• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • KNOW DIFFERENCE BETWEEN COW MILK AND BUFFALO MILK AND HEALTH BENEFITS AK GH

Cow milk vs Buffalo milk: ఆవు, గేదె పాల మధ్య తేడా ఏంటి?.. ఏ పాలు ఆరోగ్యానికి మంచివి?

Cow milk vs Buffalo milk: ఆవు, గేదె పాల మధ్య తేడా ఏంటి?.. ఏ పాలు ఆరోగ్యానికి మంచివి?

ప్రతీకాత్మక చిత్రం

Cow milk vs Buffalo milk: ఆవు పాలు, గేదె పాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. వీటి పోషకాల్లో కూడా కొన్ని తేడాలుంటాయి.

  • Share this:
పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే రోజూ పిల్లలతో పాటు పెద్దలు కనీసం ఓ గ్లాసు పాలు తాగాలని డాక్టర్లు సలహాలిస్తుంటారు. పాలలో విటమిన్ డి, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా చేస్తాయి. అంతేకాక, పాలలోని ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, మినరల్స్ కొవ్వులు మీకు ఆరోగ్యాన్ని చేకూర్చుతాయి. మార్కెట్లో ఆవు పాలు, గేదె పాలు విరివిగా లభిస్తాయి. సాధారణంగా మన రోజూవారి జీవితంలో ఈ రెండు రకాల పాలలో ఏదో ఒకటి వినియోగిస్తుంటాం. ఆవు పాలు, గేదె పాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. వీటి పోషకాల్లో కూడా కొన్ని తేడాలుంటాయి. అయితే, ఈ రెండు పాలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. మరి, ఆవు, గేదె పాల మధ్య ఉండే వ్యత్యాసాలను తెలుసుకుందాం.

పాల రంగు
గేదె పాలు తెలుపు, చిక్కటి క్రీము రంగులో ఉంటాయి. గేదె పాలలోని బీటా కెరోటిన్ విటమిన్ ఎ గా మారి శరీరానికి శక్తినిస్తుంది. ఇక, ఆవు పాల విషయానికి వస్తే.. ఈ పాలు పసుపు-, తెలుపు రంగుల కలయికలో ఉంటాయి.

కొవ్వు శాతం
ఆవు పాల కంటే గేదె పాలు చిక్కగా ఉంటాయి. గేదె పాలలో కొవ్వు అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. గేదె పాలలో 7-8 శాతం కొవ్వు ఉంటుంది. అయితే ఆవుపాలలో 3-4 శాతం మాత్రమే కొవ్వు ఉంటుంది.

నిల్వ సమయం
ఆవు, గేదె పాల మధ్య మరో వ్యత్యాసం ఆయా పాల నిల్వ సామర్థ్యం. ఆవు పాలను తప్పనిసరిగా ఒకటి లేదా రెండు రోజులలోపు తీసుకోవాలి. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అయితే, ఆవు పాలతో పోలిస్తే గేదె పాలు కొద్దిగా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

కొలెస్ట్రాల్
ఆవు పాలతో పోల్చితే గేదె పాలలో తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. అందువల్ల, ఊబకాయం, రక్తపోటు, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు ఆవు పాలకు బదులుగా గేదె పాలను తీసుకోవడం మంచిదని డాక్టర్లు సలహాలిస్తున్నారు. కాగా, ఆవు, గేదె పాల మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఈ రెండూ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అంతేకాక, అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే, ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలనే విషయం పూర్తిగా మీ వ్యక్తిగత ప్రాధాన్యత, అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
Published by:Kishore Akkaladevi
First published:

అగ్ర కథనాలు