KITCHEN TIPS IS YOUR SALT IS SAFE OR ADULTERATED FIND OUT WITH THIS SIMPLE TEST GH SK
Salt Adulteration: మీరు వాడుతున్న ఉప్పు మంచిదేనా? లేదంటే కల్తీదా? ఇలా గుర్తించండి
ప్రతీకాత్మక చిత్రం
Salt Adulteration: అయోడైజ్డ్ ఉప్పును వివిధ రకాలుగా కల్తీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో సాధారణ ఉప్పు కలిపి కల్తీ చేస్తున్నారు. దీని వల్ల వినియోగదారులకు తగినంత అయోడిన్ అందక, అనారోగ్యాల ప్రమాదం పెరుగుతుంది. మరి కల్తీ ఉప్పును ఎలా గుర్తించాలి.
ఇంట్లో ఏది లేకున్నా.. ఉప్పు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. భారత వంటకాల్లో తప్పనిసరిగా ఉండే పదార్థం ఉప్పు. వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. అసలు ఉప్పు లేని వంటే ఉండదంటే అతిశయోక్తి కాదు. వంటకాలకు ఉప్పు మంచి రుచిని తీసుకొస్తుంది. ఇది పడకపోతే.. ఎంతటి ఖరీదైన ఆహార పదార్థాలైనా చప్పగా ఉంటాయి. మన అస్సం తినలేం. కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యపరంగా మన శరీరానికి ఉప్పు ఎంతో అవసరం. మెదడు, శరీర అవయవాల పనితీరును మెరుగుపరచడానికి, శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి అయోడిన్ తోడ్పడుతుంది. ఇది మనకు చాలా తక్కువ మొత్తంలోనే అవసరం అవుతుంది. అయితే తగినంత మోతాదులో అందనప్పుడు అయోడిన్ లోపంతో ఇతర అనారోగ్యాలు ఎదురవుతాయి. అందువల్ల అయోడిన్ లోపాన్ని నివారించేందుకు అయోడైజ్డ్ ఉప్పును వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అయోడిన్ లోపానికి చెక్ పెట్టేందులు ప్రజలు వినియోగించే ఉప్పులో అయోడిన్‌ను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ కంట్రోల్ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఇందులో భాగంగా వివిధ రకాల తినదగిన ఉప్పులో అయోడిన్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. ఆహార కల్తీ చట్టం ప్రకారం తయారీ స్థాయిలో ఉప్పులో అయోడిన్ 30 పీపీఎమ్ కంటే తక్కువ ఉండకూడదు. వినియోగదారుల స్థాయిలో 15 పీపీఎమ్ కంటే తక్కువగా ఉండకూడదు. అయితే తయారీ కంపెనీలు ఈ ప్రమాణాలను పాటించట్లేదు.
అయోడైజ్డ్ ఉప్పును వివిధ రకాలుగా కల్తీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో సాధారణ ఉప్పు కలిపి కల్తీ చేస్తున్నారు. దీని వల్ల వినియోగదారులకు తగినంత అయోడిన్ అందక, అనారోగ్యాల ప్రమాదం పెరుగుతుంది. అయితే అయోడైజ్డ్ ఉప్పు కల్తీని సులభంగా గుర్తించవచ్చని చెబుతోంది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI). అయోడైజ్డ్ ఉప్పులో సాధారణ ఉప్పు కలిపి చేస్తున్న కల్తీని గుర్తించే మార్గాలను ఈ సంస్థ వెల్లడించింది. దీనిపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను FSSAI సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయోడిన్ ఉప్పు కల్తీని ఎలా గుర్తించాలంటే..
ముందు ఒక బంగాళాదుంపను తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకోండి. కత్తిరించిన వైపు దుంప ముక్కలపై కొంచెం ఉప్పు వేయండి. ఒక నిమిషం తరువాత, ఆ బంగాళాదుంప ముక్కలపై రెండు చుక్కల నిమ్మరసం వేయండి. బంగాళాదుంప రంగు మారకపోతే, మీరు వాడే అయోడైజ్డ్ ఉప్పు కల్తీ కాలేదని గుర్తించాలి. ఒకవేళ మీరు వాడేది కల్తీ అయోడైజ్డ్ ఉప్పు అయితే, బంగాళాదుంప నీలం రంగులోకి మారుతుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.