శృంగార భంగిమలన్నీ ఆ ఆలయ గోడలపై.. జీవిత సత్యాన్ని నేర్పుతుంది..

Khajuraho Temple : ఖజురహో టెంపుల్.. గుడి గోడలపై రతి క్రీడకు సంబంధించి బొమ్మలు కలిగిన ఆలయం. దేశంలోనే.. కాదు కాదు ప్రపంచంలోనే ప్రత్యేకత సంతరించుకున్న గుడి ఇది.

news18-telugu
Updated: January 22, 2020, 8:57 AM IST
శృంగార భంగిమలన్నీ ఆ ఆలయ గోడలపై.. జీవిత సత్యాన్ని నేర్పుతుంది..
ఖజురహో అందాలు
  • Share this:
ఖజురహో టెంపుల్.. గుడి గోడలపై రతి క్రీడకు సంబంధించి బొమ్మలు కలిగిన ఆలయం. దేశంలోనే.. కాదు కాదు ప్రపంచంలోనే ప్రత్యేకత సంతరించుకున్న గుడి ఇది.ఆధ్యాత్మికతనే కాదు.. జీవన శైలిని, సృష్టి కార్య ఆవశ్యకతను కళ్లకు కట్టే సుందర, అద్భుత శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. రతి క్రీడను ఎన్ని విధాల జరుపుకోవచ్చు? అన్న వివరణను శిల్పాల రూపంలో చక్కగా వర్ణించారు మన పూర్వికులు. చండేలా అనే రాజవంశీయులు 10వ శతాబ్ధంలో నిర్మించిన ఇక్కడి ఆలయాలను నిర్మించారు. ఇండో ఆర్యన్ సంస్కృతిని అద్దం పట్టేలా ఉన్న ఖజురహో టెంపుల్.. నేటి కాలానికి మార్గదర్శిగా నిలిచింది.

ఈ ఆలయ గోడలపై రతి క్రీడ ఎలా చేస్తారు.. సంభోగానికి ముందు చేయాల్సిన పనులేంటి.. తదితర విషయాలు సుస్పష్టంగా చెక్కారు. ప్రపంచ వారసత్వ సంపదగా, ప్రదేశంగా గుర్తింపు పొందిన ఖజురహో.. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ జిల్లాలో ఉంది. ఖజురహోలో మొత్తం 85 ఆలయాలు ఉండగా.. ఇప్పుడు 25 ఆలయాలను మాత్రమే పునరుద్ధరించారు. మిగితావి చరిత్రలో కలిసిపోయినట్లే. 16వ శతాబ్ధం నాటికి కనుమరుగైన ఖజురహో చరిత్రను 1838లో బ్రిటిష్ వ్యక్తి కెప్టెన్ టీఎస్ బర్ట్ వెలికి తీశారు.

First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు