కామసూత్ర చెప్పింది.. ఇవి తింటే పడక గదిలో దుమ్ము రేపాల్సిందే..

Kamasutra : సెక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పుడు రకరకాల మందులు దొరుకుతున్నాయి. వయాగ్రా లాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ, పురాతన కాలంలో ఇలాంటివేవీ లేవు.

news18-telugu
Updated: July 6, 2020, 9:56 PM IST
కామసూత్ర చెప్పింది.. ఇవి తింటే పడక గదిలో దుమ్ము రేపాల్సిందే..
కామసూత్ర 2
  • Share this:
శృంగారం అంటే ఆనందం.. ఆహ్లాదం.. సుఖం.. సంతోషం.. ఇవన్నీ దక్కాలంటే పడకగదిలో దుమ్ము రేపాలి. మరి, భాగస్వాములిద్దరిలో ఆ కోరికలు పీక్ లెవల్‌లో ఉండాలి. దానికి తగ్గట్లు శక్తి ఉండాలి. అంటే.. సెక్స్ సామర్థ్యం ఉండాలి. సెక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పుడు రకరకాల మందులు దొరుకుతున్నాయి. వయాగ్రా లాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ, పురాతన కాలంలో ఇలాంటివేవీ లేవు. మరి ఆ కాలంలో ఎలా శృంగార సామర్థ్యాన్ని పెంచుకొనేవారంటే.. పాలు.. కామసూత్ర ప్రకారం పాలను మించిన సెక్స్ ఫుడ్ ఇంకోటి లేదు. అందుకే శోభనం రోజు వధువు పాల గ్లాస్‌తోనే పడకగదికి వెళ్తుంది. భార్యభర్తలిద్దరు పాలు తాగి సెక్స్ జీవితాన్ని మరింత రంజుగా మార్చుకొనేందుకు ఇలా చేయిస్తారు పెద్దలు. ఆ పాలల్లో చక్కెర, తేనె కలిపి ఇస్తారు. అవి తాగితే.. ఫర్టిలిటీ రేటు, సెక్స్ సామర్థ్యం బాగా పెరుగుతుందట.

కుంకుమపువ్వు.. వేడి పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని మిక్స్ చేసుకొని తాగితే.. పురుషుల్లో వీర్య వృద్ధి కలుగుతుందట. సెక్స్ స్టామినా కూడా ఎక్కువవుతుందట.
శతావరి.. ఈ మొక్కల్లో వీర్యాన్ని వృద్ధి చేసే లక్షణాలు బాగా ఉంటాయట. రాత్రి పూట పడకగదిలోకి వెళ్లేముందు గుళికలుగా చేసుకొని మింగితే దుమ్మురేపేయొచ్చు.
వెల్లుల్లి.. సంతానోత్పత్తిని పెంచడంలో వెల్లుల్లి పాత్ర అమోఘం. ఈస్ట్రోజెన్ స్థాయులను బ్యాలెన్స్ చేయడంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. అందుకే పుర్వీకులు వీటిని ఎక్కువగా తినేవారట.

కుంకుమపువ్వు..


అశ్వగంధ.. గుర్రం మూత్రం వాసనను కలిగి ఉంటుంది. గుర్రంలా స్ట్రాంగ్‌గా, స్టామినా ఇచ్చేందుకు అశ్వగంధ ఉపయోగపడుతుందని చాలా మంది భావిస్తుంటారు. అందుకే సెక్స్ చేసేముందు దీన్ని తింటే పండగే.

మెంతులు.. చాలామంది మగవారు లైంగిక సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు మెంతికూర, మెంతులను రెగ్యులర్‌గా తీసుకుంటే సమస్య తీరుతుంది. కామసూత్ర ఈ ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.
benefits of fenugreek seeds
మెంతులు


జాజికాయ.. ఇది వీర్యవృద్ధికి తోడ్పడుతుంది. జాజికాయను సన్నని సెగపై నేతిలో వేయించి పొడి చేసుకుని డబ్బాలో భద్రపరుచుకొని, ప్రతిరోజు ఐదు గ్రాముల చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం పాలతో కలిని సేవిస్తే, సంతానలేమితో ఉన్న వారికి అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.

కిరా జారి.. నేపాల్, టిబెట్, చైనాల్లో వీటిని ఎక్కువగా అమ్ముతారు. రేటు కూడా ఎక్కువే. కామసూత్రలోనూ దీని గురించి ప్రస్తావించారు. ఇవి తింటే సెక్స్ స్టామినా పది రెట్లు పెరుగుతుందట.
Published by: Janardhan V
First published: July 6, 2020, 9:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading