మీ జీవితాన్ని సులభతరం చేసే కిచెన్ చిట్కాలు

వంట అన్నది ప్రతీ ఇంట్లో సర్వసాధారణం.  చక్కని భోజనం సిద్ధం చేసేందుకు చాలా సమయమే పడుతుంది. మీ సమయాన్ని ఆదా చేసే సులభమైన, ప్రభావవంతమైన కిచెన్ ఐడియాలను ఈ ఆర్టికల్ మీకందిస్తుంది.

news18-telugu
Updated: August 21, 2019, 12:54 PM IST
మీ జీవితాన్ని సులభతరం చేసే కిచెన్ చిట్కాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వంట అన్నది ప్రతీ ఇంట్లో సర్వసాధారణం.  చక్కని భోజనం సిద్ధం చేసేందుకు చాలా సమయమే పడుతుంది. మీ సమయాన్ని ఆదా చేసే సులభమైన, ప్రభావవంతమైన కిచెన్ ఐడియాలను ఈ ఆర్టికల్ మీకందిస్తుంది.

చెర్రీ టమాటలన్నీ ఒకసారే కోయండి

మీరు కోసుకోవాలనుకుంటున్న చెర్రీ టమాటలన్నీ ఒక ప్లేటులో పెట్టుకోండి. దానిపై మరో ప్లేట్ పెట్టండి. ఆ ప్లేటును గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు కత్తి పట్టుకొని టమాటలన్నీ కోసేయండి. ఆ రెండు ప్లేట్లు కూడా ప్లాస్టిక్ వి అయితే మంచిది.

రకరకాల ఆకారాలు, సైజుల్లో పాన్ కేక్స్

పాన్ కేక్స్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ. వాటికి మీరు కొత్తదనం ఇవ్వాలనుకుంటే స్టీల్ కుకీ మౌల్డ్స్  తీసుకొని వాటిని ప్యాన్ పై పెట్టి వాటి ఆకారానికి తగినట్టుగా బ్యాటర్ పోయండి.  ఇలా చేయడం ద్వారా మీరు రకరకాల ఆకారాల్లో పాన్ కేక్స్ చేయవచ్చు. అవి కచ్చితంగా పిల్లలు, పెద్దలను ఆకట్టుకునేలా ఉంటాయి.

వెన్నను సులభంగా కరిగించడం

ఒక చిన్న గ్లాసు తీసుకొని దాన్ని కాసేపు వేడి చేయండి. కొద్దిగా వెచ్చబడితే చాలు. ఇప్పుడా ఆ గ్లాసును వెన్నపై బోర్లించండి. వెన్న కరుగుతుంది. అయితే అది పూర్తిగా కరగదు,  బ్రెడ్ మీద రాసేందుకు అనువైన టెక్చర్ తో ఉంటుంది.

సులభంగా గుడ్డు పెంకు తీయడం

గుడ్డు పగులగొట్టినప్పుడు అందులో పెంకు ఉంటే చిరాగ్గా అనిపిస్తుంది. కాని వాటిని సులభంగా తీసేయవచ్చు. చేతులు తడి చేసుకొని పెంకు తీసేందుకు ప్రయత్నించండి. మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

ఇవి కూడా చదవండి..

కిచెన్ ఈజీగా క్లీన్ చేయాలంటే ఇలా చేయండి..
First published: August 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading