‘మనం తినే ఆహారమే మనం’ అన్న నానుడి విన్నారా? దీనిని తన గుండెల్లో బాగా ముద్రించుకున్న అవయవం ఒకటి మీ శరీరంలో ఉంది, అది గుండె కాదండి, మీ కాలేయం. కాలేయం శరీరంలో నుండి వ్యర్థాలను తీసివేయడం, విటమిన్లు అలాగే మినరల్‌లను నిల్వ చేయడం, జీర్ణక్రియలో సహాయం చేయడం వంటి 500 ముఖ్య శరీర క్రియలను చేస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, ప్రతీ అయిదుగురు భారతీయులలో ఒకరు కాలేయ సమస్యలకు గురి అయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా, ప్రతీ సంవత్సరం భారతదేశంలో దాదాపు 10 లక్షల మంది లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్నారని కూడా ఈ గణాంకాలు చెప్తున్నాయి. భారతదేశంలో మరణాలకు దారి తీసే వాటిలో కాలేయ వ్యాధి పదవ స్థానంలో ఉంది.
మీ కాలేయానికి సరైన పోషకాహారం ఏమిటో తెలుసుకోవడం చాలా కీలకం. జాగ్రత్తలు పాటిస్తూ, సమస్య రాకుండా నివారించడం చాలా మంచిది. కాలేయాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు ఇవి.
శారీరక శ్రమ తక్కువ ఉండటం లేదా అస్సలు లేకపోవడం, దీనితో పాటు ప్రాసెస్ చేసిన ఆహారం/ఫాస్ట్ ఫుడ్ కారణం కాలేయంపై నిరంతరం ఒత్తిడి ఉంటుంది. అంటే, మన శరీరం నుండి విషపదార్థాలను వడగడ్డే పనిని పెంచుతూ, కాలేయంపై పని ఒత్తిడి పెంచుతున్నాం. ఇలా అధికంగా పని చేయడం దీర్ఘకాలంలో ప్రమాదకరంగా మారుతుంది. అందుకే, జీర్ణకోశ వ్యవస్థకు ఏర్పడే అనేక సమస్యలను అధిగమించడానికి, మీ కాలేయాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
కాలేయ వ్యాధి లక్షణాలు ఒకేలా ఉండవు. అత్యంత సాధారణ లక్షణాలలో వికారం, వాంతులు అవ్వడం, కుడి పక్కన పై భాగంలో కడుపు నొప్పి, నీరసంతో కూడిన కామేర్లు, దురద, బలహీనత, బరువు తగ్గడం.
కాలేయ వ్యాధి తీవ్రత పెరిగినప్పుడు సిర్రోసిస్‌కు దారి తీస్తుంది. వ్యాధి ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు, కానీ తీవ్రత పెరిగే కొద్దీ నీరసం, చర్మంపై దురదలు, అయోమయంగా అనిపించడం మరియు బద్దకంగా ఉండటం జరుగుతాయి.
కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడానికి, సమతుల్య ఆహారం, బరువులు ఎత్తడం/ట్రైనింగ్ వంటి కండరాల క్షీణతను నివారించే వ్యాయామాలు చేయడం చెయ్యాలి. కాలేయ వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ కండరాలను తయారు చేసే సామర్థ్యం తగ్గుతూ పోతుంది, అందుకే వీలైనంత త్వరగా దీనిని గుర్తించి సరైన చర్య తీసుకోవడం కీలకం. (4)
అలాగే ఆహరం ఇంకా జీవన శైలి అలవాట్లను సరైనవి చూసుకోవడం, మద్యం సేవించడం అలాగే పొగాకు దూరంగా ఉండటం కీలకం.
కాలేయ సమస్యలను నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలలో మొదటి ఆరోగ్యవంతమైన జీవనశైలి వైపు అడుగులు వేయడం.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, చురుకైన జీవనం, మద్యంపానం నియంత్రించడం, పొగాకు మానేయడం అవసరం. మీ ఆహారంలో పీచు పదార్ధాలు ఎక్కువగాను, కొవ్వు పదార్ధాలు తక్కువగాను ఉండాలి. (3)
మీ వయస్సు మరియు జెండర్ ఆధారంగా మీరు సరైన శరీర బరువు ఉండేలా చూసుకోవాలి. హెపటైటిస్ లేదా వైరల్ ఇన్‌ఫెక్షన్ వంటి కాలేయ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవాలి. అలాగే, సరైన ఆహారం, వ్యాయామంతో అవసరం అయితే మందులతో మీ మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేలా చూసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health Tips