Home /News /life-style /

KITCHEN TIPS ONIONS CAN STORE IN FRIDGE IN SUMMER AND ITS EFFECT PAH

Kitchen tips: కట్ చేసిన ఉల్లిపాయలను సమ్మర్ లో ఫ్రిడ్జ్ లో పెట్టోచ్చా..?

ఆనియన్స్

ఆనియన్స్

Onions: మనలో చాలా మంది తమ వంటలలో ఉల్లిపాయలను అధికంగా ఉపయోగిస్తారు. ఉల్లిపాయలు అన్ని కాలాల్లోను లభిస్తాయి. అందుకే వీటికి గిరాకీ ఎక్కువ. ఇవి నెలల తరబడి నిల్వ ఉండటం వలన వీటిని ఎక్కువగా కొనుగొలు చేస్తారు.

ఉల్లిపాయలను (Onions) దాదాపు ప్రతి ఒక్క వంటకాలలో ఉపయోగిస్తారు. అందుకే వీటిని పెద్ద మొత్తంలో నిల్వఉంచుకొనేందుకు వీలుగా కొనుగోలు చేస్తుంటారు. ఒక్కొసారి ఉల్లిపాయలకు మొలకల వస్తుంటాయి. వీటికి గాలి ఎక్కువగా తాకేలా చూడాలి. దీంతో ఇవి తొందరగా మొలకెత్తవు. అదే విధంగా ఉల్లిపాయలను.. ప్రత్యేకమైన పేపర్లు, వెదురుతో తయారు చేసిన బ్యాగులో నిల్వఉంచటం వలన వీటిని ఎక్కువ కాలం నిల్వచేయవచ్చు. నేషనల్ ఆనియన్ అసోసియేషన్ (ఎన్ వోఏ) ప్రకారం.. ఉల్లిపాయలను సెల్లార్ లు, బేస్ మెంట్ లు, గ్యారెజ్ లో పెట్టడం వలన ఎక్కువ కాలం నిల్వచేసుకొవచ్చు.

వీటిని తేమ తగలకుండా చూడాలి. దీంతో ఇవి మొలకెత్తుతాయి. కొన్ని సార్లు కుళ్లిపోతుంటాయి. ఉల్లిపాయలను 40–50°F (4–10°C) వద్ద నిల్వ ఉంచడం అనువైనదని కొన్ని అధ్యయనాలలో కనుగొనబడింది. ఈ ఉష్ణోగ్రతల వద్ద, వారు తమ లక్షణాలను ఉత్తమంగా నిర్వహిస్తారు. ఉల్లిపాయలను ఎట్టి పరిస్థితులలోనే పాలిథీన్ కవర్ లలో ఉంచకూడదు. గాలి తగిలేలా చూసుకొవాలి.

అదే విధంగా, వెలుతూరు సోకేలా చూడాలి. ఫ్రిజ్ లో (Fridge) ఉల్లిపాయలను పెడితే.. అవి తేమను గ్రహించి తొందరగా మెత్తగా మారిపోతాయి. దీంతో తొందరగా పాడవుతాయి. అయితే, ఒలిచిన ఉల్లిపాయలు.. ఫ్రిడ్జ్ లో పెడితే.. వాటికి ఏం కాదు. అవి ఎక్కువ కాలం నిల్వఉంటాయి. ఈ ముక్కలు 7 నుంచి 10 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. కొన్ని సార్లు.. ఉల్లిపాయలు.. షాలోట్ ఫ్రీజర్లలలో (Kitchen) ఆరునెలల వరకు నిల్వచేయవచ్చు. కొన్ని సార్లు... ఉల్లిపాయలను ముక్కలను, చేసి మూడు నుంచి ఆరునెలల వరకు ఫ్రీజర్ లో ర్యాప్ చేసి ఉంచవచ్చు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Kitchen tips, Onion, Summer

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు