హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

ఇప్పుడు పిల్లలకూ ఆ పరీక్ష చేయించాల్సిందే.. ఎందుకంటే..

ఇప్పుడు పిల్లలకూ ఆ పరీక్ష చేయించాల్సిందే.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం కూడా వ్యాధికి కారణమని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుత జీవనశైలిని అనుసరించి పిల్లలకు కూడా బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు.

మారిన జీవన శైలికి అనుగుణంగా ప్యాక్ చేసిన ఆహారం, నూడుల్స్, పిజ్జాలు, బేకరీ పదార్థాలు, సాఫ్ట్ డ్రింకులు, క్యానెడ్ ఫుడ్స్ ఇలా ‘రెడీమేడ్’కు అలవాటు పడిపోయాం. ఏది పడితే అది తిస్తున్నాం. దీనివల్ల రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతిని రక్తపోటుకు కారణమవుతోంది. పర్యవసానంగా గుండె, మూత్రపిండాలు, మెదడు దెబ్బతింటాయి. ప్రస్తుతం ఈ వ్యాధి 40 ఏళ్ల పైబడిన వాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మధ్య 20-30 ఏళ్ల వయసున్న యువతీయువకులనూ ఈ సమస్య వేధిస్తోంది. అయితే, సమీప భవిష్యత్తులో పిల్లలూ బీపీ బారిన పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని ట్యులేన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 3940 మంది పిల్లలను పరీక్షించగా క్రమంగా సోడియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటున్న వారిలో బీపీ ఆనవాళ్లు కనిపించాయట. శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం కూడా ఒక కారణమని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుత జీవనశైలిని అనుసరించి పిల్లలకు కూడా బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. పిల్లల్లో పరీక్ష చేస్తే తప్ప బీపీ ఉందా.. లేదా.. అన్నది నిర్ధారణ కాదని, అందువల్ల మూడేళ్లు దాటిన తర్వాత రెగ్యులర్‌గా బీపీ పరీక్ష చేయించాలని సూచించారు.

బీపీని నియంత్రణలో ఉంచుకోవడానికి సోడియం లభించే పదార్థాలను చాలా వరకు తగ్గించుకోవాలి. ఎందుకంటే సోడియం వల్ల రక్తపోటు ఇంకా అధికం అయ్యే అవకాలున్నాయి. ఉప్పులో సోడియం అధికంగా ఉంటుంది. ఉప్పు అధికంగా తింటే శరీర ద్రవాల అసమతుల్యత పెరిగి ద్రవాలు అధికమై రక్తపోటును అధికం చేస్తాయి. అందువల్ల ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. బీ.పి. ఉన్నవారు రోజుకి 2-3 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తీసుకోకూడదు. బీ.పి. మరీ ఎక్కువగా ఉంటే రోజుకి 1 గ్రాముల ఉప్పును మాత్రమే వినియోగించాలి.

సోడియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు:

పచ్చళ్ళు (నిల్వ చేసినవి)

ఫాస్ట్ ఫుడ్స్ (న్యూడుల్స్, ఫ్రైడ్ రైస్ తదితరాలు)

ఎండు చేపలు

ఆలూ చిప్స్

బ్రెడ్, కేక్

సాఫ్ట్ డ్రింక్స్

క్యానెడ్ ఫుడ్స్

First published:

Tags: Children, Food, Health, Health Tips, Heart, Life Style

ఉత్తమ కథలు