కిచెన్‌లో మీరు పట్టించుకోని ప్రాంతాలను ఇలా శుభ్రం చేయండి..

కిచెన్ లో  అసలు పట్టించుకోని  ప్రదేశాల్లో దుమ్ము పేరుకుపోవడం లేదా కీటకాలు చేరడం వంటివి జరుగుతుంటాయి. అలాంటి ప్రదేశాలపై కూడా శ్రద్ధ పెడుతూ   ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 21, 2019, 12:49 PM IST
కిచెన్‌లో మీరు పట్టించుకోని ప్రాంతాలను ఇలా శుభ్రం చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కిచెన్ లో  అసలు పట్టించుకోని  ప్రదేశాల్లో దుమ్ము పేరుకుపోవడం లేదా కీటకాలు చేరడం వంటివి జరుగుతుంటాయి. అలాంటి ప్రదేశాలపై కూడా శ్రద్ధ పెడుతూ   ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.

సింకులు

సింక్  నుంచి ఏవైనా గట్టి పదార్ధాలు కిందకు వెళ్లకుండా చూసేందుకు చాలా మంది మెటల్ సింక్ ట్రాప్స్ ఉపయోగిస్తారు. కాని దాని వలన సింక్ శుభ్రంగా ఉండదు. సింక్ పరిశుభ్రంగా ఉండేలా చూసేందుకు తరచూ కొంచెం సమయం కేటాయిస్తూ ఉండాలి. మీ దగ్గర స్టీల్ సింక్ ఉన్నట్టైతే దానిపై కొంచెం బేకింగ్ సోడా చల్లి బ్రష్ తో సింక్ మొత్తం శుభ్రం చేయండి.  ఒక వేళ మీది సిరామిక్ సింక్ అయితే మార్కెట్లలో దొరికే క్లీనింగ్ సొల్యూషన్స్ ఉపయోగించండి.

కేబినెట్ ముందు భాగాలు

మీ కేబినెట్లు మురికిగా కనిపించకపోవచ్చుగాని వాటిపై చాలా దుమ్ము పేరుకుపోయి ఉంటుంది. నీటిలో క్యాజిల్ సోప్ కలిపి దానితో కేబినెట్ ముందు భాగాలు శుభ్రం చేయండి. మీ కప్ బోర్డ్స్ శుభ్రం చేసేందుకు కూడా మీరు దీన్ని ఉపయోగించవచ్చు.

ఫ్రిజ్, స్టవ్ కింద

స్టవ్, ప్రిజ్ కింద కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. పని కోసం మీరు బ్రషులు ఉపయోగించవచ్చు.కిచెన్ లో చాలా మంది పట్టించుకోని ప్రదేశాలు ఇవి. అవి శుభ్రంగా ఉండాలంటే వాటిపైన కూడా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.
First published: August 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading