తప్పకుండా చూడాల్సిన పర్యాటక ప్రాంతాల్లో రెండో స్థానంలో హంపి

హంపి నగరం 26 చదరపు కిలోమీటర్లలో విస్తరించింది. హంపి భారతదేశంలోనే కాదు దక్షిణాసియాలోనే గొప్ప పర్యాటక ప్రాంతం. కానీ ఇక్కడ పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు లేకపోవడం సమస్యగా మారింది.

news18-telugu
Updated: January 11, 2019, 2:51 PM IST
తప్పకుండా చూడాల్సిన పర్యాటక ప్రాంతాల్లో రెండో స్థానంలో హంపి
తప్పకుండా చూడాల్సిన పర్యాటక ప్రాంతాల్లో రెండో స్థానంలో హంపి (Image: Rachaiah Hampi/News18)
  • Share this:
న్యూయార్క్ టైమ్స్ రూపొందించిన తప్పకుండా చూడాల్సిన పర్యాటక ప్రాంతాల జాబితాలో కర్నాటకలోని హంపి రెండో స్థానంలో నిలిచింది. '2019లో చూడాల్సిన 52 పర్యాటక ప్రాంతాలు' ఇవే అంటూ ది న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. యునెస్కో వాల్డ్ హెరిటేజ్ సైట్ అయిన ప్యూర్టో రికో తొలి స్థానంలో నిలవగా, ఆ తర్వాత రెండో స్థానంలో కర్నాటకలోని హంపి ఉండటం విశేషం.

16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో హంపి ప్రపంచంలోనే అతిపెద్ద, సంపన్న నగరంగా పేరు తెచ్చుకుంది. 1,000 రాతి కట్టడాలు, హిందూ దేవాలయాలు, కోటలు, రాజభవనాలతో నిర్మాణ వారసత్వం ఇప్పటికీ సజీవంగా ఉంది. చుట్టూ గ్రానైట్ రాళ్లు, కొండల మధ్య తుంగభద్ర నదీతీరంలో 16 మైళ్లు విస్తరించింది హంపి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా కీర్తి తెచ్చుకున్న హంపిని చేరుకోవడం ఇప్పటికీ కష్టమే. ఇటీవల ట్రూజెట్ హైదరాబాద్‌, బెంగళూరు నుంచి బళ్లారికి విమాన సేవలు ప్రారంభించాయి. బళ్లారి నుంచి 25 మైళ్ల దూరంలో హంపి ఉంది.
ది న్యూయార్క్ టైమ్స్ కథనం


హంపి నగరం 26 చదరపు కిలోమీటర్లలో విస్తరించింది. హంపి భారతదేశంలోనే కాదు దక్షిణాసియాలోనే గొప్ప పర్యాటక ప్రాంతం. కానీ ఇక్కడ పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు లేకపోవడం సమస్యగా మారింది. ఈ వారసత్వ సంపదను కాపాడుకోవడానికి చాలా చేయాల్సి ఉందన్నది పురావస్తు నిపుణుల అభిప్రాయం. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యంలో సంపన్న నగరంగా పేరొందిన హంపి పూర్తిగా కళ తప్పిందన్నది వాస్తవం. హంపిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినా ఈ పర్యాటక ప్రాంతానికి కావాల్సినంత ప్రచారం లభించట్లేదు.హంపి అందాలను ఇక్కడ వీక్షించండి.

ఇవి కూడా చదవండి:Work From Home: స్మార్ట్‌ఫోన్‌తో ఇంట్లో కూర్చొని రూ.40 వేలు సంపాదించండి ఇలా

కార్డు నెంబర్, సీవీవీ లేకుండా పేమెంట్స్ సాధ్యం... ఎలాగో తెలుసుకోండి

అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ విడాకులకు ఆమెతో ఎఫైర్ కారణమా?

Photos: కలర్‌ఫుల్‌గా చైనాలో ఐస్ ఫెస్టివల్... ఆ అందాలు చూడండి
First published: January 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు