మీరు గమనించారో లేదో... మన దేశంలో మద్యం, టీ, కాఫీలతోపాటూ.... కూల్‌డ్రింక్స్, షోడాలు, ప్యాకేజ్డ్ జ్యూస్ వంటివి ప్రజలు తెగ తీసుకుంటున్నారు. ఎప్పుడో డాక్టర్ దగ్గరకు వెళ్లి, వాళ్లు చెబితే తప్ప... కొబ్బరిబోండాలు, నిమ్మరసాల వంటివి జనం తీసుకోవట్లేదు. అందువల్ల ఆ అంతర్జాతీయ కంపెనీలు బాగానే వెనకేసుకుంటున్నాయి కానీ... అసలు విషయాన్ని మాత్రం దాచేస్తున్నాయి... అదే సైడ్ ఎఫెక్ట్స్. చక్కెరతో తయారు చేసిన డ్రింకులు, గ్యాస్‌తో నిండిపోయే సోడాలూ తాగితే ఎంత ప్రమాదమో, పైకి కనిపించకుండా లోలోపల శరీరం ఎంతలా నాశనం అయిపోతుందో డాక్టర్లు చెప్పిన విషయాలు మనం తెలుసుకోవాల్సిందే.
అదే పనిగా కూల్ డ్రింక్స్, సోడాలు తాగితే క్రోనిక్ కిడ్నీ డిసీజ్ వస్తుందట. సింపుల్‌గా చెప్పాలంటే కిడ్నీలు పాడైపోయినట్లే. క్లినికల్ జర్నల్ ఆఫ్ ది అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ (CJASN)లో ఈ పరిశోధన వివరాల్ని తెలియపరిచారు. మొత్తం 3,003 మంది ఆఫ్రికా-అమెరికాకు చెందిన మగాళ్లు, మహిళల్ని డాక్టర్లు పరిశోధించారు. వీళ్లంతా ఎడాపెడా కూల్‌డ్రింక్స్, సోడాలు తాగుతున్నవాళ్లే. దాదాపు పదేళ్లపాటూ ఈ రీసెర్చ్ సాగింది. ఈ 3,003 మందిలో 185 మందికి క్రోనిక్ కిడ్నీ డిసీజ్ వచ్చింది. కూల్‌డ్రింక్స్ తాగడం మొదలుపెట్టిన 8 ఏళ్లలో ఈ వ్యాధి వచ్చినట్లు తేలింది. సోడా, డ్రింకులు, వాటర్లను మిక్స్ చేస్తూ తాగిన వాళ్లకు వ్యాధి తీవ్రత మరింత ఎక్కువగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఆశ్చర్యకర విషయమేంటంటే మామూలుగా మనం వాటర్ తాగితే ఆరోగ్యానికి మంచిది. అదే డ్రింకుల్లో, సోడాల్లో వాటర్ కలిపి తాగితే ఆరోగ్యం పాడైపోయినట్లే.
ఈ డ్రింకులు, బేవరేజెస్లో వేటి వల్ల వ్యాధులు వస్తున్నదీ డాక్టర్లు తేల్చలేదు. ఎందుకంటే ఈ పరిశోధనలో పాల్గొన్న వాళ్లు దాదాపు 600 రకాల డ్రింకులు, సోడాల వంటివి వాడారు. ఎవరు ఏవి తీసుకున్నా... రిస్క్ మాత్రం కామన్‌గానే ఉంది కాబట్టి... అవి ఆరోగ్యానికి చేటే అన్నది డాక్టర్ల మాట.
మన శరీరంలో కిడ్నీలు కీలకమైనవి. వాటికేమైనా సమస్య వస్తే, పదే పదే డాక్టర్ల చుట్టూ తిరగాలి. ప్రతీ నిమిషమూ నరకం లాగే ఉంటుందంటుంటారు బాధితులు. అందువల్ల ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం మరొకటి ఉండదు కదా. అందుకే ఈ బేవరేజెస్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు డాక్టర్లు. మంచి సూచనే కాబట్టి ఫాలో అయిపోవడం బెటర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Health Tips, Tips For Women, Women health