Vastu tip: వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రంగు ఫిష్‌ను ఇంట్లో పెట్టుకుంటే ..!

గోల్డ్‌ ఫిష్‌ను ఇంట్లో పెట్టుకుంటే అనేక లాభాలు ఉంటాయని వాస్తుశాస్త్ర నిపుపులు చెబుతున్నారు. గోల్డ్‌ఫిష్‌ ఎంతో పాపులర్‌. ఎందుకంటే ప్రతి ఏడాది దాదాపు 480 మిలియన్ల మంది ఈ గోల్డ్‌ ఫిష్‌ను కొనుగోలు చేస్తారని సర్వేలో తేలింది.

గోల్డ్‌ ఫిష్‌ను ఇంట్లో పెట్టుకుంటే అనేక లాభాలు ఉంటాయని వాస్తుశాస్త్ర నిపుపులు చెబుతున్నారు. గోల్డ్‌ఫిష్‌ ఎంతో పాపులర్‌. ఎందుకంటే ప్రతి ఏడాది దాదాపు 480 మిలియన్ల మంది ఈ గోల్డ్‌ ఫిష్‌ను కొనుగోలు చేస్తారని సర్వేలో తేలింది.

  • Share this:
వాస్తు ప్రకారం గోల్డ్‌ అరోవానా ఫిష్‌ను ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందో ఈరోజు తెలుసుకుందాం.  వాస్తు ప్రకారం ఇంట్లో గోల్డ్‌ ఫిష్‌ను పెట్టుకుంటే సుఖఃసౌభాగ్యాలకు లోటుండదని వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని పేరు అరొవాన ఫిష్‌ దీన్ని ఇంట్లో పెట్టుకుంటే అనేక లాభాలు ఉంటాయని వాస్తుశాస్త్ర నిపుపులు చెబుతున్నారు. అరొవాన ఫిష్‌కు వాస్తు శాస్త్రంలో మంచి పేరుంది. ఈ చేపను ఇంట్లోని అక్వేరియంలో పెట్టుకుంటే ఆ ఇంటిలో సంపదలకు కొదవ ఉండదు అంటారు.

ఈ చేప మంచి ఆరోగ్యానికి ప్రతీక. అంతేకాదు సుఖఃసౌభాగ్యాలు, ధనం, శక్తికి లోటు ఉండదు. ఇది చెడు శక్తులను తొలగిస్తుంది. మీ ఇంట్లో బతికి ఉన్న చేపను పెట్టుకోకపోతే నోటిలో గోల్డ్‌ కాయిన్‌ పట్టుకున్న గోల్డెన్‌ అరోవాన చేప విగ్రహన్ని పెట్టుకోవచ్చు. ఈ బొమ్మను ఇంట్లోని ఈశాన్య దిశ లేదా తూర్పు దిశలో పెట్టుకోవాలి. జంతు శాస్త్ర నిపుణుల ప్రకారం అరోవాన చేప పర్వత ప్రాంతాల్లో కూర్చుని ఉంటుంది. కాబట్టి దీనికి భూకంపం గురించి ముందుగానే తెలిసిపోతుంది. గోల్డ్‌ ఫిష్‌కు మూడు నెలల వరకు గుర్తుంటుంది. మనం వేసే ఫుడ్‌ను కూడా ప్రతిరోజూ ఎవరు వెస్తున్నారో ఈజీగా గుర్తుపెట్టుకుంటారు.

అన్నీ చేపల కంటే గోల్డ్‌ ఫిష్‌ ఎక్కువ కాలం బతుకుంది. దాదాపు 10 ఏళ్లు బతుకుంది. ఈ గోల్డ్‌ ఫిష్‌ ఉన్న నీటిలో ఇతర చేపలను వేస్తే.. వాటిని తినేస్తుంది. మరో విషయం ఏంటంటే గోల్డ్‌ ఫిష్‌ అల్ట్రా వైరస్‌ రేస్‌ను సైతం చూడగలుగుతుంది. ముఖ్యంగా ఏ అక్వేరియంలోనైనా లైట్‌ కచ్ఛితంగా ఉండాలి. లేకపోతే అవి బతకలేవు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్‌ఫిష్‌ పొడవు 18.7 ఇంచులు. దీనికి గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు కూడా ఉందట. ఏషియన్‌ కంట్రీస్‌లో ఈ గోల్డ్‌ ఫిష్‌లను గిఫ్ట్‌ కింద ఇస్తారట. ఒకే ట్యాంక్‌ లేదా పాట్‌లలో ఎక్కువ గోల్డ్‌ ఫిష్‌లు ఉండే గుంపును ట్రబ్లింగ్‌ అంటారు. దీనికి బాగా కేర్‌ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇవి ఎక్కువ రోజులు బతుకుతాయి.

కొన్నిసార్లు గోల్డ్‌ఫిష్‌ను కొన్న రెండు మూడు రోజులు లేదా గరిష్టంగా నెలరోజుల్లో చనిపోతుంది. దీనికి కారణం ఫిష్‌ ట్యాంక్‌ లేదా పాట్‌ను కొన్న రోజే ఫిష్‌ను కొనకూడదు. ముందుకు దానికి సరిపడా ఎన్విరాన్‌మెంట్‌ను సెట్‌ చేయాలి. ముందుగా ట్యాంక్‌ ఫిల్ట్రేషన్‌ సిస్టంను కొని 24/7 దాదాపు మూడు రోజుల పాటు రన్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులో కాస్త ఫిష్‌ ఫుడ్‌ వేయాలి. అప్పుడు అది ఫిష్‌ బతకడానికి సరిపోయే వాతావరణం ఏర్పడుతుంది. ఆ ట్యాంక్‌లో యాంటీ క్లోరిన్‌ లిక్విడ్‌ వేయాలి. మరో పెద్ద తప్పు ఏంటంటే గోల్డ్‌ ఫిష్‌ను ఎట్టిపరిస్థితుల్లోను గుండ్రటి ట్యాంకుల్లో వేయకూడదు. దీనికి పెద్ద ఫిష్‌ ట్యాంక్‌ ఉండాల్సిందే.
Published by:Renuka Godugu
First published: