
తక్కువ స్థాయి
n/a
40 కంటే తక్కువ
n/a
n/a
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cholesterol