Vastu directions: రాత్రి పడుకునేటపుడు తల ఈ దిక్కున పెట్టి పడుకుంటే ఐశ్వర్యవంతులవుతారు !

వాస్తు ప్రకారం అష్ట దిక్కులను అనుసరించి ఎటువైపు కాళ్లు.. ఎటువైపు తల పెట్టుకోవాలో ఆ దిశలను మాత్రమే అనుసరించాలి.

వాస్తు ప్రకారం అష్ట దిక్కులను అనుసరించి ఎటువైపు కాళ్లు.. ఎటువైపు తల పెట్టుకోవాలో ఆ దిశలను మాత్రమే అనుసరించాలి.

  • Share this:
వాస్తు ప్రకారం కొన్ని నియమాలను పాటించి అనుసరిస్తాం. ముఖ్యంగా అష్ట దిక్కులకు ప్రధాన్యమిస్తూ.. నడుచుకుంటాం. అయితే, రాత్రి పడుకునే సమయం నుంచి ఉదయం లేచే వరకు అన్ని కూడా వాస్తు Vastu  నియమాలను అనుసరించి నడుచుకుంటాం. రాత్రి పడుకునే సమయంలో తల ఏ దిక్కున పెట్టి పడుకుంటే ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఉత్తరం వైపు తల పెట్టి అస్సలు పడుకోకూడదు అంటారు. ఎందుకంటే ఈ దిక్కున పడుకుంటే... దక్షిణం కనిపిస్తుంది. అది యమ స్థానం.

పూర్వం ఉత్తరం వైపు తల పెట్టి పడుకన్న ఏనుగు తలను తీసుకురావాలని శివుడు ఆజ్ఞాపిస్తాడు. అదే విధంగా ఆ ఏనుగు తలను తీసుకువస్తారు. అందుకే ఈ దిక్కున తలపెట్టి పడుకుంటే అకాల మృత్యువు కలుగుతుందని అంటారు. పడమర వైపు కూడా తలపెట్టి పడుకోకూడదని అంటారు. ఈ దిక్కున పడుకుంటే.. తూర్పువైపు కాళ్లు పెట్టాల్సి వస్తుంది. ఉదయించే సూర్యుడు ఇటువైపే ఉదయిస్తాడు కాబట్టి పడమరవైపు తల పెట్టి పడుకోకూడదు.

వాస్తు ప్రకారం ఆగ్నేయంలో ఇవి ఉంటే.. కష్టాలు తప్పవు!


అయితే, మరి ఎటువైపు తలపెట్టి పడుకంటే.. మంచిది? అనే సందేహం రావచ్చు. దీనికి జోతిషులు కొన్ని దిక్కులను సూచించారు. అదే తూర్పు వైపు తలపెట్టి.. పడమర వైపు కాళ్లు పెట్టి పడుకోవచ్చట. లేదంటే దక్షిణం వైపు తలపెట్టి.. ఉత్తరం వైపుగా కాళ్లు పెట్టి పడుకోవచ్చు. పడుకునేటపుడు కూడా జాగ్రత్తగా ఈ దిక్కులను అనుసరించి పడుకోవాలట. ఆచరిస్తే.. ఐశ్వర్యం మీ సొంతం. లక్ష్మీకటాక్షం కలుగుతుంది.

ఎందుకంటే దాదాపు 80 శాతం మంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఎక్కువ. అందుకే కొన్ని వాస్తు నియమాలను అనుసరిస్తే వారి పిల్లలకు కూడా మంచిది. అందుకే బీరువా మీద కూడా స్వస్తిక్‌ ముద్ర వేసుకోవాలి అంటారు. అంతేకాదు పడకగదిలో కూడా ఎటువంటి దేవుళ్ల ఫోటోలను పెట్టుకోకూడదు.

దీనివల్ల దంపతుల్లో సాన్నిహిత్యం తగ్గుతుందంటారు. కొన్ని దిశలుగా ఇష్టానుసరం పడుకుంటే మెదడు ఒత్తిyì కూడా పెరుగుతుంది. కొందరు పక్షవాతాలకు కూడా గురైనవారు ఉన్నారు. ముఖ్యంగా మన దేశం ఉత్తరార్ధగోళంలో ఉండటం కారణంగా ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకపోవడమే మేలు.
Published by:Renuka Godugu
First published: