Health Tips : కిడ్నీ సమస్యలు తగ్గించే మందులివే..

కిడ్నీల్లోని రాళ్లని కరిగించే నీరు..

కిడ్నీ సమస్యలకు ఆయుర్వేద మూలికలు మంచి ఫలితాలు ఇస్తాయని తేలింది. తాజాగా జరిగిన పరిశోధనలో పునర్నవ అనే మూలికతో మూత్రపిండాల సంబంధిత సమస్యలు అదుపులోకి వస్తాయని తేలింది.

  • Share this:
చాలామంది మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటివారికి.. మూలికలు సంజీవని మంత్రంలా పనిచేస్తాయని చెబుతున్నారు బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధకులు. దీనిపై ఇప్పటికై పరిశోదనలు జరిగాయి. ఇందులో తేలిన విషయమేంటంటే, ‘పునర్నవ’ అనే మూలిక మూత్రపిండాల వ్యాధులను అదుపులోకి వచ్చినట్లు చెబుతున్నారు.

మూలికలతో తయారు చేసిన ‘నీరి కేఎఫ్‌టీ’ ద్రావణం వాడితే సమస్యలు తగ్గినట్లు.. పునర్నవ తో తయారుచేసిన ద్రావాణాన్ని నెలపాటు వాడిన మహిళలో క్రియాటినైన్, యూరియా స్థాయిలు సాధారణస్థితికి వచ్చినట్లు నిర్ధారించారు. రక్తంలోని హిమోగ్లోబిన్ శాతం కూడా పెరిగింది. ఇంకా ప్రయోగాలు జరుగుతున్న ఈ పరిశోధన సక్సెస్ అయితే.. కిడ్నీ పేషెంట్స్‌కి సరికొత్త మందు అందుబాటులోకి వస్తుంది.
First published: