నిత్య జీవనాన్ని మరింత అందంగా మలుచుకుందాం..

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నందున మనమంతా 21 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ‘ఈ 21 రోజుల్లో 21 పాఠాలు’ నేర్చుకుందాం అంటూ కర్ణాటకకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై జీవిత పాఠాలను చెబుతున్నారు. ఈ సందర్భంగా రోజూవారి కార్యక్రమాలను మరింత అందంగా ఎలా మలచుకోవచ్చో వివరించారు.

news18-telugu
Updated: April 8, 2020, 2:21 PM IST
నిత్య జీవనాన్ని మరింత అందంగా మలుచుకుందాం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
(కె.అన్నామలై, మాజీ ఐపీఎస్ అధికారి, కర్ణాటక)

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నందున మనమంతా 21 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ‘ఈ 21 రోజుల్లో 21 పాఠాలు’ నేర్చుకుందాం అంటూ కర్ణాటకకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై జీవిత పాఠాలను చెబుతున్నారు. ఈ సందర్భంగా రోజూవారి కార్యక్రమాలను మరింత అందంగా ఎలా మలచుకోవచ్చో వివరించారు.

ఉదయం నిద్ర లేవగానే ఓ సారి ఇంటిని చూస్తే.. ఎక్కడి వస్తువు అక్కడ పడేసినట్లు ఉంటుంది. వాటిని రోజూ చూస్తాం. కానీ, ఓ చోట సర్దేయడానికి సాహసించం. తర్వాత సర్దుకుందాంలే అనుకుంటాం. ఫర్నిచర్‌ను శుభ్రం చేయడమో, బట్టలు అల్మారాలో సర్దిపెట్టుకోవడమో, పాత న్యూస్ పేపర్‌ను స్టోర్‌ రూమ్‌లో దాయడమో చేయాలనుకుంటాం.. కానీ, బిజీ లైఫ్‌లో అది సాధ్యం కాదు. అయితే, ఇప్పుడు మనకు 21 రోజుల పాటు సమయం దొరికింది. ఈ సమయాన్ని వృథాగా గడిపేయకుండా ఇంటిని శుభ్రంగా, అందంగా ఉంచుకుంటే మంచిదేగా.

ప్రతి రోజు ఆఫీస్‌కు వెళ్లేప్పుడో, బయటికి వెళ్లేప్పుడో.. ఏ డ్రెస్ ధరించాలన్నది పెద్ద పనే. పురుషులకైతే షర్టు కలర్ ఎలా ఉండాలి? దానికి తగ్గ ప్యాంటు ఏది వేసుకోవాలి? అన్న సందేహం వస్తుంది. స్త్రీలైతే ఏ చీర కట్టుకోవాలి? దానికి తగ్గ బ్లౌజ్ లేకపోతే ఏ సల్వార్ కమీజ్ ధరించాలి అన్న డైలమాలో ఉండిపోతారు. తినే తిండిలోనూ అంతే.. ఏ కూర చేసుకొని తినాలి. ఏ సినిమా చూడాలి? తదితర ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. ఇవి నిత్యమూ చేసేవే. అయినా.. కొంత సమయం పాటు వాటి గురించి ఆలోచించక తప్పదు. కెరీర్‌లోనూ అంతే.. ఏ రంగంలో ఉద్యోగం మంచిది. ఏ జాబ్ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించగలను? లాంటి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి.

అలాంటి వాటిని రొటీన్‌గా మార్చుకుంటే.. వేరే విషయాలపై శ్రద్ధ పెట్టే అవకాశం దక్కుతుంది. వివరంగా చెప్పాలంటే.. ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఒకే రకమైన దుస్తులు వేసుకుంటారు. ఎప్పుడూ ఒకే రకమైన వస్త్రధారణలో ఉంటారు. ఆయనే కాదు.. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్, మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ఇలా చాలా మంది డైలీ ఒకే రకమైన దుస్తులను ధరిస్తారు. అలా వాళ్లు రోజులో మొదటి పనినే విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇదే వారికి పెద్ద అడ్వాంటేజ్. ఫుడ్ విషయంలోనూ అలాగే చేస్తే బెటర్. రొటీన్ ఫుడ్‌కు అలవాటు పడితే దాని గురించి పెద్దగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు. ఏ కూర వండుకోవాలి? ఏం తినాలి? ఏ టిఫిన్ చేసుకోవాలి? లాంటి వాటి నుంచి దూరంగా ఉండవచ్చు.

జీవితంలో కొత్త విషయాలు ఇంట్రెస్టింగ్‌నే ఉంటాయి. కానీ.. రొటీన్‌గా చేసేవి సులువుగా ఉంటాయి. అవి టైంతో పాటు, మానసిక పరిపక్వతను పెంచుతాయి. చిన్న చిన్న విషయాలను పక్కనపెట్టి, పెద్ద లక్ష్యం కోసం వెతికేప్పుడు ‘రొటీన్’ చాలా ఉపయోగపడుతుంది. నిత్య జీవితంలో కొన్ని సందర్భాలు రొటీన్‌ అయితే, మెంటల్ స్ట్రెస్ తగ్గి, కీలక అంశాలపై దృష్టి పెట్టేందుకు దోహదం చేస్తుంది.

First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading