మాంసం (Meat) అధిక వినియోగం వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని ప్రకృతి ప్రేమికులు (Nature Lovers) తరచూ ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. చికెన్ (Chicken), మటన్ (Mutton) కోసం కోళ్లు, మేకలను చంపడం ద్వారా వాటి వ్యర్థాలు గ్లోబల్ వార్మింగ్ (Global Warming)కు కారణమవుతాయని, దీంతో మాంసం వినియోగం తగ్గించాలని ప్రకృతి ప్రేమికులు డిమాండ్ చేయడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి మొక్కలతోనూ మాంసం తయారు చేస్తున్నారు. ఇది రుచిలో మాంసంలానే ఉంటుంది. ప్రొటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. పైగా పర్యావరణానికి హాని ఉండదు. ఈ మాంసంతో కేరళకు చెందిన ఫుడ్ ఇన్నోవేటర్, గ్రాస్షాపర్ గ్లోబల్ స్టార్టప్ సీఈవో కన్నన్ పరకున్నిల్ వెజ్ చికెన్ షవర్మాను తయారు చేశారు. దీన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
* సింగపూర్ ఇన్నోవేట్ 360 సహకారం
ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ స్టార్టప్‌లకు సపోర్ట్ ఇచ్చే సింగపూర్‌కు చెందిన ప్రముఖ ఫుడ్ యాక్సిలరేటర్ ఇన్నోవేట్ 360.. రెడీ-టూ ఈట్ ‘ప్లాంట్ షవర్మా’ను ప్రారంభించేందుకు కన్నన్ పరకున్నిల్తో చేతులు కల్పింది. షావర్మా లవర్స్ ఇప్పుడు చికెన్‌తో సమానమైన మొక్కలతో చేసిన మాంసాన్ని ప్రకృతికి ఎలాంటి హాని లేకుండా తినవచ్చు.
షవర్మా అరబిక్ దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. కేరళలోనూ షవర్మా తినే వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. అయితే ఇది ఇప్పటికీ ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించడం లేదు. దీంతో గ్రాస్షోపర్ గ్లోబల్ టీమ్ ప్లాంట్ షవర్మా పేరుతో మొక్కలతో చేసిన మాంసాన్ని విస్తృతం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.
* గ్రాస్షాపర్ పేరుతో ఫుడ్ కార్ట్
తిరువునంతపురంలో ఫుడ్స్ట్రీట్గా పేరుపొందిన కొవ్డియార్-కురువంకోణం రోడ్డులో కన్నన్ పరకున్నిల్ గ్రాస్షాపర్ పేరుతో ఫుడ్ కార్ట్ ప్రారంభించారు. దీని ద్వారా ‘ప్లాంట్ షవర్మా’ (మొక్కలతో చేసిన మాంసం)ను పెద్ద ఎత్తున్న ప్రాచుర్యంలోకి తీసుకురావాలనుకుంటున్నారు.
గ్రాస్షాపర్ గ్లోబల్ స్టార్టప్ సీఈవో కన్నన్ పరకున్నిల్ మాట్లాడుతూ.. చికెన్‌లో ఉండే వాసన, రుచి, ప్రోటీన్ కంటెంట్ ప్లాంట్ షవర్మాలో ఉంటాయని తెలిపారు. సింగపూర్‌కు చెందిన ఇన్నోవేట్ 360 కంపెనీ దీనిపై రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సపోర్ట్ కోసం రూ.4 కోట్ల స్టార్టింగ్ ఫండ్ అందించినట్లు చెప్పారు. సింగపూర్ ప్రభుత్వం ఎంటర్ ప్రెన్యూయర్ వీసాను కూడా అందజేసిందన్నారు. బెస్ట్ ఇన్నోవేటర్స్‌కు మాత్రమే ఇది అందజేస్తారని, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్లాంట్ బేస్డ్ షవర్మాను సింగపూర్‌లో మూడు నెలల్లో అందించి, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయాలనే ప్రణాళిక ఉందని కన్నన్ చెప్పకొచ్చారు.
ఇది కూడా చదవండి : మెరిసే చర్మం కోసం 5 ఆయుర్వేద ట్రీట్మెంట్స్..ఇలా చేస్తే మీ చర్మం మెరిసిపోతుంది
* FSSAI నుంచి లైసెన్స్
ప్లాంట్ షవర్మాలోని ఇంగ్రిడియన్స్ను బయటకు వెల్లడించడానికి కన్నన్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో అతను ఇదిపై పేటెంట్ పొందేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. అయితే, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నుంచి లైసెన్స్ పొందాడు. కన్నన్ ఇన్నోవేట్ 360తో చర్చల కోసం ఇటీవల సింగపూర్‌కు వెళ్లాడు.
అక్కడ అతను బీఫ్ కంటెంట్ లేని యుఎస్ కంపెనీ తయారుచేసిన బీఫ్ బర్గర్‌ను రుచి చూశాడు. అయితే దాని ధర చాలా ఎక్కువగా ఉంది. అయితే ప్లాంట్ షవర్మా సామాన్యులకు అందుబాటులో ఉంటుందని, పాకెట్-ఫ్రెండ్లీగా ఉంటుందని కన్నన్ చెప్పుకొచ్చారు. ప్లాంట్ షవర్మా USP నూనె, చక్కెర, పాలు లేదా ప్రిజర్వేటివ్‌లు ఉండవని అన్నారు. యూకేలోని కార్డిఫ్ యూనివర్సిటీలో కన్నన్ ఎంబీఏ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chicken, Kerala, Meat, National News