కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారా?.. ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి

మానవ శరీరంలో ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయనే సంగతి తెలిసిందే. శరీరంలోని వ్యర్థాలును తొలగించడంలో వీటిదే ముఖ్య భూమిక.

news18-telugu
Updated: September 19, 2020, 6:23 PM IST
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారా?.. ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి
ఉల్లిపాయ, వెల్లుల్లి
  • Share this:
మానవ శరీరంలో ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయనే సంగతి తెలిసిందే. శరీరంలోని వ్యర్థాలును తొలగించడంలో వీటిదే ముఖ్య భూమిక. అందుకే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నవారు..  ఆరోగ్యకరమైన డైట్ పాటించాల్సి ఉంటుంది. లేకపోతే శరీరంలో పెద్ద సంఖ్యలో వ్యర్థాలు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. కిడ్నీ ఫ్రెండ్లీ డైట్ పాటించడం ద్వారా.. సోడియం, పోటాషియం, ప్రోటీన్, పాస్పరస్‌ను పరిమితం చేయవచ్చు. ఒకవేళ కిడ్నీవ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారైతే వైద్యలు సూచించిన డైట్ పాటించాల్సి ఉంటుంది. డాక్టర్ మాత్రమే వారి ఆరోగ్య పరిస్థితని బట్టి ఆహారాన్ని సూచించగలడు.

కిడ్నీ పెషేంట్ల డైట్‌లో ఉండాల్సినవి..

1. ఉల్లిపాయ..

ప్రతి ఒక్కరి కిచెన్‌లో ఉల్లిపాయ తప్పనిసరిగా కనిపస్తుంది. ఉల్లిపాయ వినియోగించడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా సోడియం పరిమాణాన్ని తగ్గిస్తాయి. వీటిలో కూడా చాలా తక్కువ మొత్తంలో సోడియం ఉంటుంది. మాములుగా ఉల్లిపాయను సలాడ్ చేసుకుని తినొచ్చు.

2. వెల్లుల్లి..
వెల్లుల్లిని కూడా ప్రతి ఒక్కరి కిచెన్‌లో కనిపిస్తుంది. ఆహారం రుచికరంగా ఉండేందుకు వెల్లులిని వాడతారు. ఇందులో చాలా మందికి తెలియని ఎన్నో జౌషధ గుణాలు ఉన్నాయి. ఇందులో తక్కవ మొతాదులో సోడియం, పోటాషియం, పాస్పరస్ ఉండటం వల్ల వెల్లుల్లి కిడ్నీ పెషేంట్లకు చాలా వరకు మేలు చేస్తుంది.

3. క్యాప్సికమ్..క్యాప్సికమ్‌లో అధిక మొత్తంలో పోషక విలువలు ఉన్నాయి. యాంటీ యాక్సిడెంట్‌లు వృద్ది చెందడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి.దీనిని తీసుకోవడం ద్వారా విటమిన్ సీ కూడా దొరుకుతుంది. క్యాప్సికమ్‌ను సలాడ్‌గా,కూరగా, శాండ్‌విచ్‌లుగా కూడా తీసుకొవచ్చు.

4. పైనాపిల్..
శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడంలో పైనాపిల్ తోడ్పడుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో తక్కువ మొత్తం పోటాషియం ఉండం.. కిడ్నీ పెషేంట్లకు మంచి డైట్‌గా పనిచేస్తుంది. అలాగే ఇది శరీరానికి పెద్ద మొత్తంలో పైబర్‌ను కూడా అందజేస్తుంది.
Published by: Sumanth Kanukula
First published: September 19, 2020, 6:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading